”గుజరాత్ మోడల్” కు ఆనందీబెన్ బలి!

ప్రధాని నరేంద్రమోదీకి విధేయురాలైన గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పదవి వదులుకోవలసిన పరిస్ధితికి మూలాలు పదేళ్ళకు పైగా మోదీ అనుసరించిన ఆర్ధిక విధానాలే! విధాన పరమైన వైఫల్యాలను పాలనాపరమైన వైఫల్యంగా చూపి ఆమెను బలిపశువు చేశారు. గుజరాత్ లో గట్టి మద్దతుదారులైన పటేళ్ళ ఉద్యమం బిజెపికి షాక్ ఇచ్చింది. అభివృద్ధి కి గుజరాత్ ను మోడల్ గా చూపుతూన్న మోదీ గాని, బిజెపిగాని పటేళ్ళ పోరాటం మొదలయ్యాక గుజరాత్ మోడల్ ని పక్కనపెట్టేశారు.

మోదీ అనుసరించిన ఆర్థిక విధానాలు గుజరాత్‌ ను అంకెల్లో అభివృద్దివైపు నడిపించాయి. అయితే అవి సంపన్నుల్ని మరీ సంపన్నులుగా, పేదల్ని నిరు పేదలుగా మార్చేశాయి. ఉపాధి అవకాశాలను క్రమంగా తగ్గించేశాయి. ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు కుంచించుకుపోవడం, ఒక వేళ ఉపాధి దొరికినా తక్కువ వేతనాలు చెల్లిస్తుండడంతో ఈ విధానాల్లో డొల్లతనం బయటపడింది.

సామాజికంగా ఆధిపత్యం వున్న పటేళ్లలోనే ఒకరకమైన అలజడి మొదలైందంటే ఇతర సామాజిక వర్గాల స్ధితిగతుల్ని అర్ధం చేసుకోవచ్చు. ప్రభుత్వ రంగం ఉద్యోగాలపై పటేళ్ళ దృష్టి పడింది. సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత వర్గాలకు చెందిన పటేళ్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో తమకూ కోటా కావాలని ఉద్యమించారు. దీనిని ఎలా పరిష్కరించాలో తెలియక బిజెపి తలపట్టుకు కూర్చొంది. ఇది దీర్ఘకాలం (మోదీ) అనుసరించిన విధాన వైఫల్యమేతప్ప రెండేళ్ళు ముఖ్యమంత్రిగా వున్న పాలనా వైఫల్యం కాదు.

నరేంద్రమోడీ 2014 మేలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించేటప్పుడు గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవిలో ఆయనకు విశ్వాసపాత్రురాలైన ఆనందిబెన్‌ను కూర్చోబెట్టారు. మోడీ గీచిన విధానాల గీటును ఆమె ఎన్నడూ దాటలేదు. మోడీ విధానాలనే పాటించారు.

ప్రధాని మోడీ రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సూరత్‌లో ‘గౌరవ్‌ వికాస్‌ యాత్ర’ చేస్తున్న నేతలపై కోడిగుడ్లు పడడంతో బి.జె.పి నాయకత్వం కంగుతిన్నది. గత ఏడాది నవంబర్‌-డిసెంబర్‌ మాసాలలో జరిగిన స్థానిక ఎన్నికల్లో బిజెపి భంగపడింది. 31 జిల్లా పంచాయతీలకుగాను కేవలం ఎనిమిదింటినే సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ 131 తాలూకా పంచాయతీలను గెల్చుకోగా, బి.జె.పి 73 స్థానాలను అతికష్టం మీద నిలుపుకోగలిగింది.

మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో బిజెపికి ఎన్నికల భయం పట్టుకుంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయావకాశాలు అంతకంతకూ మసకబారుతు న్నాయి. స్థానిక ఎన్నికల్లో వైఫల్యం, పటేళ్ల ఉద్యమం… మరో వైపు దళితులపై గో రక్షక దళాల ముసుగులో మూకల దౌర్జన్యాలపై గుజరాత్‌లో వెల్లువెత్తిన నిరసనాగ్రహాలు… ఆ పార్టీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బిజెపి, ఆరెస్సెస్‌ మైనార్టీలు, దళితులపై సాగిస్తున్న దాడులు, కార్మికుల ప్రయోజనాలను పణంగా పెట్టి కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే బిజెపి ప్రభుత్వ విధానాలు గుజరాత్‌ను సంక్షోభంలోకి నెట్టాయి.

ఇదంతా ముఖ్యమంత్రి ఆనందిబెన్‌ అసమర్థతగా లేబిల్ వేశారు.ఆనందిబెన్‌ స్థానే కొత్త వారిని తెరపైకి తెచ్చేందుకు నెల రోజుల క్రితమే బిజెపి బ్లూ ప్రింట్‌ సిద్ధం చేసింది. నవంబరు నాటికి 75వ వసంతంలోకి అడుగెడుతున్న ఆనందిబెన్‌ను వయసు మీద పడింది కాబట్టి పక్కకు తప్పుకోవాలని ఆమెకు హుకుం జారీ చేశారు. ఆప్రకారమే ఆమె నిష్క్రమించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close