టాప్‌లో ఉన్న అల్లు అర్జున్ ‘రాకా’తో మరోసారి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయన సినిమాల్లో హీరో ఫస్ట్ లుక్ రిలీజ్ అనేది భారీ అంచనాలు రేకెత్తించే ఈవెంట్లుగా మారాయి; ‘రాకా’ కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తోంది.
ఇప్పటికే అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తాజా లుక్‌తో మరోసారి ఆసక్తి రేకెత్తించారు. పుష్ప 2 విజయం తర్వాత సేఫ్ జోన్లో కొనసాగకుండా, పూర్తి భిన్నమైన మార్గాన్ని ఎంచుకోవడం ఆయన కెరీర్లో మరో ముఖ్య మలుపుగా భావిస్తున్నారు.
‘రాకా’ కోసం అల్లు అర్జున్ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్కు సిద్ధమయ్యారని సమాచారం. ప్రతిరోజూ 3 నుంచి 4 గంటల పాటు మేకప్, స్టైలింగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ లుక్‌ను సరైన విధంగా కొనసాగించడం కోసం ఆయన తీసుకుంటున్న కృషి, ఆయన ప్రొఫెషనల్ డెడికేషన్‌ను మరింత స్పష్టంగా చూపిస్తోంది.
ఈ కొత్త లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా భారత క్రికెటర్ హార్డిక్ పాండ్య కూడా ‘రాకా’ సిగ్నేచర్ హ్యాండ్ గేశ్చర్ను అనుకరించడం చూస్తే ఈ లుక్ ఎంత వేగంగా పాపులర్ అయ్యిందో అర్థమవుతోంది.
మొత్తానికి, ‘రాకా’తో అల్లు అర్జున్ కేవలం బాక్సాఫీస్ రికార్డులకే పరిమితం కాకుండా, తన పాత్రల ఎంపికలోనూ, ట్రాన్స్ఫర్మేషన్లోనూ కొత్త ప్రమాణాలు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


