రీసెర్చ్ షాక్ – అదానీ వ్యాపార సంస్థలు గాలి మేడలా ?

అమెరికాకు చెందిన హిన్‌డెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ.. ఆదానీ కంపెనీలపై రీసెర్చ్ చేసి బయట పెట్టిన సంచలన విషయాలు ఆ గ్రూప్‌కు పీడకలగా మారుతున్నాయి. బుధవారం ఒక్కరోజే అదానీ గ్రూప్‌ కంపెనీ షేర్లు 10% వరకు పడిపోయాయి. దీంతో, గ్రూప్‌ యజమాని, బిలియనీర్ గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద ఒక్క రోజులో $5.9 బిలియన్ల వరకు క్షీణించింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. అదానీ సంపద $5.9 బిలియన్లు తగ్గి $120.6 బిలియన్లకు దిగి వచ్చింది. అదానీ గ్రూప్ షేర్ మార్కెట్ మాయాజాలంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. అసలు కంపెనీ విలువ కోటి ఉంటే.. షేర్ మార్కెట్లో ఆ సంస్థ షేర్లు.. కొన్ని వందల కోట్ల విలువతో ఉంటున్నాయి. ఇదంతా గ్యాంబ్లింగ్ అన్న ఆరోపణలు ఉన్నాయి.

హిన్ జెన్ బర్గ్ రీసెర్చ్… అదానీ ఓ మాయా వ్యాపార ప్రపంచం నిర్వహిస్తున్నారని తేల్చింది. కొన్ని వేల పత్రాలను పరిశీలించి.. ప్రత్యక్షంగా.. పరోక్షంగా అన్ని డాక్యుమెంట్లను చూసి.. ఆరేడు దేశాల్లో రీసెర్చ్ చేసి మరీ తాము ఈ విషాయన్ని వెల్లడిస్తున్నామని హిన్ డెన్ బర్గ ్రీసెర్చ్ వెల్లడించింది. ఈ సంస్థ చేసే రీసెర్చ్‌లకు.. వెల్లడించే అంశాలకు చాలా వరకూ క్రెడిబులిటీ ఉంది. కార్పొరేట్ మాయా ప్రపంచంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని … బడా బిలియనీర్లు ఎలా ఎదుగుతున్నారో బయట పెడుతూ ఉంటుంది.

తన నివేదికలో, అదానీ గ్రూప్‌లోని అకౌంటింగ్, కార్పొరేట్ గవర్నెన్స్ లొసుగులను గురించి హిండెన్‌బర్గ్ ప్రస్తావించింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 8 సంవత్సరాల కాలంలో 5 మంది చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్లను మార్చిందని, ఇది అకౌంటింగ్ సమస్యలను సూచించే కీలకమైన రెడ్ ఫ్లాగ్” అని ఆ కంపెనీ పేర్కొంది. జనవరి 27వ తేదీన అదానీ ఎంటర్‌ప్రైజెస్ రూ. 20,000 కోట్ల ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ప్రారంభం అవుతుంది. దీనికి ముందు వచ్చిన హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌ ఆ ఎఫ్‌పీవో మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. తన నివేదికలో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై అదానీ గ్రూప్ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

2022 ఆగస్టులో ఆర్థిక సేవల సంస్థ ఫిచ్ గ్రూప్‌నకు చెందిన క్రెడిట్‌సైట్స్ కూడా అదానీ గ్రూప్‌ రుణ భారంపై రిపోర్ట్‌ విడుదల చేసింది. FY22 ముగింపు నాటికి ఆ గ్రూప్‌లోని అన్ని కంపెనీల నెత్తిన ఉమ్మడిగా ఉన్న రూ. 2.2 ట్రిలియన్ల రుణంపై ఆందోళన వ్యక్తం చేసింది. అదానీ కంపెనీలు నిజంగానే .. ఈ తరహా వ్యాపారాన్ని నిర్వహిస్తూ .. అకౌంటింగ్.. షేర్ మార్కెట్ మాయాజాలంతో నిర్వహిస్తూంటే.. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close