విజయవాడలో ఎంఐఎం పోటీ..! వైసీపీ వ్యూహమేనా..?

మిత్రోం జగన్ అంటే మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి అభిమానం ఎక్కువ. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏక్ థమ్ జగన్ కు సపోర్ట్ చేశారు. ముస్లింలు ఎవరూ టీడీపీకి ఓట్లు వేయవద్దని ప్రచారం చేశారు. నిజానికి ముస్లింలు ఎక్కువగా ఉన్న చోట ఎంఐఎం పోటీ చేస్తూ వస్తోంది. కానీ ఏపీలో చేయలేదు. అంత సన్నిహిత సంబంధాలు ఉన్న మజ్లిస్ ఇప్పుడు.. కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో పోటీ చేస్తోంది. ముస్లిం ఓటర్లు మెజార్టీగా ఉన్న రెండు డివిజన్లలో ఆ పార్టీ అభ్యర్థులను అధికారికంగా పోటీకి నిలబెట్టారు. 50, 54 డివిజన్లలో ఎంఐఎం అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

వారి తరపున హైదరాబాద్ నుంచి నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ వచ్చి ప్రచారం చేస్తున్నారు. ముస్లిం ప్రముఖులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. బెజవాడలో అడుగుపెడతామని ఎంఐఎం నేతలు ధీమాగా ఉన్నారు.. బెజవాడలో ఏకగ్రీవాలకు అవకాశం లేకుండా పోవడం .. గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏర్పడటంతో వైసీపీ అనేకానేక రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగానే ఎంఐఎం అభ్యర్థులు నిలబడ్డారని అనుమానిస్తున్నారు. ఎందుకంటే… మజ్లిస్ పోటీ చేయాలనుకుంటే ముందుగా కర్నూలు ఆ పార్టీకి గమ్యంగా ఉండాలి. అక్కడ ఆ పార్టీకి ట్రాక్ రికార్డు ఉంది. గతంలో పోటీ చేసింది. ఆ తర్వాత గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోటీచేయాలి.

అక్కడ ఎప్పుడూ ముస్లిం అభ్యర్థి మాత్రమే గెలుస్తూంటారు. అవన్నీ వదిలేసి.. ఏపీ రాజధాని సెంటిమెంట్ పని చేస్తుందని భావిస్తున్న విజయవాడలోని రెండు డివిజిన్లలో పోటీచేయడం… ఖచ్చితంగా వైసీపీ రాజకీయ వ్యూహాల్లో భాగమేనని భావిస్తున్నారు. మజ్లిస్ … ఇతర పార్టీల రాజకీయ వ్యూహాల కోసం.. ఇతర రాష్ట్రాల్లో పోటీ చేసి ఓట్లు చీలుస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఏపీ స్థానిక ఎన్నికల్లోనూ అధికార పార్టీకి అలాగే ఉపయోగపడుతున్నట్లుగా ఉందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

వృద్ధాప్య పెన్షన్ – జగన్‌ను ముంచిన సలహాదారుడెవరు ?

2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ....

ఒక్క కేసీఆర్ మాటలే వినిపించాయా – అదీ నెల తర్వాత !

కేసీఆర్‌ ప్రచారంపై ఈసీ రెండు రోజులు బ్యాన్ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని పార్టీల నేతల్లోనూ కేసీఆర్ మాటల్ని ఈసీ ఇంత సీరియస్ గా తీసుకుందా అన్న డౌట్ కు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close