కేర‌ళ ప్ర‌భుత్వ కీల‌క నిర్ణయం.. చిత్ర‌సీమ‌కు ఊర‌ట‌

క్ర‌మంగా చిత్ర‌సీమ‌లో ఓటీటీ ఓ అంత‌ర్భాగ‌మైపోయింది. ఓటీటీని వేరుగా, సినిమాని వేరుగా చూడ‌లేని ప‌రిస్థితులు వ‌చ్చాయి. ఓర‌కంగా చెప్పాలంటే.. థియేట‌ర్ వ్య‌వ‌స్థ మొత్తాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చూపించింది ఓటీటీ. మ‌రోవైపు.. చిన్న నిర్మాత‌ల‌కు ఓటీటీ అంతో ఇంతో మేలు చేస్తోంది కూడా. చిన్న సినిమాలు, విడుద‌ల కాని చిత్రాల‌కు.. ఓటీటీ ఓ భ‌రోసా ఇస్తోంది. అందుకే… ఓటీటీలు మ‌రింత‌గా విస్త‌రిస్తున్నాయి. కోలీవుడ్ నిర్మాత‌లంతా క‌లిసి ఓ ఓటీటీ వేదిక ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాయి. ఇప్పుడు కేర‌ళ ప్ర‌భుత్వం మ‌రో ముంద‌డుగు వేసింది. ప్ర‌భుత్వమే.. ఓ ఓటీటీ సంస్థ‌ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. చిన్న సినిమాల‌కు ఈ వేదిక ఎంతో ఉప‌క‌రిస్తుంద‌ని కేర‌ళ సినిమాటోగ్ర‌ఫీ శాఖ మంత్రి ప్ర‌క‌టించారు. మ‌ల్లూవుడ్ నుంచి యేడాదికి దాదాపు 100 సినిమాలువ‌స్తున్నాయి. వాటిలో చిన్న సినిమాల‌దే అగ్ర పీఠం. అయితే వాటిలో చాలా వ‌ర‌కూ విడుద‌ల‌కు నోచుకోవ‌డం లేదు. ఈ సమ‌స్య‌ని ప‌రిష్క‌రించడానికే ఓటీటీ సంస్థ‌ని నిర్మిస్తున్న‌ట్టు కేర‌ళ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దేశం మొత్త‌మ్మీద ఎక్కువ సినిమాలు నిర్మించేది టాలీవుడ్ లోనే. ఇక్క‌డి ప్ర‌భుత్వాలూ అలాంటి ప్ర‌య‌త్నాలు చేస్తే – చిన్న నిర్మాత‌ల‌కు కావ‌ల్సినంత భ‌రోసా ఇచ్చిన‌ట్టు అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close