పాక్ కు గురి- చైనాకు హెచ్చరిక – ఇరాన్ భుజంపై ఇండియా ఫిరంగి!

సైనికులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడులకు ప్రతీకారంగా భారత సైనిక కమాండోలు పాకిస్తాన్ భూభాగంలో మెరుపుదాడులు / సర్జికల్ ఎటాక్స్ చేసి వచ్చిన సంఘటన ఉద్వేగపూరితమైన ప్రచారంగా కొనసాగుతోంది. ఈ సంఘటన జరుగుతున్నప్పుడే పాకిస్థాన్ లో పశ్చిమ ప్రాంతం బెలూచిస్థాన్ వైపు ఇరాన్ కూడా భారీ ఫిరంగులను / మోర్టార్ షెల్స్ పేల్చింది. ఇది భారత్, ఇరాన్ దేశాలు కూడబలుక్కుని చైనా కు చేసిన హెచ్చరిక!

పాకిస్థాన్ కు మిత్రుడైన చైనా ఈ వ్యూహాత్మక సర్జికల్ దాడులకు నెగెటివ్ గా స్పందిస్తుందేమోనని ఇండియా సందేహించింది… అందుకని ఇరాన్ ను రంగంలోకి దింపింది.

పొరుగు దేశాలైన ఇరాన్ కూ పాకిస్థాన్ కూ పడదు… అయితే చైనా ప్రపంచశక్తిగా ఎదిగేందుకు, గల్ఫ్ ప్రాంతంలో తన పట్టు పెంచుకునేందుకు, అరేబియా సముద్రంపై గ్రిప్ సంపాదించి, పనిలోపనిగా ఇండియాకు చెక్ పెట్టేందుకు చైనా వ్యూహాత్తకంగా సిల్క్ రూట్ పేరిట, ఎకనమిక్ కారిడార్ పేరిట పాకిస్థాన్ లోని గ్వదర్ పోర్టుకు నిధులిచ్చింది…

అది పాకిస్థాన్ కు పడమరలో… అది ఎంతోకాలంగా పాకిస్థాన్ నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న కాశ్మీర్ వంటి సమస్యాత్మక ప్రాంతం…. ఆ బెలూచిస్థాన్ లో తన నేవీ బేస్ ఏర్పాటు చేసుకుని, పాకిస్థాన్ లో గట్టి స్ధావరంఏర్పాటు చేసుకోవడమే చైనా ఎత్తుగడ…

ఇది గమనించిన ఇరాన్, ఇండియా ఒక్కటయ్యాయి. ఇరాన్ లో చబహార్ పోర్టుకు ఇండియా నిధులిచ్చింది. అవసరమైతే ఇండియా అక్కడ అణు జలాంతర్గాములను మొహరించే చాన్స్ దొరికింది. ఈ మొత్తం ప్రక్రియకు అమెరికా మద్దతునిచ్చింది. ఇది చైనాకు షాక్. ఈ చబహార్ పోర్టు అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధికి సమీపంలో ఉంది.

ఈ జలసంధి మొత్తం గల్ప్ దేశాలకు ఎంత కీలకమంటే… ఓసారి యురేనియం తయారీ కోసం ఇరాన్ ఆ జలసంధిని రెండు రోజులు మూసేసింది… దీంతో చైనా గిలగిలా కొట్టుకుంది… ఇక్కడి నుంచి చైనాకు రోజుకు అయిదు లక్షల ముడి చమురు బ్యారెళ్లు వెళ్తాయి… అదీ కారణం… అవన్నీ అరేబియా సముద్రం నుంచి చైనాకు చేరుకునేవరకు కొన్ని వేల కిలోమీటర్ల సముద్రజలాలు ఇండియా పరిధిలోకి వస్తాయి… అలాంటి కీలకమైన ప్రాంతం కావడంతో ఇరాన్ ఏం చేస్తుందనేది ఎప్పుడూ చైనా గమనిస్తూ ఉంటుంది… ఒకేసారి ఇరాన్ పాకిస్థాన్ వైపు షెల్స్ ప్రయోగించడం మొదలుపెట్టిందో అప్పుడే చైనాకు షాక్ తగిలింది….

పరిస్థితి విషమిస్తే, చైనా గనుక పాకిస్థాన్ కు మద్దతుగా రంగంలోకి దిగితే ఇరాన్ కూడా వెంటనే రంగంలోకి దిగుతుందనే విషయం దానికి అర్థమైంది…. అది అర్థం కావటానికే ఇరాన్ ఆ పనికి పూనుకుంది. అలాగే పాకిస్థాన్ సైన్యం దృష్టి మళ్లించడం అనేది మరో కారణం.

అంతేకాదు…. అమెరికా, ఇరాన్ తో కలిసి ఇండియా త్వరలోనే అరేబియా సముద్రజలాల్లో భారీ సైనిక విన్యాసాలనూ ప్రదర్శించబోతున్నది…. అది చైనాకు ఓ ముందస్తు హెచ్చరిక అవుతుంది….

అంతర్జాతీయ రాజకీయాలు ఇలాగే ఉంటాయి…. సర్జికల్ దాడులకు ముందు ఇండియా ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో చెప్పడానికే ఇదంతా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close