బూతులు మాట్లాడిన వైసీపీ నేతల్ని ప్రజలు పాతాళంలోకి తొక్కి పైన మట్టిపోశారు. అయినా వారు మాత్రం తమ బూతుల్ని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అత్యంత ఘోరమైన బూతులతో విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. ఆయన మాటలు విని పోలీసులు కూడా అవాక్కవ్వాల్సి వచ్చింది.
గుంటూరు గోరంట్ల వద్ద టీడీపీ నేతలు లడ్డూ కల్తీ వ్యవహారంపై ఓ ఫ్లెక్సీ పెట్టారు. ఆ ఫ్లెక్సీ నిజాలను ప్రజలకు చెప్పేలా ఉందని దాన్ని తొలగిస్తామని అంబటి రాంబాబు ప్రకటించారు. గుంటూరు ఇంచార్జ్ అని చెప్పుకోవడమే కానీ ఆయనను గుర్తించేవారు లేకపోవడంతో హడావుడి చేయడానికి ఈ ఫ్లెక్సీని ఓఅవకాశంగా మార్చుకున్నారు. గోరంట్లలోని ఓ ఆలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి ఫ్లెక్సీ తీస్తామని బయలుదేరారు. అయితే టీడీపీ కార్యకర్తలు అక్కడ పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో పోలీసులు ఆయనను అక్కడ్నుంచి పంపేశారు.
ఇలా పంపుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా కారులో నుంచి తల బయటపెట్టి ఓ టీవీ చానల్ ప్రతినిధిని పిలిపించుకుని చంద్రబాబు, ఆయన కుటుంబం మొత్తంమపై బండబూతులందుకున్నారు. ఆయన మాటలు విని అక్కడున్నవారు అవాక్కయ్యారు. వీరికి ప్రజలు బుద్ది చెప్పినా… సిగ్గు రాదని మండిపడుతున్నారు. చేతకాని రాజకీయాలు చేస్తూ బూతులు అందుకుంటున్నారు. ఐదు సంవత్సరాల పాలనా కాలంలో చేసింది అదే.. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగుపడిందని అనుకుంటే ఉద్దేశపూర్వకంగా మళ్లీ బూతులందుకుంటున్నారు. వీరికి బూతులతో సమాధానం చెప్పడం కన్నా… కర్రు కాల్చి వాతలు పెట్టినట్లుగా ట్రీట్ మెంట్ ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.