నాపై నిఘా ఎందుకు? ప్రొఫెసర్ కోదండరాం

తెలంగాణాలో ఓటుకి నోటు కేసు ఎంత సంచలనం సృష్టించిందో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారుల ఫోన్లని తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం అంతే సంచలనం సృష్టించింది. ఓటుకి నోటు కేసు కారణంగా తెదేపా, ఫోన్ ట్యాపింగ్ కారణంగా తెరాస చాలా అప్రదిష్ట మూటగట్టుకొన్నాయి. చివరికి రెండు ప్రభుత్వాలు ఆ కేసులని అటకెక్కించేసి చేతులు దులుపుకొన్నాయి. అది వేరే సంగతి. కానీ నేటికీ తెలంగాణా ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూనే ఉందని రాష్ట్రంలో ప్రతిపక్షాలు, తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపిస్తుండటం చాలా దిగ్బ్రాంతి కలిగిస్తుంది.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణా రాజకీయ జేఏసి తన ప్రాధాన్యతని కోల్పోయింది. కోల్పోయింది అనేకంటే తెరాస ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చే ఉద్దేశ్యంతోనే మౌనం వహించిందని చెప్పవచ్చు. సుమారు రెండేళ్ళపాటు తెలంగాణా ప్రభుత్వ పనితీరుని మౌనంగా గమనించిన తెలంగాణా రాజకీయ జేఏసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, ఇప్పుడు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఇతర కార్యక్రమాలని అధ్యయనం చేసి వాటిలో లోటుపాట్లని ఎత్తి చూపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణా రాజకీయ జేఏసి మళ్ళీ ఇప్పుడు రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం మొదలుపెట్టడంతో సహజంగానే తెరాస ప్రభుత్వానికి ఆందోళన కలిగించి ఉండవచ్చు.

అయితే దాని కోసం ప్రొఫెసర్ కోదండరాం మరియు జేఏసి నేతలపై నిఘా పెట్టడం, వారి ఫోన్లని ట్యాపింగ్ చేయడం నిజమైతే, దానిని ఎవరూ హర్షించలేరు. తమ ఫోన్లని ట్యాపింగ్ చేయవలసిన అవసరం ఏమిటని ప్రొఫెసర్ కోదండరాం కూడా ప్రశ్నిస్తున్నారు. తమ కార్యక్రమాలన్నీ చాలా పారదర్శకంగా, బహిరంగంగానే జరుగుతుంటాయని, ఆ వివరాలు కావాలనుకొంటే తెలంగాణా ప్రభుత్వం నేరుగా తమనే సంప్రదించవచ్చు కదా నిఘా పెట్టడం ఎందుకని ప్రొఫెసర్ కోదండరాం ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా తెరాస ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

తెరాస పార్టీ ఈ రెండేళ్ళలో తెలంగాణాలో చాలా బలపడింది. అదే సమయంలో రాష్ట్రంలో ప్రతిపక్షాలని దాదాపు నిర్వీర్యం చేసింది. ప్రతీ చిన్న ఎన్నికలని కూడా సాధారణ ఎన్నికలనంత సీరియస్ గా తీసుకొని పక్కా ప్రణాళికతో రకరకాలా వ్యూహాలు అమలుచేస్తూ వరుసగా విజయాలు సాధిస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్షాలపై, జేఏసి నేతలపై నిఘా పెట్టడం గమనిస్తే అది ఇంకా తీవ్ర అభ్రదతా భావంతోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది. దాని అభద్రతా భావానికి కారణం తమ ప్రభుత్వమే శాస్వితంగా అధికారంలో కొనసాగాలనుకోవడమేనని చెప్పవచ్చు. అధికార దాహం లేని వాళ్ళకి ఇటువంటి భయాలు, అభద్రతా భావం ఉండవు.

మన ప్రజాస్వామ్య వ్యవస్థలో శాశ్వితంగా ఒకే పార్టీ అధికారంలో ఉండటం అసాధ్యం అని తెలిసినా, దానిని సుసాధ్యం చేసుకోనేందుకే ఇటువంటి అప్రజాసామిక పద్దతులకి దిగజారుతున్నాయని చెప్పక తప్పదు. ఇది చాలా శోచనీయం. రాష్ట్రాని సర్వతోముఖాభివ్రుద్ధి చేసి తమ పాలనతో ప్రజలను సంతృప్తిపరచగలిగితే వారు తమకే పట్టం కడతారనే సంగతి తెరాసకి తెలుసు. కానీ ఆత్మవిశ్వాసం లేనందునో లేదా తమ పాలన పట్ల, తాము చేస్తున్న పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా లేరని గ్రహించినందునో లేదా తమ పార్టీకి వచ్చే ఎన్నికలలో జేయేసి నుంచి సవాలు ఎదురవుతుందనే భయంతోనో తెరాస ప్రభుత్వం ఇటువంటి పనులకి పాల్పడుతున్నట్లు అనుమానించవలసి ఉంటుంది. ఇటువంటి పనుల వలన తెరాస ప్రభుత్వం సంపాదించుకొన్న మంచిపేరు కూడా మంటగలిసిపోయి, ప్రజలలో దానిపట్ల వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని గ్రహిస్తే మంచిది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఫలితం ఆశించకుండా చిత్తశుద్ధితో మన ధర్మం మనం నిర్వర్తిస్తే చాలు. అద్భుత్మమైన ఫలితాలు వాటంతట అవే వస్తాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close