ఏపీకి ఇదేం ఖర్మ : జీతాలు ఇవ్వలేక చేతులెత్తేసిన ప్రభుత్వం !

పీఆర్సీ కోసం ధర్నాలు చేసే ఉద్యోగుల్ని చూశాం కానీ.. జీతాలు కావాలి మహా ప్రభో అంటూ ధర్నాలు చేస్తున్న వారిని ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తున్నాం. ఇప్పటికి పదమూడో తేదీ వచ్చింది. కానీ ఇప్పటి వరకూ అరవై శాతం మందికే జీతాలు వచ్చాయి. ఇంకా నలభై శాతం మందికి జీతాలు, పెన్షన్లు అందలేదు. ఎందుకంటే డబ్బుల్లేవు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. ఇష్టారీతిన అప్పులు చేసింది. వడ్డీలు కడుతోంది. జీతాలివ్వడానికి ఏం చేయాలేక చేతులెత్తేసింది.

13వ తేదీ వచ్చినా 40 శాతం మందికి ఎదురు చూపులే !

ప్రభుత్వ ఉద్యోగికి జీతం సమస్య వస్తుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసే పన్నులతో ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు. దీనికి పాలకుల దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. కానీ విచిత్రంగా ప్రజల పన్నులను ఇష్టారీతిన ఖర్చు పెట్టేసి.. ఉద్యోగులకు జీతాల విషయంలో మాత్రం టార్చర్ పెట్టే ప్రభుత్వం ఇప్పుడుపాలన చేస్తోంది. 13వ తేదీ వచ్చినా ఇంకా నలభై శాతం మందికి జీతాలు రాలేదు. ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.

ప్రభుత్వం ఓవర్ డ్రాఫ్ట్ – రూపాయి ఇవ్వని ఆర్బీఐ

ప్రతి నెలా జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు రూ. 5500 కోట్ల వరకూ కావాలి. ఇక ప్రతి నెల ఒకటో తేదీనే ఘనంగా ప్రచారం చేసుకునే సామాజిక పెన్షన్లకు రూ. 1500 కోట్లు కావాలి. అంటే నెలాఖరుకు రూ. ఏడు వేల కోట్లు కావాలి. గత నెలాఖరుకు ప్రభుత్వం వద్ద పైసా కూడా లేవు. దీంతో ఆర్బీఐ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుని సామాజిక పెన్షన్లు.. మిగిలినవి ఉద్యోగుల జీతాలకు సర్దుబాటు చేసింది. అప్పట్నుంచి ఏ రోజు వచ్చే ఆదాయం ఆ రోజు ఉద్యోగుల జీతాలకు జమ చేయాలని అనుకుంది. కానీ.. ఓడీ పరిమితి దాటిపోవడంతో వచ్చే ఆదాయం అంతా ఆర్బీఐనే జమ చేసుకుంటోంది. ఫలితంగా ఉద్యోగులకు జీతాలు అందడం లేదు.

వచ్చే నెల పరిస్థితి మరింత భయంకరం !

ప్రభుత్వం ఓడీ నుంచి బయటపడి.. ఇతర అప్పులకు.. వాయిదాలు, వడ్డీలు చెప్పింపులు పూర్తి చేసుకుని బయటపడేసరికి.. నెలాఖరు ముంచుకొస్తోంది. అప్పుడు అర్జంట్‌గా మరో ఏడెనిమిది వేల కోట్లు జీతాలు, పెన్షన్ల కోసం కావాలి. ఈ నెల జీతాలే నెలాఖరు వరకూ చెల్లిస్తే మరి వచ్చే నెల జీతాలు ఎలా చెల్లిస్తారు ? అప్పుల పరిమితి దాటిపోయింది. కేంద్రం కొత్త అప్పులకు అనుమతులు ఇస్తుందా లేదా అన్నది క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏ ఒక్క నిజాన్నీ చెప్పడం లేదు. అన్ని అప్పులు బయటకు చెబితే.. వచ్చే ఏడాది కూడా రుణం పుట్టదు.

ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లే !?

ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసినట్లుగానే కనిపిస్తోంది. పూర్తిగా దివాలా పరిస్థితి కనిపిస్తున్నా.. ఏమీ బాధ్యత లేనట్లుగా వ్యవహరిస్తోంది. ఊపిరి ఆడని ఆర్థిక వ్యవస్థ మీద రోజుకో సలహాదారుడ్ని కూర్చోబెడుతూ.. జల్సా పాలన చేస్తోంది. ఏపీకి ఏదో ఖర్మ పట్టకపోతే ఈ పరిస్థితి ఎందుకని అందరూ అనుకునేలా పాలనా తీరు ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close