ధర్మవరం రివ్యూ : సత్యకుమార్ ప్రజాప్రతినిధి అవుతారా ?

ఆంధ్రప్రదేశ్‌లో హైవోల్టేజ్ పోరు సాగే నియోజకవర్గాల్లో ఒకటి ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం. వైసీపీకి మంచి పట్టు ఉన్న నియోజకవర్గంలో ఏకపక్ష విజయాలు ఎవరికీ రాలేదు. ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న నియోజకవర్గం కావడంతో పోరాటం కూడా ఆ బ్యాక్ గ్రౌండ్ ఉన్న లీడర్ల మధ్యనే ఉంటుంది. వైసీపీ నుంచి వెంకట్రామిరెడ్డికి టిక్కెట్ ఖరారు అయింది. టీడీపీ నుంచి పరిటాల శ్రీరామ్ బరిలో ఉండేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. బీజేపీ నేతగా ఉన్నా సరే టీడీపీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి చాలా రోజులు హడావుడి చేశారు. చివరికి పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లుగా అభ్యర్థిత్వం బీజేపీ నేత సత్యకుమార్ చేతికి పోయింది. సత్యకుమార్ ది ధర్మవరం కాదు.. అసలు అనంతపురం జిల్లానే కాదు. అయినా పొత్తుల మ్యాజిక్‌లో భాగంగా అభ్యర్థి అయిపోయారు. మరి ఎలా గెలుద్దామనుకుంటున్నారు.

ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి కంచుకోటగా మారింది. ఒక్క 1999లో తప్ప 1983 నుంచి 2004 వరకు ఇక్కడ టీడీపీ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. గత మూడు ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో కేతిరెడ్డి వర్సెస్ గోనుగుంట్ల సూర్యనారాయణ మధ్యనే ప్రధానంగా పోటీ జరుగుతూ వస్తోంది. వరదాపురం సూరిగా ప్రసిద్ధి చెందిన సూర్యనారాయణకు నియోజకవర్గం మొత్తం క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గోనుగుంట్ల సూర్యనారాయణపై కేతిరెడ్డిపై 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలోకి దిగిన సూర్యనారాయణ.. కేతిరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019 ఎన్నికల్లో సూర్యనారాయణపై కేతిరెడ్డి విజయం సాధించారు. ఇదంతా గతం.. ప్రస్తుతం కేతిరెడ్డికి ప్రత్యర్థిగా నియోజకవర్గంలో ఎవరికీ తెలియని సత్యకుమార్ యాదవ్ వచ్చారు.

2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి విజయం సాధించారు. 51 శాతం ఓట్లు సాధించిన ఆయన.. టీడీపీ అభ్యర్థి సూర్యనారాయణపై 15వేల 166 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీకి 44 శాతం ఓట్లు పడ్డాయి. జనసేన అభ్యర్థి చిలకం మధుసూదన్ రెడ్డి 3 శాతం ఓట్లు సాధించారు. వెంకట్రామి రెడ్డి రాజకీయ చరిష్మాతో పాటు.. ఆ ఎన్నికల్లో కనిపించిన వైసీపీ వేవ్‌.. ఆయన గెలుపుకు ఉపయోగపడ్డాయి. సూర్యానారాయణ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ఈ కారణంగా ధర్మవరం బాధ్యతలను పరిటాల శ్రీరామ్‌కు చంద్రబాబు ఇచ్చారు. సీరియస్ గా పని చేసుకున్నారు పరిటాల శ్రీరామ్. పరిటాల వర్గంలో ధర్మవరంలో ఎక్కువే ఉంది. పైగా వరదాపురం సూరితో సరి పడదు. పరిటాల శ్రీరామ్ కూడా గట్టిగానే పోరాడారు. కానీ పరిస్థితుల్ని మధ్యలోనే అర్థం చేసుకున్న సూరి బీజేపీకి దూరమయ్యారు. బీజేపీకి రాజీనామా చేయలేదు కానీ ఆయన టీడీపీ జెండాలతో రాజకీయం చేశారు. తాను టీడీపీ తరపునే పోటీ చేస్తానంటున్నారు. కానీ ఆయనను టీడీపీలోకి చేర్చుకోలేదు. సాంకేతికంగా బీజేపీలోనే ఉన్నారు. పొత్తుల చర్చలు ప్రారంభమైనప్పుడు ఆయన పేరే ప్రచారంలోకి వచ్చింది. కానీ ఆయన బీజేపీతో దూరంగా ఉంటూ.. టీడీపీకి దగ్గరగా ఉంటూ చేసిన రాజకీయం మైనస్ అయింది. సీటు సత్యకుమార్ చేతికి వెళ్లింది. దీనికి కారణం పరిటాల వర్గమే అనుకోవచ్చు. బీజేపీకి ఇచ్చినా పర్వాలేదు..సూరికి మాత్రం వద్దని పట్టుబట్టడంతో సత్యకుమార్ వచ్చారు. ఇప్పుడు సత్యకుమార్ కోసం పరిటాల వర్గం పని చేస్తుంది. కానీ సూరి వర్గం పని చేస్తుందా అన్నదానిపై స్పష్టత లేదు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. ఎక్కువ రోజులు ఆయన నియోజకవర్గంలో తిరుగుతారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలను పోస్ట్ చేసుకుంటారు. ఎవరికైనా సాయం చేస్తానని చెబుతూంటారు. కానీ ధర్మవరంలో అభివృద్ధి అనేది లేకుండా పోయింది. చేనేతల్లో ప్రభుత్వంపై అసంతృప్తి ఎక్కువగా ఉంది. ముఖా ముఖి పోరు జరిగితే వైసీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశం సూర్యనారాయణ ఇక్కడ కీలకం కానున్నారు. ఆయన రెబల్‌గా బరిలోకి దిగితే వైసీపీకి మరింత గెలుపు అవకాశాలు ఉన్నాయని అంచనా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close