పీకే బ‌ర్త్‌డే స్పెష‌ల్ : అనిరుథ్ గిఫ్ట్ అదిరింది


ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజున‌… టీజ‌ర్‌లేదు, టైటిల్ లేదు అని బెంగెట్టేసుకొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌కి త్రివిక్ర‌మ్ ఓ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు. ఈరోజు ఉద‌య‌మే… ప‌వ‌న్ 25వ సినిమాకి సంబంధించిన ఓ పాట రుచి చూపించాడు. అనిరుథ్ ఆల‌పిస్తుంటే.. ప‌క్క‌నున్న త్రివిక్ర‌మ్ త‌న్మ‌య‌త్వంతో వింటున్న వీడియో ఒక‌టి వ‌దిలారు. చివ‌ర్లో మెరుపులా ప‌వ‌న్ ప్ర‌త్య‌క్ష్యం అవ్వ‌డం హైలెట్‌. బ‌య‌ట‌కొచ్చి చూస్తే టైమేమో… త్రీ ఓ క్లాక్ అంటూ సాగే ఈ మెలోడీ ఒక్క‌సారి వింటే చాలు…. హృద‌యానికి ప‌ట్టేసేలా ఉంది. ట్యూన్ అదిరింది. అందులో రిలిక్స్ కూడా స‌ర‌దాగా హమ్మింగ్ చేసుకొనేలా ఉంది. త్రివిక్ర‌మ్ – ప‌వ‌న్ – దేవిశ్రీ ప్ర‌సాద్‌ల‌ది విజ‌య‌వంత‌మైన జోడీ. దేవిని కాద‌ని అనిరుథ్‌ని తీసుకొచ్చినందుకు… తొలి పాట‌లోనే త‌న స‌త్తా ఏంటో చూపించేశాడు అనిరుథ్‌. ఈ పాట తెర‌పై ఎలా ఉంటుందో అంటూ అభిమానులు అప్పుడే.. ఎవ‌రి రేంజులో వాళ్లు ఊహించేసుకొంటున్నారు. ప‌వ‌న్ పుట్టిన రోజు కి ఏదో లోటు ఉంది… అనుకొంటున్న త‌రుణంలో త్రివిక్ర‌మ్ ఇచ్చిన ఈ గిఫ్ట్ ఒక్క మాట‌లో అద‌ర‌హో అనిపించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.