ఇదేం ఖర్మ : పోతున్న పరపతి ఏపీదేగా..? జగన్‌ది కాదుగా ?

దేశ , విదేశాల్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు కనిపించే గౌరవం ఇప్పుడు లేకుండా పోతోంది. ఓ వైపు వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. మరో వైపు మంత్రులుగా చెలామణి అవుతున్న వారి గర్వం, తెలివితేటలు ఏపీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఇలా చేస్తున్నారన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం ఎప్పుడూ పశ్చాత్తాపం చెందకపోగా ఇంకా అతిగా వ్యవహరిస్తోంది.

అప్పుల చెల్లించకుండా బ్యాంకర్లతో ఆటలు !

అప్పుల వాళ్లు ఇంటికి వస్తే సాధారణ మధ్యతరగతి ప్రజలు చాలా పరువు తక్కువ ఫీలవుతారు. వీలైనంత వరకూ ఎవరూ రాకుండా చూసుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు.. అప్పుల వాళ్లు వస్తారు. . మొహాన తిట్టేసి వెళ్తారు. కానీ పట్టించుకోరు. పరువుతో పనేముంది అనుకుంటారు. అలాంటి పరిస్థితి ఏపీకి వచ్చింది. అమరావతి పీక నొక్కేసింది కాకుండా.. కడతామని చెప్పి బ్యాంకుల వద్ద రూ. మూడువేల కోట్లు అప్పు తీసుకుని కట్టకపోగా.. అప్పులకు వడ్డీ కూడా చెల్లించకుండా బ్యాంకర్లకు మొహం చాటేస్తున్నారు. ఇవాళో రేపో సీఆర్డీఏను దివాలాగా బ్యాంకులు ప్రకటించవచ్చు. .ఇప్పుడు ఆ అప్పులు మళ్లించుకున్న ఏపీ ప్రభుత్వం మాత్రం… కులాసాగానే ఉంది. ఈ అప్పులు చంద్రబాబు టైంలో చేసినవి కాదు.. జగన్ వచ్చాక.. అమరావతి పీక నొక్కేశాక దొడ్డిదారిన తీసుకున్న అప్పులే.

పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలను పిలిచే విధానం అదా ?

విశాఖలో పెట్టుబడుల సదస్సు అనుకున్నప్పుడు ఎలన్ మస్క్, టిమ్ కుక్‌లను పిలిచామని గొప్పలు పోయారు. నిజమేనేమో అనుకున్నారు. తీరా చూస్తే… ఇండియాలోని పారిశ్రామికవేత్తలను ఇప్పుడు ఆహ్వానిస్తున్నారు. కానీ పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్.. మరో ఐఏఎస్ అధికారితో కలిసి వెళ్లి పిలిచిన పిలుపుల ఫోటోలు, వీడియోలు చూసిన వారికి మైండ్ బ్లాంక్ అవుతుంది. ఏ మాత్రం ప్రొఫెషనలిజం లేకుండా … పారిశ్రామికవేత్తల్ని డీల్ చేశారు. కనీసం డ్రెస్ సెన్స్ కూడా పాటించలేదు. అంబానీ లాంటి పారిశ్రామికవేత్తతో పెట్టుబడుల కోసం జరిపే సమావేశాలకు చెప్పులేసుకుని వెళ్తారా.. కనీసం షూ వేసుకుని వెళ్లరా ? కార్పొరేట్ ప్రపంచంలో ఓ చిన్న ఉద్యోగం ఇవ్వడానికి ఎలాంటి ప్రమాణాలు పెట్టుకుంటారో తెలిస్తే.. పెట్టుబడులు పెట్టడానికి ఇంకా ఎన్ని కొలతలు వేసుకుంటారో అంచనా వేయవచ్చు. కానీ గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా పని చేసి ఏపీ పరువు తీయడం తప్ప ఏమీ చేతకానట్లుగా మంత్రులు వ్యవహరించేశారు.

దావోస్‌పై గుడివాడ చేసిన కామెంట్లతో పారిశ్రామికవేత్తలు నవ్వుకోరా ?

దావోస్‌కు వచ్చే పారిశ్రామికవేత్తలు స్నానాలు చేయరు. .. అందుకే వెళ్లలేదంటూ… గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్లు … ప్రపంచంలో ఏపీని ఎలా చూడాలో ఓ స్పష్టతనిస్తాయి. పారిశ్రామిక ప్రపంచంలో ఎవరైనా ఏపీని ఇక గౌరవిస్తారా ? ఇది ఒక్కటే కాదు.. ఎన్నో ఉన్నాయి. ప్రజలు అధికారం ఇచ్చింది.. . ఇష్టారీతిన వ్యవహరించమని కాదు.. కనీసం కాస్త బాధ్యతగా అయినా ఉండాల్సి ఉంది. అలాంటిది లేకుడా.. అన్ని విధాలుగా పరిపాలనను అపహాస్యం చేస్తూ…. ఏపీని చులకన చేస్తున్నారు. మొత్తంగా నష్టపోతోంది.. ఏపీ ప్రజలు.. అంతే కానీ సీఎం జగన్ కానీ.. మంత్రులు కానీ కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close