డిఎంకె, అన్నాడిఎంకెల పై అమిత్ షా ఫైర్

భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ తరపున నిన్న తమిళనాడులో విస్తృతంగా ప్రచారం చేసారు. ఆ సందర్భంగా అధికార అన్నాడిఎంకె, ప్రతిపక్ష డిఎంకె పార్టీ, దానితో పొత్తులు పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీల తీవ్ర విమర్శలు చేసారు. ఆ రెండు పార్టీలే రాష్ట్రాన్ని ఎన్నో ఏళ్లుగా పరిపాలిస్తున్నప్పటికీ ఏ మాత్రం అభివృద్ధి జరుగలేదని, వాటి పేర్లలో తేడా తప్ప అవినీతిలో రెండూ ఒకదానికొకటి ఏమాత్రం తీసిపోవని విమర్శించారు. చెన్నైలో తుఫాను వచ్చినప్పుడు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,000 కోట్లు సహాయం అందిస్తే, దానితో మౌలిక సదుపాయాలూ కల్పించకుండా, మనిషికి రూ.5,000 చొప్పున పంచిపెట్టి అది ‘అమ్మ’ ఇచ్చిందని అన్నాడిఎంకె ప్రచారం చేసుకొందని అమిత్ షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉదయ్, ముద్ర, స్టార్ట్-ఆంధ్రప్రదేశ్ ఇండియా వంటి పధకాలను జయలలిత ప్రభుత్వం పట్టించుకోనే లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకి కూడా వెళ్ళివచ్చిన గొప్ప మనిషి అని ఎద్దేవా చేసారు.

“ప్రతిపక్ష డిఎంకె నేతలు కూడా ఆమెకు ఏమాత్రం తీసిపోరు. వారిలో ఎ.ఎస్.రాజా 2జి కుంభకోణంలో, నిధుల మళ్లింపు కేసులో కనిమోలి నిందితులుగా తీహార్ జైలులో గడిపి వచ్చిన ఘనత కలవారు. వారి పార్టీతో పొత్తులు పెట్టుకొన్న కాంగ్రెస్ పార్టీ నేతలలో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి బినామీ ఆస్తుల కేసులో నిందితులు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ అగస్టా కుంభకోణంలో నిందితులుగా ఉన్నారు. ఈవిధంగా తమిళనాడులో అధికారం కోసం ప్రాకులాడుతున్న పార్టీలన్నీ కూడా అవినీతిలో మునిగి తేలుతున్నవే. కానీ మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేళ్ళు అవుతున్నా ఇంతవరకు ఒక్క అవినీతి ఆరోపణ రాలేదు. దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని వదిలించుకొని సమర్దుడైన నరేంద్ర మోడీకి ఏవిధంగా బాధ్యతలు కట్టబెట్టారో, తమిళనాడు ప్రజలు కూడా ఈ అవినీతి ద్రవిడ పార్టీలను వదిలించుకొని, నీతివంతమయిన, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయగల భాజపాకి ఓట్లు వేసి గెలిపించాలి. రాష్ట్ర పరిస్థితులలో వేగంగా మార్పు రావాలంటే, ఆ రెండు ద్రావిడ పార్టీలని తక్షణమే మార్చి వేయాలి. దానికిదే తగిన సమయం,” అని అమిత్ షా ప్రజలను కోరారు.

అమిత్ షా తన ప్రసంగాలలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏమి చేస్తుందనే విషయాలు గట్టిగా ప్రస్తావించకపోవడం విశేషం. అలాగే భాజపా ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు కూడా ప్రకటించకపోవడం గమనిస్తే తమ పార్టీ విజయం సాధించే అవకాశం లేదనే సంగతి భాజపా గ్రహించిందని అర్ధమవుతోంది. అయినా రాష్ట్రంలో అనేక ఏళ్లుగా బలంగా పాతుకుపోయిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్ర ప్రజలు పట్టించుకోనప్పుడు, భాజపాని కొత్తగా తెరపైకి వచ్చిన అమిత్ షాని పట్టించుకొంటారనుకోలేము. ఈ ఎన్నికలలో తమిళనాడు ప్రజలను ప్రలోభపెట్టడానికి అధికార పార్టీ మోటార్ సైకిళ్ళు, ఏసీలు ఇవ్వడానికి సిద్దపడిందంటే, ఏ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ ఎంత మాట్లాడితే షర్మిలకు అంత మేలు !

వైఎస్ వారసులు ఎవరు ?. ఈ విషయంలో ప్రజలు తేల్చుకోవాల్సిందేనని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. పులివెందులలో సభ పెట్టి వారసత్వం గురించే మాట్లాడారు. ఇప్పటి వరకూ ప్రజలు ఆయనకే...

సికింద్రాబాద్ లో ఎవరిదీ పైచేయి..?

సికింద్రాబాద్ లోక్ సభ సెగ్మెంట్ లెక్కలు మారుతున్నాయా..? సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీ కిషన్ రెడ్డికి ఝలక్ తప్పదా..? కేసీఆర్ చెప్పినట్టుగానే సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు ముందంజలో ఉన్నారా..? బలమైన అభ్యర్థిగా...

ఏపీకి ప్రధాని మోడీ…షెడ్యూల్ ఇదే

ప్రధాని మోడీ ఏపీ ఎన్నికల పర్యటన ఖరారు అయింది.మే 3, 4తేదీలలో మోడీ ఏపీలో పర్యటించనున్నారు. 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు మోడీ. 3న...

నాలుగైదు సినిమాలకు అడ్వాన్సులు – గెలిచినా పవన్ బిజీనే !

పవన్ కల్యాణ్ ఎన్నికల తర్వాత కూడా తీరిక లేకుండా ఉంటారు. అయితే రాజకీయాలతో కాదు. సినిమాలతో. పవన్ కల్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తులు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close