కొత్త బార్లు కాదు.. పాత బార్లే..!

ఎనభై శాతం టీడీపీ నేతలే బార్లు నడుపుతున్నారంటూ…  వాటికి ఉన్న లైసెన్స్‌లను ఉన్న పళంగా క్యాన్సిల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. న్యాయస్థానంలో మాత్రం.. తన వాదనను నిరూపించుకోలేకపోయింది. కొత్త బార్ల విధానంపై…హైకోర్టు స్టే విధించింది. పాత బార్ల లైసెన్సులే కొనసాగుతాయని స్పష్టం చేసింది. విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. అదేవిధంగా కొత్త లైసెన్సుల మంజూరు ప్రక్రియ సహా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేసింది. బార్ల యజమానులు ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తోందని.. చట్ట వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటోందని.. కోర్టుకెళ్లారు.  జనవరి ఒకటో తేదీ నుంచి.. కొత్త బార్లకు పర్మిషన్లు ఇవ్వాలని.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించి.. ఒక్కో దరఖాస్తుదారు దగ్గర రూ. పది లక్షలు వసూలు చేసిన ప్రభుత్వానికి.. ఇప్పుడు ఆ డబ్బులన్నీ వెనక్కివ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మద్యనిషేధ ప్రయత్నాల్లో భాగంగా… సొంతగా మద్యం దుకాణాలు నడుపుతున్న ఏపీ ప్రభుత్వం  బార్లను కూడా.. తగ్గించాలని నిర్ణయించుకుంది. బార్ల లైసెన్సుల గడవు 2021 వరకు ఉండటంతో.. అప్పటి వరకూ వెయిట్ చేయాలని.. సీఎం జగన్ అనుకోలేదు. అనుకున్నదే తడవుగా వాటి లైసెన్సులు రద్దు చేశారు. కొత్తగా నలభై శాతం బార్లను తగ్గిస్తూ.. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వాలని నిర్ణయించారు.  బార్లలో  మద్యం రేట్లను కూడా పెంచారు. ప్రభుత్వం నిర్వహించే దుకాణాల్లో క్వార్టర్ కు 100 రూపాయలు అయితే.. బార్లలో ఇది 160 రూపాయలుగా నిర్ణయించారు.

జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి.. తాను చెప్పింది జరగాలన్నట్లుగా.. నిర్ణయాలు తీసుకుంటూండటంతో.. న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరికి.. హక్కులు ఉంటాయనే విషయాన్ని ఆయన పట్టించుకోకుండా… రద్దు నిర్ణయాలు తీసుకుంటూండటంతో.. అన్నీ కోర్టు వివాదాలుగా మారుతున్నాయి. పోలవరం దగ్గర్నుంచి ప్రతీ విషయం.. కోర్టుల్లో పిటిషన్లుగా పేరుకుపోతూండటమే దీనికి కారణం. ఈ జాబితాలో తాజాగా బార్లు చేరాయి. అవి అలా చేరుతూనే ఉన్నాయని అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అధికారం కోల్పోయినా సరే కానీ… జగన్ టార్గెట్ అదే..!?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం మరో మూడు రోజుల్లో ముగియనుంది. ప్రధాన పార్టీలన్నీ ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ఎప్పటికప్పుడు పరిస్థితుల ఆధారంగా నిర్ణయాలను మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ ఓటమి లక్ష్యంగా వైసీపీ...

వెట‌ర‌న్‌ల‌కు వెండి తెర స్వాగ‌తం

క్రికెట్‌లో వెట‌రన్ అనే మాట ఎక్కువ‌గా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన త‌ర‌వాత‌.. వాళ్లంతా వ్య‌క్తిగ‌త జీవితాల‌కు ప‌రిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వ‌చ్చింది. దాంతో రిటైర్ ఆట‌గాళ్లంతా కోచ్‌లుగా, మెంట‌ర్లుగా మారుతున్నారు....

అందర్నీ గొడ్డలితో నరికేసి సింగిల్ ప్లేయర్ అవ్వండి – భారతికి షర్మిల సలహా

వైఎస్ జగన్, ఆయన సతీమణిపై వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బధవారం మీడియాతో మాట్లాడిన షర్మిల వైసీపీ వాళ్లే అధికారంలో ఉండాలి... వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వారందర్నీ...

విజ‌య్ సినిమాల‌కు టైటిళ్లు కావ‌లెను!

రేపు.. అంటే మే 9న విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా విజయ్ కొత్త సినిమాల సంగ‌తులు రేపే రివీల్ కాబోతున్నాయి. మైత్రీ మూవీస్ లో విజ‌య్ ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close