‘మెగాస్టార్‌’పై బ‌న్నీ ఏమ‌న్నాడు?

మెగా ఫ్యామిలీలో చిరంజీవి త‌రువాతి స్థానం ఎవ‌రిది?? అని అడిగితే జ‌వాబు చెప్ప‌డం క‌ష్టం. ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌.. ఈ ముగ్గురూ ముగ్గురే. ప‌వ‌న్ త‌న‌కంటూ ఓ ఇమేజ్‌నీ, స్టార్ స్టేట‌స్‌నీ, అభిమాన గ‌ణాన్ని సంపాదించుకొన్నాడు. చిరు త‌ర‌వాత‌.. క‌చ్చితంగా మెగా ఫ్యాన్స్ తదుప‌రి స్థానం ప‌వ‌న్‌కే ఇస్తారు. అయితే… మెగా ఫ్యామిలీలో నెక్ట్స్ మెగాస్టార్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌కు మెగా ఫ్యాన్స్ ఒక్కోలా స్పందిస్తుంటారు. అయితే.. బ‌న్నీ మాత్రం.. `మెగాస్టార్ ఒక్క‌డే .. ఆయ‌న చిరంజీవి గారే.. మెగాస్టార్‌కి ప్ర‌త్యామ్నాయం లేదు` అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. చిరంజీవి ఓ హిమాల‌య‌మ‌న్న‌ది బ‌న్నీ ఉద్దేశం.

”మెగా హీరోల్లో ఎవ‌రి స్టైల్ వాళ్ల‌ది. ఎవ‌రి వ్య‌క్తిత్వం ఎవ‌రి స్థానం వాళ్ల‌ది. అయితే మెగాస్టార్ మాత్రం ఒక్క‌రే ఉంటారు. అది చిరంజీవి గారికే సొంతం. నెక్ట్స్ మెగాస్టార్ అనే ప్ర‌శ్న‌కు తావే లేదు” అనేశాడు బ‌న్నీ. సో.. ఈ ప్ర‌శ్న‌కు త‌గిన స‌మాధానం దొరికేసిన‌ట్టే. అంతెందుకు… మ‌హేష్ బాబు సైతం అప్ప‌ట్లో ఇదే మాట చెప్పాడు. ”తెలుగు చిత్ర‌సీమ‌లో ఒకే ఒక్క మెగాస్టార్ ఉన్నారు.. ఆయ‌న చిరంజీవి.. ఆ స్థానం ఇంకొరికి ద‌క్క‌దు” అనేశాడు. అంత‌కంటే ఏం కావాలి?? టాలీవుడ్‌లో చిరు స్థానం ఏంటో చెప్ప‌డానికి??

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.