తప్పు హైదరాబాదీ ఓటర్లది కాదు..! రాజకీయ పార్టీలదే..!

హైదరాబాదీలు బద్దకం గాళ్లు..! వాళ్లకు సివిక్ సెన్స్ లేదు..! ఓటేయమని సెలవిస్తే తిని పడుకున్నారు..! వాళ్లకు ప్రభుత్వ పథకాలివ్వకూడదు..! వారికి ప్రశ్నించే హక్కు లేదు..! ..అంటూ సోషల్ మీడియా చెలరేగిపోతోంది. దీనికి కారణం గ్రేటర్‌లో అతి తక్కువగా పోలింగ్ నమోదవడమే. ఓటర్లు పెద్దగా పోలింగ్ కేంద్రాలకు రాకపోవడమే. నిజంగా తప్పందా ఓటర్లదేనా..? రాజకీయ పార్టీలు.. నేతలు.. ఎన్నికల సంఘం.. ప్రభుత్వం అన్నీ సుద్దపూసలా..? ఓటింగ్ శాతం తగ్గడానికి ఓటర్లే కారణమా..?

బీజేపీకే చావో రేవో.. మిగతా పార్టీలు లైట్ తీసుకున్నాయి..!

బీజేపీకి ముఖ్యమయ్యాయి కానీ.. ప్రజలకు అలా అనిపించలేదు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ … ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదన్నట్లుగా అందర్నీ రంగంలోకి దించింది. అవసరం లేకపోయినా ప్రధానమంత్రి మోడీ… తానున్నానంటూ హైదరాబాదీలకు కనిపించిపోయారు. ఇక యోగి ఆదిత్యనాథ్ దగ్గర్నుంచి నుంచి అమిత్ షా వరకూ అందరూ వచ్చారు. హైదరాబాద్ ఎన్నికలకు జాతీయ ప్రాధాన్యం తెచ్చి పెట్టారు. కానీ ఇతర పార్టీలు ఆ స్థాయిలో చూడలేదు. టీఆర్ఎస్ భారం మొత్తం కేటీఆర్ మోశారు. కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి నిలబడ్డారు. టీడీపీ తరపున ఎవరూ లేరు. అభ్యర్థులే చూసుకున్నారు. ఇతర పార్టీల పరిస్థితీ అంతే. అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే… ఈ ఎన్నికలకు ఎక్కడా హైప్ క్రియేట్ చేసింది. కానీ ఇతర పార్టీలు.. కింది స్థాయి వారు అలా అనుకోలేదు.

విద్వేష రాజకీయాలను చూసి ఓట్లేయడానికి ఎలా వస్తారు..!?

అదే సమయంలో రాజకీయ పార్టీల తీరుపైనా ఓటర్లలో నిరాశ .. నిర్వేదం వ్యక్తమయింది. రాజకీయం అంటే.. ప్రజల బతుకుల్ని బాగు చేయడమే. వారి జీవన ప్రమాణాలు పెంచడమే. కానీ గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ అయినా వాటి గురించి మాట్లాడిందా.. ? ఒకరొచ్చి సర్జికల్ స్ట్రైక్స్ అంటారు.. ఇంకొకరు వచ్చి సమాధుల కూల్చివేత అంటారు.. ఇంకొకరు వచ్చి మతకల్లోలాలు అంటారు. ఎవరికి వారు రాజకీయం చేసుకున్నారు కానీ..హైదరాబాద్ వసులకు నిజంగా ఎదురవుతున్న కష్టాలేంటి..? వాటిని తీర్చడానికి తమ దగ్గర ఉన్న ప్లాన్లేంటి అన్న విషయాలను చెప్పి మెప్పించలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో మేనిఫెస్టోలను ప్రకటించేసి.. మరింత విరక్తి కలిగించారు. ఏ పార్టీకి ఓటు వేసినాఏమున్నది గర్వకారణం అన్నట్లుగా సైలెంటయ్యారు. ఏ పార్టీకి ఓ టు వేసినా ఉచిత మంచి నీరు.. దగ్గర్నుంచి అనేక ఫ్రీ హామీలు వస్తాయి మరి..! ఇస్తారో లేదో తెలియదు… ఓటు వేసినా వేయకపోయినా వస్తాయని చాలా మంది లైట్ తీసుకున్నారు.

హైదరాబాదీలు ఓట్లేయకపోవడానికి కారణం వ్యవస్థే. ..!

పోలింగ్ తక్కువగా నమోదవడానికి రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వం, ఎన్నికల సంఘం కూడా తప్పులు చేశాయి. వరుస సెలవులు ఉన్న సమయంలో పోలింగ్ పెట్టడం ఓ తప్పు అయితే.. అసలు ఓటర్ల లిస్ట్ ప్రిపేర్ చేయకపోవడం మరో తప్పు. అసెంబ్లీకి వాడిన ఓటర్ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించేశారు. ఆ తర్వాత చాలా పరిస్థితులు మారాయి. కరోనా కారణంగా చాలా మంది స్వగ్రామాలకు వెళ్లిపోయారు. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉండటంతో చాలా మంది ఊళ్లకు వెళ్లిపోయారు. అంతే కాదు.. అసలు డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయో అంచనా వేయలేని స్థితిలో ఈసీ ఉంది. కేటీఆర్, కవిత ఇద్దరూ అసెంబ్లీ ఎన్నికలకు.. హైదారాబాద్ వెలుపల ఓటు హక్కు వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు మళ్లీ గ్రేటర్‌లో ఓటు వేశారు. అందరికీ ఇలాంటి వెసులుబాటు ఉండకపోచవ్చుత ఉన్న వారికి ఓటు విలువ తెలియచేప్పడంలో అటు ప్రభుత్వం.. ఇటు ఈసీ విఫలమయ్యాయి. ఫలితంగాఓటు శాతం పడిపోయింది.

ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగితేనే పోలింగ్ బూత్‌ల వద్దకు..!

గ్రేటర్‌లో తక్కువ పోలింగ్ జరగడానికి ఓటర్ల తప్పేం లేదు.. ! ప్రజాస్వామ్యం మద నమ్మకం కలిగించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. ఏ పార్టీ గెలిచినా చేసేదేమీ ఉండదన్న అభిప్రాయానికి తీసుకొచ్చేశారు. అందుకే ఓటర్లలో నిర్లిప్తత పెరిగింది. ఇది ప్రజాస్వామ్య పునాదుల్ని బలహీనం చేసే అంశమే. రాజకీయ పార్టీలు ఇప్పటికైనా తమ రాజకీయ గమనంపై సమీక్ష చేసుకోవాలి., అధికారమే పరమావధిగా ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్య పెట్టాలనుకునే వ్యూహం విడిచి పెట్టాలి. ప్రజలకు ప్రజాస్వామ్యంపై భరోసా కల్పించాలి. అప్పుడే.. మళ్లీ ఓటర్లు… పోలింగ్ బూత్‌ల వద్దకు పరుగులు పెడతారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close