వందల కోట్లలో బీజేపీ ఆన్‌లైన్‌ మీడియా ప్రచార ఖర్చు..!

భారతీయ జనతా పార్టీ ప్రచారం విషయం ఏ మాత్రం రాజీ పడటం లేదు. నరేంద్రమోడీ.. ఈ విషయంలో… సరిహద్దుల్లో యుద్ధవాతావరణం ఉన్నా వెనక్కి తగ్గలేదు. ఇక బీజేపీ నేతలు ఎందుకు తగ్గుతారు..? క్షేత్ర స్థాయి ప్రచారానికి తోడు… ఆన్‌లైన్‌లో.. ఓ రేంజ్‌లో ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో… బీజేపీ విజయంలో ఆన్‌లైన్‌దే కీలక పాత్ర. అయితే.. అప్పట్లో.. ఎక్కువగా స్వచ్చందంగా ఆ బూమ్ వచ్చింది. మోదీని నాయకునిగా చూశారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. అందుకే.. బీజేపీ సొంతంగా.. ఆన్‌లైన్‌లో హవా సృష్టించాలనుకుంటోంది. దీని కోసం వందల సంఖ్యలో వివిధ పేర్లతో ఫేస్‌బుక్‌ సహా.. వివిధ రకాల సోషల్ మీడియా అకౌంట్లలో… కుప్పలు తెప్పలుగా ప్రకటనలు ఇస్తోంది.

ఫిబ్రవరిలో.. రాజకీయ పార్టీలు… ఫేస్‌బుక్ వేదికగా చేసిన ఖర్చుతో కూడిన ప్రకటనల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన పేజీలదే అగ్రస్థానం. భారత్‌ కే మన్‌ కే బాత్ పేరుతో.. బీజేపీ మద్దతు దారులు నిర్వహిస్తున్న పేజీ… ఒక్క నెలలో.. ఏకంగా కోటి రూపాయలు ఖర్చు చేసింది. ఆ పేజీని… ప్రజల్లోకి విస్తృతగా తీసుకెళ్లి.. బీజేపీని పొగడటానికి ఈ ఖర్చు చేసింది. ఇంత ఖర్చు పెట్టినా.. ఆ పేజీకి .. మూడు లక్షలకు కొద్దిగా ఎక్కువ మంది మాత్రమే ఫాలో అవుతున్నారు. దేశవ్యాప్తంగా… రీచ్ కావడానికి.. గత ఎన్నికల్లో వచ్చినంత బూమ్ ను ఆన్ లైన్ లో సంపాదించుకోవడానికి బీజేపీ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇలా పేజీల ద్వారా.. అధికారికంగా.. బీజేపీ చేస్తున్న ఖర్చు.. దేశంలోని మిగతా అన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చుతో సమానం. ఇతర పార్టీలన్నీ పది కోట్లు ఖర్చు పెడుతూంటే.. ఒక్క బీజేపీ మాత్రమే పది కోట్లు ఖర్చు పెడుతోంది.

ఫేస్‌బుక్.. భారత ఎన్నికల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ఎలాంటి.. ప్రకటనలైనా… అవి స్పాన్సర్ చేస్తున్న సంస్థ లేదా వ్యక్తి పేరు… అలాగే.. ప్రదేశాన్ని కూడా డిస్‌ప్లే అయ్యేలా చేస్తోంది. అదే సమయంలో.. ఎవరెవరు ఎంత ఎంత ఖర్చు పెట్టారో అన్నది కూడా అందుబాటులో ఉంచుతోంది. పార్టీల వారీగా కాకుండా.. ఏ పేజీ నిర్వాహకులు ఎంత మొత్తం ప్రకటనలు ఇచ్చారో వెల్లడిస్తోంది. ఈ విషయంలో బీజేపీ అందరి కంటే ముందు ఉంది. గ్రాండ్ ఓల్జ్ పార్టీ… దేశాన్ని సుదీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రచారానికి డబ్బులు లేక తంటాలు పడుతోంది. ఒకే ఒక్క సారి మాత్రమే.. దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ… ప్రచారం విషయంలో.. దేశంలో ఉన్న అన్ని పార్టీలు కలిపి చేసే ఖర్చు కన్నా.. ఎక్కువే చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close