చిరంజీవి పై ఏబీఎన్ ఆర్కే మరో విషపు పలుకు

ఏబీఎన్ రాధాకృష్ణ తన పత్రికలో రాసే సంపాదకీయం ” కొత్త పలుకు” లో మరొకసారి చిరంజీవి విరుచుకుపడ్డారు. ఇటీవల చిరంజీవి నేతృత్వంలోని బృందం జగన్ ని సినీ పరిశ్రమ సమస్యలపై కలిసినప్పుడు చాలా తెలివిగా సినీ పరిశ్రమ లో లక్షలాది కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ రాకుండా, అమరావతి మీద మాత్రమే చర్చ జరిగేలా కొన్ని టిడిపి అనుకూల చానల్స్ వ్యూహం రచించాయి అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టిడిపి అనుకూల పత్రికగా, టిడిపి అనుకూల ఛానల్ గా ముద్రపడ్డ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి లో వచ్చిన కొత్త పలుకు లో మరొకసారి చిరంజీవిని టార్గెట్ చేయడం మెగా అభిమానులకు మింగుడు పడడం లేదు.

Click here : చిరంజీవి మీద విరుచుకుపడ్డ ఏబీఎన్ , టీవీ5

సినీ పెద్దలు స్టూడియోల కోసం జగన్ ని భూములు అడగడం ఎబ్బెట్టుగా ఉంది అంటున్న రాధాకృష్ణ

రాధాకృష్ణ కొత్త పలుకు లో వ్రాస్తూ, “తెలుగు ప్రజలు కరోనా వైరస్‌ కారణంగా ఇబ్బందులు పడుతుంటే చిరంజీవి నేతృత్వంలోని కొంతమంది సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని కలిసి తమకు విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములు కేటాయించడంతోపాటు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని కోరడం ఎబ్బెట్టుగా లేదా? దశాబ్దం క్రితమే విశాఖలో దివంగత రామానాయుడు నిర్మించిన స్టూడియో ఇప్పటికీ ఈగలు తోలుకుంటోంది. కరోనా కారణంగా మున్ముందు సినిమాల భవిష్యత్‌ ఏమిటో తెలియని స్థితిలో భూములు అడగటం ఎలా సమర్థనీయం.” అని రాసుకొచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న స్టూడియోలే షూటింగులు లేక వెలవెలబోతున్నాయి. ఇక విశాఖలో స్టూడియోల అవసరం ఉంటుందా? అంటూ ప్రశ్నించారు రాధాకృష్ణ.

అయితే మెగా అభిమానులతో పాటు పలువురు రాధాకృష్ణ వాదన ని తిప్పి కొడుతున్నారు. హైదరాబాదులో రామోజీ ఫిలిం సిటీ కి భూములు చంద్రబాబు కేటాయించినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ అనుకూలురు కొందరికి హైదరాబాదులో వివిధ కారణాల చేత ప్రభుత్వ భూములు కేటాయించినప్పుడు కానీ, ఏ మాత్రం ఎబ్బెట్టుగా అనిపించక పోగా, ఇప్పుడు మాత్రమే రాధాకృష్ణకు ఎందుకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక వర్గం గుప్పిట్లో మాత్రమే ఉన్న స్టూడియోలు, మీడియా లో కి ఇతర వర్గాల వారు రావడం రాధాకృష్ణకు కంటగింపుగా ఉందా అంటూ వారు అడుగుతున్నారు.

ప్లాస్టిక్ సర్జరీల హీరోలకు మున్ముందు ఆదరణ ఉండదంటున్న రాధాకృష్ణ, లైపోసెక్షన్ హీరోల గురించి మాట్లాడాలేరా అంటూ విమర్శలు:

రాధాకృష్ణ తన సంపాదకీయంలో రాస్తూ, “కరోనా ఎఫెక్ట్‌ కారణంగా ఓటీటీ ప్రాధాన్యం పెరిగింది. మట్టిలో మాణిక్యాలు వంటి అద్భుత నటులతో షార్ట్‌ ఫిల్మ్‌లు తీస్తున్నారు. ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ప్లాస్టిక్‌ సర్జరీలతో తెర మీద అలరిస్తున్న హీరోలకు మున్ముందు ఆదరణ ఉండకపోవచ్చు. పెద్ద హీరోలుగా చలామణి అవుతున్నవారు ప్రస్తుత పరిస్థితులలో షూటింగులకు ఇష్టపడటం లేదు. మిగతావాళ్లకు 60 ఏళ్లు దాటాయి. 60 దాటినవాళ్లు షూటింగులలో పాల్గొనకూడదని ప్రభుత్వాలు షరతులు విధించాయి. ఇంతోటి దానికి అమరావతి వెళ్లి రైతులను కూడా కలవడానికి ఇష్టపడకుండా ముఖ్యమంత్రిని మాత్రమే కలిసి కోర్కెల చిట్టా ఇవ్వడాన్ని సదరు ప్రముఖులు ఎలా సమర్థించుకుంటారు? ” అని వాదించుకొచ్చారు రాధాకృష్ణ.

అయితే రాధాకృష్ణ వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ప్లాస్టిక్ సర్జరీ హీరో లు, లైపోసెక్షన్ హీరో లు, జాతకాలు పిచ్చి ఉన్న హీరోలు, అమ్మాయిల పిచ్చి ఉన్న హీరోలు అంటూ ఒక హీరో అభిమానులు ఇతర హీరోలను విమర్శించడం అతి తక్కువ స్థాయి మానసిక పరిణితి కలిగిన, వెర్రితలలు వేసేంతగా సినీ అభిమానం, కుల అభిమానం కలిగిన , వ్యక్తులు చేసే పని అని, ఒక పత్రికకు అధిపతి స్థాయి కలిగిన వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం అని రాధాకృష్ణ సంపాదకీయాన్ని చదివిన పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రేక్షకులకు సినిమా కథ, కథలోని హీరో పాత్ర నచ్చితే అభిమానిస్తారే తప్పించి, ఆ హీరో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాడా? లైపోసెక్షన్ చేయించుకున్నాడా? వేరే వాళ్ల మీద హత్యా ప్రయత్నాలు చేశాడా? టాడా లాంటి కేసులలో జైలు కెళ్ళి వచ్చాడా? వంటివి పట్టించుకోరని భారతదేశంలోని పలు సినీ పరిశ్రమలు నిరూపించాయి అని వారంటున్నారు. అమరావతిలోని రైతుల ని కలవకపోవడం సినీ పరిశ్రమ బృందం చేసిన అతి పెద్ద నేరంగా రాధాకృష్ణ వంటి వారు ప్రొజెక్టు చేయడం కూడా జనాలకు ఎక్కడం లేదు. ముందస్తు షెడ్యూల్లో లేకుండా, అప్పటికప్పుడు అక్కడ ప్రత్యక్షమైన అమరావతి రైతులను సినీ పరిశ్రమ బృందం కలవకపోవడానికి ప్రధాన కారణం కూడా ఏబీఎన్ వంటి చానల్స్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా అప్పటికప్పుడు అమరావతి రైతులమంటూ కొందరు అక్కడ ప్రత్యక్షమవడం కూడా- ఒక పార్టీ జెండాను అజెండాను మోస్తున్న ఈ చానల్స్ రచించిన వ్యూహం అయి ఉండవచ్చు అన్న ఉద్దేశంతోనే, వేర్వేరు రాజకీయ అఫిలియేషన్స్ కలిగి ఉన్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఒక తాటిపైకి వచ్చిన తాము, ఎటువంటి రాజకీయ వివాదాలకు చోటు ఇవ్వకూడదనే ఉద్దేశం తోనే, సినీ పరిశ్రమ బృందం వారిని కలవ లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఆర్కె కొత్త పలుకు లో ని వ్యాఖ్యలను విమర్శించిన రాజకీయ ప్రతినిధులు:

ఆర్కె రాసిన కొత్త పలుకు లోని వ్యాఖ్యలను జనసేన అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్ సోషల్ మీడియా వేదికగా ఖండించారు. ” లక్షలాది మంది సినీ కార్మికుల సంక్షేమం కోసం సీఎం ని కలిస్తే అది ఏదో వ్యక్తిగత పని పై కలిసినట్లు చిరంజీవి బృందం పై విషం చిమ్ముతున్న ఆర్ కె కి గ్యాస్ బాధితులను కలవడానికి అని చెప్పి పర్మిషన్ తీసుకుని వైజాగ్ వెళ్లకుండా విజయవాడలో పార్టీ సంబరాలు చేసుకున్న చంద్రబాబు కనిపించలేదా? ” అంటూ జనసేన ప్రతినిధి ఎద్దేవా చేశారు.

మొత్తం మీద:

2019 ఎన్నికలయిన కొత్త లో టిడిపి వీరాభిమానులు చాలామంది రాధాకృష్ణ చేస్తున్న పిచ్చి పనుల వల్ల తమ పార్టీ అధికారం కోల్పోయిందని, బీజేపీని రాష్ట్రంలో ఎదగనీయకుండా ఎత్తులు వేయాలని, పవన్ కళ్యాణ్ బల పడనియ్యకుండా మీడియాను మేనేజ్ చేయాలని చంద్రబాబుకి రాధాకృష్ణ ఇచ్చిన తప్పుడు సలహాలు బెడిసి కొట్టడం వల్లే తమ పార్టీ అధికారం కోల్పోయిందని, రాధాకృష్ణ వైఖరి మార్చుకోవాలని తెలుగుదేశం అభిమానులు అప్పట్లో సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. ఇదే అభిప్రాయం పలుమార్లు పలు విధాలుగా టిడిపి అభిమానుల నుండే వచ్చింది. ఇతరులందరిమీద కొత్త కొత్త పలుకులు వ్రాసే రాధాకృష్ణ కి ఈ పాత పలుకు వినిపిస్తుందా మరి?

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close