హైదరాబాద్ శివారుగా భావించే ప్రాంతాల్లో ఒకటి భువనగిరి. గతంలో ఇక్కడ రియల్ భూమ్ ఊహించనంతగాఉండేది. కానీ ఇప్పుడు స్తబ్దత కనిపిస్తోంది. ధరలు కూడా తగ్గాయి. కానీ భవిష్యత్ ను అంచనా ఊహించని వృద్ధి కనిపించే అవకాశం ఉంది. ఉపాధి కోసం హైదరాబాద్ వచ్చే వారికి ఈ ప్రాంతం హాట్ ప్రాపర్టీగా మారే అవకాశాలు ఉన్నాయి.
భువనగిరి హైదరాబాద్-వరంగల్ హైవే (NH-163) సమీపంలో ఉంది. భువనగిరి చుట్టూ చిన్న తరహా పరిశ్రమలు, గిడ్డంగులు, లాజిస్టిక్స్ హబ్‌లు అభివృద్ధి చెందుతున్నాయి. ఇవి ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయి. ఇళ్లకు డిమాండ్ సృష్టిస్తున్నాయి. భువనగిరిలో ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ. 4,000 నుంచి రూ. 10,000 వరకు ఉన్నాయి. హైదరాబాద్ శివార్లలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా తక్కువ అనుకోవచ్చు. 2 BHK ఇళ్లు రూ. 20 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు లభిస్తున్నాయని స్థానిక బ్రోకర్లు చెబుతున్నారు.
ఫామ్ హౌస్‌లు కట్టుకోవాలనుకునేవారికి కూడా ఈ ఏరియా లాభసాటిగా ఉండనుంది. ప్రస్తుతం ఎకరా రూ. 30 లక్షలకు లభిస్తోంది. రహదారికి కాస్త దగ్గరగా ఉంటే ఎక్కువ ధర చెబుతున్నారు. భువనగిరి రియల్ ఎస్టేట్ మార్కెట్ దీర్ఘకాలంలో వృద్ధి చెందే అవకాశం ఉంది. హైవే సమీపంలో ఉన్న ప్రాంతాలకు భవిష్యత్తులో మంచి రాబడిని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. భువనగిరికి అన్ని ప్లస్ పాయింట్లు ఉన్నా.. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ నెమ్మదించిన ప్రభావం ఇక్కడా కనపడుతోంది. ధరలు తగ్గినప్పుడే కొనుగోలు చేస్తే వచ్చే పదేళ్లలో అనూహ్యమైనా రిటర్న్స్ సాధించవచ్చని నిపుణులు అంటున్నారు.