ఏం పీక్కుంటారో పీక్కోండి..!.. ఇదీ పోలవరంపై మంత్రిగారి ఆన్సర్ !

పోలవరం పూర్తి చేయలేదు.. ఏం పీక్కుంటారో పీక్కోండి..! అని.. పోలవరం పూర్తి చేసే డెడ్ లైన్ ముగిసిపోయిన అంశంపై వస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో డిసెంబర్ 1, 2021 కల్లా పూర్తిచేసి ప్రారంభిస్తామని చాలెంజ్ చేశారు జలవనరుల మంత్రి అనిల్ కుమార్. ఆయన మామూలుగా చెప్పలేదు. మిమిక్రి చేశారు. డైలాగులు కొట్టారు. సినిమా డైలాగులతో చెప్పారు. వియ్ ఆర్ కమిటెడ్ అన్నారు. ఒక్క సారి కమిటైతే మా మాట మేమే వినమన్నట్లుగా ఆయన అసెంబ్లీలో రక్తి కట్టించారు.

దీంతో ఆ వీడియోను నిన్న అంతా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు. ప్రస్తుతం పోలవరం పనుల స్టేటస్‌ను కూడా పెట్టారు. రెండున్నరేళ్లలో మూడు శాతం పనులు కూడా పూర్తి కాలేదు. దీనిపై అనిల్‌కుమార్‌ను నెటిజన్లు కాస్త గట్టిగానే ప్రశ్నించారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం అయితే మొత్తం ఈ వీడియోను శక్తి మేర వైరల్ చేసింది. దీనిపై మంత్రి అనిల్ చివరికి స్పందించాల్సి వచ్చింది. అనుకున్న గడవు ప్రకారం పూర్తి చేయలేదని ఏం చేసుకుంటారో చేసుకోమని తేల్చేశారు.

అన్నింటికీ వైసీపీ నేతల సమాధానం ఇంతే ఉంది. గతంలో సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారు. మీ అమ్మ మొగుడు చెప్పాడా అంటూఓ మంత్రి చెలరేగిపోయారు. ఇప్పుడు అనిల్ కుమార్ వంతు. ప్రజల్ని ఎంతో తక్కువగా అంచనా వేయబట్టే.. ఈ నేతలు ఇలా దిగజారిపోతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అయినా వారు వెనక్కి తగ్గలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close