బ‌న్నీకి ఎవ‌రైనా చెప్పండ‌య్యా…

ఏ స్టార్ కెరీర్‌ కైనా స‌రే.. ‘మీడియాతో సంబంధాలు’ అన్న‌ది చాలా కీల‌కం. మ‌హేష్ బాబులానో, ప‌వ‌న్ క‌ల్యాణ్‌లానో మీడియాతో అంటీఅంట‌నట్టు వ్య‌వ‌హ‌రించ‌డం ఓ ప‌ద్ధ‌తి. లేదంటే అఖిల్‌లానో, రానాలానో మీడియాని ఎప్పుడూ పెన‌వేసుకుపోవ‌డం మ‌రో ప‌ద్ధ‌తి. అల్లు అర్జున్ అయితే.. ఈ రెండింటికీ దూరంగా, భిన్నంగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడేమో అనిపిస్తోంది. బ‌న్నీకి తెలుగు మీడియా అంటే పెద్ద‌గా గౌర‌వం లేదేమో.. అన్న సందేహాలు క‌లుగుతున్నాయి. స‌రైనోడు విడుద‌లైనప్పుడు త‌మిళ‌నాడు, కేర‌ళ వెళ్లి ప్ర‌చారం చేసొచ్చాడు.అక్క‌డ మీడియాకు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. కానీ.. తెలుగు మీడియాని మాత్రం మ‌ర్చిపోయాడు. విడుద‌లైన రెండు వారాల‌ త‌ర‌వాత‌, అదీ.. వ‌సూళ్లు బాగా త‌గ్గిపోయాయ‌ని తెలిశాక‌.. ప్ర‌ధాన ప‌త్రిక‌ల‌కు పిలిచి ఇంట‌ర్వ్యూలు ఇచ్చాడు. అందులోనూ స‌మీక్ష‌లు రాసేవాళ్ల‌పై సెటైర్లు వేశాడు. అస‌లు ఇక్క‌డివాళ్ల‌కు సినిమా చూడ్డ‌మే రాదు అని ఓ స్టేట్ మెంట్ ప‌డేశాడు. స‌రైనోడుకి ఎవ్వ‌రూ పెద్ద‌గా పాజిటీవ్ రివ్యూలు ఇవ్వ‌లేదు. అదీ మ‌నోడి కోపం. మ‌రి… రేసుగుర్రం సినిమాని ఆహా ఓహో అని పొగిడిన‌ప్పుడు బ‌న్నీ ఏమైపోయాడు. అప్పుడు స‌మీక్ష‌లు రాసేవాళ్ల‌కు సినిమాలు చూడ‌డం వ‌చ్చా??? రుద్ర‌మ‌దేవిలో గోన‌గ‌న్నారెడ్డి పాత్ర‌కు క్రెడిట్ మొత్తం ఇచ్చిన‌ప్పుడు రివ్యూవాళ్లు మంచోళ్లా?? అంటే.. పొగిడితే ఒక‌లా, తిడితే మ‌రోలానా?? ఇదెక్క‌డి న్యాయం బ‌న్నీ. అది చాల‌ద‌న్న‌ట్టు ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని తిక్క‌రేగేలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇదే ప‌ని.. సరైనోడు విడుల‌కు ముందు చేసుంటే… ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎదురుదాడి మ‌రోలా ఉండేది. బ‌న్నీ కాస్త కంట్రోల్‌లో ఉంటే మంచిద‌ని ప‌వ‌న్ ఫ్యాన్సే తెగేసి చెబుతున్నారు. మ‌రి బ‌న్నీ ఏం చేస్తాడో??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close