బాహుబ‌లి 2లో స‌శేష‌మైన ప్ర‌శ్న‌లెన్నో..?

బాహుబ‌లి 2 ప్ర‌భంజ‌నం మొద‌లైపోయింది. ముక్త కంఠంతో ఇది మ‌రో బ్లాక్‌బస్ట‌ర్ అంటున్నారు. బాహుబ‌లి 1 రికార్డుల్ని ఈజీగా దాటేస్తుంద‌ని లెక్క‌లు క‌డుతున్నారు. బాహుబ‌లి 2 అన్ని ర‌కాలా… తెలుగు ప్రేక్ష‌కుల్ని, సినీ అభిమానుల్ని సంతృప్తి ప‌రిచింది. ప‌రుస్తోంది. అయిన‌ప్ప‌టికీ బాహుబ‌లిలో కొన్ని శేష ప్ర‌శ్న‌లు మిగిలిపోయాయి. రానా ఎవ‌రిని పెళ్లి చేసుకొన్నాడు? భ‌ళ్లాల‌దేవుడి భార్య ఎవ‌రు? అనేది స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. నిజానికి ఆ పాత్ర క‌థ‌కు అవ‌స‌రం లేద‌ని రాజ‌మౌళి భావించి ఉంటాడు. రాజ‌మాత శివ‌గామి ఏమైంది?? జ‌ల‌పాతంలో ఆమె కొట్టుకెళ్లిపోయిందా, త‌న‌వు చాలించిందా?? లేదంటే ఎక్క‌డో ఓ చోట బ‌తికే ఉందా అనే విష‌యం పూర్తిగా దాచి పెట్టేశాడు. కిలికిలి కాళ‌కేయ త‌న‌యుడు ఎందుకొచ్చాడు? ఎక్కడ్నుంచి వ‌చ్చాడు? బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప చంపేస‌మ‌యంలో ఆ సైన్యాన్ని పంపింది ఎవ‌రు?? అస‌లు అవంతిక ఎందుకు భ‌ళ్లాల‌దేవునిపై తిరుగుబాటు చేయాల‌నుకొంది? ఆమెను బాహుబ‌లి వ‌రించాడా, లేదా?? ఇవ‌న్నీ శేష ప్ర‌శ్న‌లుగా మిగిలిపోయాయి. అయినప్ప‌టికీ బాహుబ‌లి 2 మాయాజాలం ముందు ఈ ప్ర‌శ్న‌లేం పెద్ద‌గా క‌నిపించ‌వు. విజువ‌ల్ వండ‌ర్ మాయ‌లో.. లాజిక్కులు ఆలోచించుకొనే సమ‌యం ప్రేక్ష‌కుడికి ఇవ్వ‌కుండా తెలివిగా దాటేశాడు రాజ‌మౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.