ఆఖ‌రి నిమిషంలో ‘క్రాక్‌’ పంచాయ‌తీ

పెద్ద సినిమా వ‌స్తుందంటే ఎన్ని టెన్ష‌న్లో. అందులో… లాస్ట్ మినిట్ పంచాయితీలు అగ్ర స్థానంలో ఉంటాయి. స‌ద‌రు నిర్మాత‌కు పాత బాకీలు వెంటాడతాయి. వాటిని క్లియ‌ర్ చేసుకునేస‌రికి త‌ల ప్రాణం తోక‌లోకి వ‌స్తుంది. స‌రిగ్గా విడుద‌ల‌కు ముందు రోజే.. ఆ టెన్ష‌న్ మొద‌ల‌వుతుంది. `క్రాక్` విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఈ సినిమాకి `ఠాగూర్‌` మ‌ధు నిర్మాత‌. ఆయ‌న‌కు గ‌తంలో కొన్ని అప్పులున్నాయి. అవ‌న్నీ `క్రాక్‌` రిలీజ్ కి ముందు చుట్టు ముట్టాయి. శుక్ర‌వారం రాత్రంతా.. ఈ పంచాయితీలు సాగాయి. తెల్ల‌వారు ఝామున‌.. ఓ కొలిక్కి వ‌చ్చి రిలీజ్ టెన్ష‌న్ త‌ప్పింది. ఇప్పుడు `క్రాక్` రిలీజ్ కి ఎలాంటి అడ్డంకులూ లేవు. అయితే… మార్నింగ్ షోలు మాత్రం ర‌ద్ద‌య్యాయి. సాధార‌ణంగా మ‌ల్టీప్లెక్స్‌ల‌లో 9 గంట‌ల‌కు ఓ షో ఉంటుంది. హైద‌రాబాద్ లో అయితే 8.54కే షో. ఆ షోకి అడ్వాన్సు బుకింగులు కూడా అయిపోయాయి. తీరా.. థియేట‌ర్‌కి వెళ్తే… `షో ర‌ద్దు చేశాం..` అనే క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. హైద‌రాబాద్ లో కూడా ఇప్పుడు 11 గంట‌ల‌కే షో ప‌డ‌బోతోంది. చాలా రోజుల త‌ర‌వాత‌.. థియేట‌ర్‌కి పెద్ద సినిమా వ‌చ్చింది చూద్దాం.. అనుకున్న వాళ్ల‌కు, ర‌వితేజ అభిమానుల‌కూ… ఉత్సాహం నీరుగారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close