నాకు డబ్బు పిచ్చి లేదు: అడివి శేష్ తో ఇంటర్వ్యూ

అడివి శేష్.. పడి లేచిన కెరటం. స్వయంగా దర్శకుడిగా చేసిన ప్రయత్నాలు ఫలితాల్ని ఇవ్వలేదు. హీరోగా బ్రేక్ రావానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఎక్కడా నమ్మకం కోల్పోకుండా ప్రేక్షకులకు కొత్తదనం చూపించాలనే తాపత్రయం ఆయన్ని మళ్ళీ ట్రాక్ లోకి తీస్సుకొచ్చింది. క్షణం విజయం తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. గత ఏడాది హిట్ 2, మేజర్ లాంటి విజయాలు అందుకున్నారు. ఇప్పుడు మరో రెండు పాన్ ఇండియా సినిమాలు చేతిలో వున్నాయి. అదివారం పుట్టిన రోజు ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కబుర్లు..

*ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయ్?

– జి2 పెద్ద సినిమా అండీ. ఐదు దేశాల్లో జరిగే కథ. ఆ స్కేల్ స్పాన్ కి హిందీ ఆడియన్స్ ఖచ్చితంగా నచ్చుతుందని నమ్మకం వుంది. శ్రుతి హాసన్ తో చేస్తున్న సినిమా ప్రోపర్ గా హిందీ, తెలుగు.. రెండు భాషల్లో సెపరేట్ గా షూట్ చేస్తున్నాం. కల్చర్ ప్రకారం ప్రతి సీన్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్ గా వుంటుంది.

*ఈ మధ్య చాలా పెద్ద ఆఫర్ ని రిజెక్ట్ చేశారని విన్నాం.. నిజమేనా?

-నిజమే. నాకు డబ్బు పిచ్చి లేదండీ. ఈ విషయంలో మా ఫ్రెండ్స్ కూడా నన్ను తిడతారు. ఇండస్ట్రీలో డబ్బులైన సంపాధించవచ్చు. మంచి సినిమాలైన చేయొచ్చు. చాలా అరుదుగానే కొంతమందికే మంచి సినిమాలపై డబ్బు చేసుకోవడం కుదురుతుంది. నాకు డబ్బు మీద కేజ్ లేదు దీంతో సహజంగానే కేవలం మంచి సినిమాపైనే దృష్టి వెళ్ళిపోతుంది. నా ద్రుష్టి ఎప్పుడూ సినిమా చూస్తున్న ఆడియన్స్ ఎలా ఫీలౌతారనే దానిపైనే వుంటుంది.

* మీరు రైటర్ కదా,. మీలో రైటర్ యాక్టర్ కి ఎలా సహాయపడతాడు?

-కథ రాసినప్పుడు మనల్ని మనం నటుడిగా ఎప్పుడూ చూడకూడదు. కథకు ఏది అవసరమో అదే రాయాలి. పదేళ్ళుగా నాను నేను ఇలాంటి కసరత్తు చేసుకున్నాను. రాసిన సీన్ ని ఎలా చూపించాలనేది నటుడిగా గా మాత్రమే అలోచించాలి. ఇలా విడిగా చూసుకోవడం ప్రాక్టీస్ చేసుకున్నా. అది నాకు కుదిరింది. నిజానికి నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీలౌతాదర్శకుడికి చాలా ఓర్పు కావాలి. నేను ప్రతిది మనసుతో ఆలోచిస్తాను. అది నటుడిగా చేయాల్సిన పని. కానీ దర్శకుడు మెదడుతో అలోచించాలి. అదొక డిఫరెంట్ స్కిల్ సెట్. నేను యాక్టింగ్ రైటింగ్ ప్రిఫర్ చేస్తాను. నేను రాసే కథలు కూడా కేవలం నా కోసమే. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయబోతున్నాను.

*మీ ప్రతి సినిమా హిట్ కావాలనే కసితో పని చేస్తుంటారు కదా.. ఈ పట్టుదల అపజయాల నుంచి వచ్చిందని అనుకోవచ్చా?

– ఖచ్చితంగా. ఈ సినిమాలో ఎవరు హీరో అయినా హిట్ అయిపోవాలనే లక్ష్యంతో ‘క్షణం’ చేశాం. ‘గూఢచారి, మేజర్.. ఇవి మనం చేస్తేనే బావుంటుదనే ఫీలింగ్ క్రియేట్ చేసిన చిత్రాలుగా అనుకోవచ్చు.

*మంచి క్యారెక్టర్ రోల్స్ వస్తే మళ్ళీ చేస్తారా?

విలన్ హీరో అని కాదు.. సినిమాలో ఏ పాత్ర అయినా సరే.. ఆ కథని, సినిమాని క్యారీ చేయగలగాలి. అలాంటి పాత్రలు వస్తే ఖచ్చితంగా చేస్తాను.

* శ్రుతి హసన్ తో చేస్తున్న సినిమా నేపధ్యం ఏమిటి?

– అదొక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అండీ. చాలా కొత్త జోనర్.

* ఆల్ ది బెస్ట్ అండీ

– థాంక్ యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close