ఇదేం సెల్ఫీరా బాబోయ్

న‌రేష్ ఏం చేసినా అది అల్ల‌రి అల్ల‌రిగా ఉంటుంది. అందుకే అల్ల‌రి న‌రేష్ అయిపోయాడేమో! త‌న టైటిళ్లు, దాన్ని జ‌స్టిఫైజ్ చేయ‌డానికి పోస్ట‌రుపై వేసే వేషాలూ భ‌లే గ‌మ్మ‌త్తుగా ఉంటాయి. ఇప్పుడు సెల్ఫీ రాజాకీ అదే చేశాడు. జి.ఈశ్వ‌ర్ రెడ్డి ద‌ర్శ‌కత్వంలో న‌రేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న‌చిత్రం సెల్ఫీ రాజా. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. రెండు పెద్ద పెద్ద బిల్డింగుల‌పై నుంచి దూకుతూ.. సెల్ఫీ తీయించుకొన్న స్టిల్ బ‌య‌ట‌కు వ‌దిలారు. ప్ర‌స్తుతం ముదిరిపోతున్న సెల్ఫీ పిచ్చ‌కి ఇంత‌కంటే నిద‌ర్శ‌నం ఏం కావాలి..? ఈ స్టిల్ చూస్తే, ఇదేం సెల్ఫీరా బాబూ.. అనిపించ‌క మాన‌దు. సెల్ఫీలంటే పిచ్చ ఉన్న ఓ కుర్రాడి క‌థ ఇది. అత‌ని క‌థ‌లో జ‌రిగే చిత్ర విచిత్రాలు స‌ర‌దాగా సాగిపోతాయ‌నిచిత్ర‌బృందం తెలిపింది. ఫ‌స్ట్ లుక్ బాగానే ఉంది. మ‌రి సినిమాలో ఏమాత్రం విష‌యం ఉంటుందో తెలియాలంటే.. సెల్ఫీ రాజా వ‌చ్చేంత వ‌ర‌కూ ఎదురుచూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గాజు గ్లాస్ గుర్తుపై కూటమికి పాక్షిక రిలీఫ్

జనసేన పోటీ చేస్తున్న ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పార్లమెంట్ అభ్యర్థులకు, అలాగే జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లోని అసెంబ్లీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయించబోమని...

శాంతి భద్రతల వైఫల్యం…జగన్ రెడ్డిని బుక్ చేసిన పోసాని

ఏపీలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఏదో డ్రామాను క్రియేట్ చేయడం వైసీపీకి పారిపాటిగా మారింది. గత ఎన్నికల్లో కోడికత్తి కేసుతో సానుభూతి పొందిన జగన్ రెడ్డి, ఈ ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు గులకరాయి దాడిని...

గ్రేట్ క్లాసిక్‌: 50 ఏళ్ల ‘అల్లూరి సీతారామ‌రాజు’

కొన్ని పాత్ర‌లు కొంద‌రి కోసం త‌యారు చేయ‌బ‌డ‌తాయి. మ‌రొక‌రు వాటి జోలికి వెళ్ల‌లేరు. మ‌రొక‌ర్ని ఆ పాత్ర‌లో ఊహించుకోలేం కూడా. అలాంటి గొప్ప పాత్ర 'అల్లూరి సీతారామ‌రాజు'. ఆ పాత్ర‌లో న‌టించే అపురూప‌మైన‌...

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి@ రూ.14 కోట్లు

ఓటీటీ మార్కెట్ ప‌డిపోయింద‌ని చాలామంది నిర్మాత‌లు దిగాలు ప‌డిపోతున్నారు. అయితే ఇంత క్లిష్ట‌మైన స్థితిలో కూడా కొన్ని ప్రాజెక్టులు మాత్రం మంచి రేట్లే తెచ్చుకొంటున్నాయి. ఇటీవ‌ల 'తండేల్‌' రూ.40 కోట్ల‌కు అమ్ముడుపోయింది. ఇప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close