విశ్లేషణ : దళితులు, ఆంధ్ర రాజకీయాలు – పార్ట్ 2

వర్గీకరణ అనంతరం కాంగ్రెస్ ఓటుబ్యాంకు లో మార్పులు చేర్పులు

చంద్రబాబు ముఖ్యమంత్రి కాక ముందు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్న దళితుల ఓట్ బ్యాంక్ చంద్రబాబు సమయంలో చీలిపోయింది. అయితే మందకృష్ణకు చంద్రబాబు మద్దతు పూర్తిగా ఉండడంతో, మాల మహానాడు కు చెందిన మిగతా నేతలు కాంగ్రెస్ ను , వైఎస్.రాజశేఖర్ రెడ్డిని ఆశ్రయించారు. మాల మహానాడు లో ప్రముఖ పాత్ర పోషించిన జూపూడి ప్రభాకర్ లాంటివారు వైయస్ రాజశేఖర్ రెడ్డి కి సన్నిహితులు అయిపోయారు. దీంతో ఆ సామాజిక వర్గం కాంగ్రెస్ కు వెన్నంటి నిలబడింది. అయితే రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత.. క్రైస్తవుల్లో, ప్రత్యేకించి దళిత క్రైస్తవులలో వైయస్ రాజశేఖర్రెడ్డి మీద అభిమానం పెరిగింది. వైయస్ కుటుంబ సభ్యులు పలు క్రైస్తవ సభలలో పాల్గొనడమే కాకుండా, పేద పాస్టర్లకు వారు వ్యక్తిగతంగా సహాయం చేయడం కూడా క్రైస్తవ వర్గానికి వైఎస్ కుటుంబం మీద అభిమానం పెరిగేలా చేసింది.

వైయస్ జగన్ పార్టీ కి కంచుకోటగా దళిత ఓటు బ్యాంక్

వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఎనలేని అభిమానం పెంచుకున్న దళిత క్రైస్తవుల తో పాటు, క్రైస్తవులు కానీ దళితులు కూడా జగన్ కి అండగా నిలిచారు. ప్రత్యేకించి, రాయలసీమ జిల్లాల్లోని దళితులు ఎక్కువ శాతం జగన్ కి అండగా నిలబడ్డారు. 2014 ముందు వరకు కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాలుగా ఉన్న దళితులు కూడా రాష్ట్ర విభజన అనంతరం వైఎస్సార్ సీపీకి అభిమానులుగా మారిపోయారు. ఈ రెండు కారణాల వల్ల వైఎస్ జగన్ కి దళితులు బలమైన ఓటు బ్యాంకుగా ఏర్పడ్డారు.

పవన్ కళ్యాణ్, రెల్లి సామాజిక వర్గం

పవన్ కళ్యాణ్ మొన్న మేనిఫెస్టోలో రెల్లి సామాజిక వర్గానికి సబ్సిడీ రుణాలు, ఆ కులానికి చెందిన ఆడపడుచులకు ఉచితంగా స్కూటర్లు ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో చాలా మందికి అసలు ఈ పేరుతో ఒక కులం ఉన్నట్టుగా కూడా బహుశా తెలియకపోవచ్చు. “దళితులలోనే దళితులు ” గా పిలవబడే రెల్లి సామాజిక వర్గం బహుశా మిగతా అన్ని దళిత కులాల కంటే ఎక్కువ వివక్ష, ఎక్కువ వేదనను అనుభవించిన సామాజిక వర్గం. స్వతహాగా వీరు సంచార జీవులు అయినప్పటికీ, కాలక్రమేణా ఈ కులం పారిశుద్ధ్య కార్మికులు గా మిగిలిపోయారు. వీరిలో కొంతమంది “మాన్యువల్ స్కావెంజింగ్” వృత్తిలో కొన్నేళ్ల పాటు నలిగిపోయారు. బహుశా మాన్యువల్ స్కావెంజింగ్ అంటే ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. వెట్ టాయిలెట్లు, ఫ్లష్ కమోడ్ లు లేని కాలంలో ఇళ్లలో డ్రై టాయిలెట్లు ఉండేవి. రోజు ఉదయం ఈ పారిశుద్ధ్య కార్మికులు ఇళ్లకు వచ్చి, డ్రై టాయిలెట్ ల లోని మలాన్ని గంపలోకి ఎత్తుకొని, ఆ గంపను నెత్తిమీద మోసుకుంటూ తీసుకెళ్లి ఊరవతల పడేసేవారు. బహుశా ఇప్పుడు ఈ టాపిక్ ఇలా చదవడం కూడా కొంతమందికి ఇబ్బందికరంగా అనిపించవచ్చేమో కానీ, మరి వారు, పొట్టకూటి కోసం అందరి ఇళ్ళలో ని వేస్టు ని నెత్తి మీద గంప పెట్టుకొని మోసుకుంటూ వెళ్లడం ఎంత దయనీయమైన సంగతో అన్నది ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ కులం లోని ఎక్కువమంది చేపడుతున్న ఈ వృత్తి కారణంగా, వీరు విపరీతమైన వివక్షకు అంటరాని తనానికి గురయ్యారు. అందుకే వీళ్లను దళితుల్లోనే దళితులు అని సామాజిక వేత్తలు అంటూ ఉంటారు.

కానీ వీరి జనాభా అతి స్వల్పం. రాష్ట్రం మొత్తం మీద లక్ష ఓట్ల కంటే ఎక్కువ ఉండవు. అతి స్వల్ప జనాభా కలిగిన కారణంగా రాజకీయ పార్టీలు కూడా వీరిని ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓట్ల సంఖ్య తో నిమిత్తం లేకుండా సమస్య తీవ్రతను బట్టి సమస్యలపై గళమెత్తిన పవన్ కళ్యాణ్- రెండు మూడు మండలాలకు మించి ప్రభావం చూపని ఉద్దాన సమస్యను, 1500 మంది మించి ఎక్కువ ఓట్లను సంపాదించలేని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సమస్యను, 500 కుటుంబాల ను మించి ఎక్కువ ఓట్లను తీసుకురాలేని శెట్టిపల్లి భూముల సమస్యలను లేవనెత్తి నట్లుగానే, రెల్లి కుల సమస్యలను కూడా లేవనెత్తారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు తమను ఏ పార్టీ పట్టించుకోలేదని, తమ సమస్యలపై మొదటిసారి గళమెత్తింది పవన్ కళ్యాణేనని, రెల్లి కులానికి చెందినవారు పవన్ కళ్యాణ్ సభలలో కన్నీటి పర్యంతమై పోయారు.

మీడియాలో పెద్దగా కవరేజ్ కు నోచుకోని ఒక వార్తను ఇక్కడ ప్రస్తావించుకోవాలి. పవన్ కళ్యాణ్ పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర సందర్భంగా ఒక కళ్యాణ మండపం లో బస చేసినప్పుడు మధ్యరాత్రి కొంతమంది ఆకతాయిలు ఆ ప్రాంగణానికి వచ్చి వీరంగం సృష్టించాలని ప్రయత్నిస్తే, అక్కడ గొడవ కాకుండా చూడడం లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది కి ఎంత పాత్ర ఉందో, అంతకంటే ఎక్కువ పాత్ర అక్కడికి నిమిషాల్లో చేరుకున్న రెల్లి యువకులకు ఉంది. బహుశా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఓట్లను పవన్ కళ్యాణ్ కి తీసుకు రాలేకపోవచ్చు కానీ, ఓట్ల సంఖ్య తో నిమిత్తం లేకుండా పవన్ కళ్యాణ్ అత్యంత వివక్షకు గురైన ఒక సామాజిక వర్గానికి అండగా నిలబడడం ఎంతో మందిని ఆకట్టుకుంది.

Click here for part 1

మాయావతి ఫ్యాక్టర్ ఆంధ్రా ఎన్నికలలో ఉంటుందా?

భారతదేశంలో దళితులను, రాజకీయాలను కలిపి ప్రస్తావించిన ఏ చర్చ కూడా కాన్షీరామ్ కానీ, మాయావతిని కానీ ప్రస్తావించకుండా ముగించబడదు. ఒక జాతీయ రాజకీయ పార్టీ తమ పార్టీ తరఫున ఒక దళితున్ని ముఖ్యమంత్రిగా చేయడం వేరు, దళితులే సొంతంగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వేరు. అసాధ్యం అనుకున్న ఆ ఫీట్ ని సుసాధ్యం చేసిన కారణంగా మాయావతికి దేశవ్యాప్తంగా దళితుల్లో అభిమానులున్నారు. అయితే మాయావతి పై అభిమానం ఉన్నప్పటికీ, ఆయా రాష్ట్రాల్లో వారు అభిమానించే పార్టీలకే ఓటు వేస్తున్నారు. అయితే ఏదైనా బలమైన పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కానీ, బలమైన అభ్యర్థులను పోటీకి నిలబెట్టినప్పుడు కానీ మాయావతి పార్టీకి ఇతర రాష్ట్రాల్లో కూడా ఓట్లు బాగానే వచ్చాయి. 2018 తెలంగాణ ఎన్నికల్లో ఆ పార్టీ గణనీయమైన ఓట్లు సాధించింది. అయితే దీనికి మాయావతి మీద ఉన్న అభిమానంతో పాటు బలమైన అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు గా కాకుండా బి ఎస్ పి గుర్తు మీద పోటీ చేయడం కూడా ఒక కారణం. 2019 ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలలో మాయావతి జనసేన తో కలిసి పోటీ చేయబోతోంది. దాదాపు 15 శాతం జనాభా ఉన్న దళితులలో, 2-3 శాతం వరకు మాయావతి పార్టీ వెంట నడిచే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నట్లు గా మాయావతి వ్యాఖ్యానిస్తే, మాయావతిని దేశ ప్రధానిగా చూడాలనుకుంటున్నట్లు గా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. జనసేన బహిరంగ సభలో కూడా మాయావతి పాల్గొనే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. దీంతో, దళితుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, కనీసం ఒక రెండు శాతం ఓట్లు మాయావతి కారణంగా జనసేన కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తానికి గత కొద్ది దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో దళితుల పాత్ర ఇది. అయితే ఉత్తరప్రదేశ్లో మాదిరిగా, మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా, దళితులే స్వయంగా ఒక పార్టీని స్థాపించి, దానిని బలమైన స్థాయికి తీసుకు వెళ్లడం అనేది ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. అయితే శరవేగంగా మారుతున్న సామాజిక సమీకరణాల కారణంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో అలాంటి అవకాశం ఉందేమో అన్నది వేచి చూడాలి. అందరూ కుల రహిత సమాజాన్ని కాంక్షిస్తారు. కానీ అది సాధ్యం కానప్పుడు కనీసం అన్ని కులాలకు సమాన అవకాశం అయినా కల్పించబడాలి. భారతదేశంలో ఈ మార్పు ఎప్పటికి వస్తుంది అన్నది వేచి చూడాలి.

జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close