దేవిశ్రీ పెళ్లి ఖాయ‌మైందా?

టాలీవుడ్‌కి పెళ్లిళ్ల సీజ‌న్ వ‌చ్చేసిన‌ట్టుంది. అఖిల్ పెళ్లికి రెడీ అయ్యాడు. నాగ‌చైత‌న్య కూడా త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్ర‌భాస్, రానాలు 2017లో పెళ్లి చేసుకోనున్నార‌ని టాక్‌. అనుష్క‌కీ సంబంధం ఖాయ‌మైపోయిందంటున్నారు. ఇప్పుడు దేవిశ్రీ ప్ర‌సాద్ మ‌న‌సు కూడా పెళ్లి వైపు ప‌రుగులు పెడుతోంద‌ని టాక్‌. దేవీశ్రీ ప్ర‌సాద్ వ‌య‌సు 35. అంటే దాదాపుగా పెళ్లీడు వ‌చ్చి వెళ్లిపోతోంది కూడా. దేవి పెళ్లి గురించి ఎప్ప‌టి నుంచో గాసిప్పులు న‌డుస్తున్నాయి. ఓ క‌థానాయిక‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నాడ‌ని, వాళ్లిద్ద‌రూ పెళ్లి చేసుకొంటార‌ని చెప్పుకొన్నారు. అయితే.. అవ‌న్నీ గాసిప్పులుగా తేలిపోయాయి. ఈసారి దేవికి ఇంట్లో ఓ సంబంధం ఖాయం చేశార‌ట‌. ఇటీవ‌ల దేవి తండ్రి స‌త్యమూర్తి క‌న్నుమూశారు. అందుకే వీలైనంత త్వ‌ర‌లో ఆ ఇంట్లో ఓ శుభ‌కార్యం చేయాల‌ని ఇంట్లోవాళ్లు ప‌ట్టుబ‌డుతున్నార‌ని తెలుస్తోంది. దానికి దేవి పెళ్లితో ముడిపెట్టార‌ట‌.

దేవి కూడా త్వ‌ర‌గా పెళ్లి చేసుకొని సెటిలైపోవాల‌ని చూస్తున్నాడు. దేవిశ్రీ కి ఇంట్లో వాళ్లు ఓ సంబంధం చూశార‌ని, అమ్మాయిది తూర్పుగోదావ‌రిలోని ఓ ప‌ల్లెటూర‌ని, బాగా చ‌దువుకొన్న కుటుంబం అని తెలుస్తోంది. దేవికీ ఈ సంబంధం న‌చ్చింద‌ని తెలుస్తోంది. 2017 ప్ర‌ధ‌మార్థంలో దేవి పెళ్లి ఉండొచ్చ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ప్ర‌స్తుతం ఖైదీ నెం. 150కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించే ప‌నిలో బిజీగా ఉన్నాడు దేవిశ్రీ‌. ఈ స్వ‌ర సంచ‌ల‌నం నోరు విప్పితే గానీ పెళ్లి కి సంబంధించిన డిటైల్స్ తెలీవు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close