త్వ‌ర‌గా తేల్చ‌వ‌మ్మా.. జేజ‌మ్మా..

చిరంజీవి 150వ సినిమా హీరోయిన్ ఎవ‌రు అన్న విష‌యంలో ఇంకా క‌న్‌ఫ్యూజ‌న్ కొన‌సాగుతోంది. న‌య‌న‌తార‌ని అనుకొని చిత్ర‌బృందం ఇప్పుడు అనుష్క ద‌గ్గ‌ర ఆగిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవి – అనుష్క జోడీ ఆల్మోస్ట్ క‌న్‌ఫామ్ అయిపోయింద‌నుకొన్నారు. కానీ.. అనుష్క మాత్రం ఇంకా ఏ విష‌యం తేల్చ‌డం లేద‌ని టాక్‌. అనుష్క ప్ర‌స్తుతం బాహుబ‌లి 2, భాగ‌మ‌తి, సింగం 3 సినిమాల‌తో బిజీగా ఉంది. దాంతో పాటు న‌మో వెంకటేశాయ‌లోనూ న‌టిస్తోంది. ఇన్ని సినిమాల మ‌ధ్య చిరు సినిమాకి కాల్షీట్లు కేటాయించ‌గ‌ల‌నా..?? అని ఆలోచిస్తోంద‌ట‌. మిగిలిన సినిమా వాళ్ల‌ని అడిగి.. మేమేదో ఎడ్జిస్ట్ చేసుకొంటాం.. నువ్వు య‌స్ అని చాలు.. అని అనుష్క‌ని భ‌రోసా ఇస్తున్నా, జేజ‌మ్మ అవును, కాదు అనేదేం చెప్ప‌కుండా నాన్చుతుంద‌ని టాక్‌.

ఈనెల 6వ తేదీన క‌త్తిలాంటోడు సెట్స్‌పైకి వెళ్ల‌నుంది. ఈలోగా చేస్తావో, లేదో తేల్చుకో అని చిత్ర‌బృందం అల్టిమేట్టం జారీ చేసిందట‌. అనుష్క‌కి చిరు సినిమాకి ఓకే అనేద్దాం అని ఉన్నా.. కాస్త బెట్టు చేస్తే పారితోషికం విష‌యంలో రిబేటు ఇవ్వాల్సిన అవ‌స‌రం లేద‌ని, అందుకే.. ఈ వ్య‌వ‌హారంలో జాప్యం చేస్తోంద‌ని చెప్పుకొంటున్నారు. ప్ర‌స్తుతం చిరు సినిమాకి అనుష్క‌ని మించిన ప్ర‌త్యామ్నాయం లేదు. కాబ‌ట్టి స్వీటీ ఎంత అడిగినా ఇవ్వ‌డానికి రెడీగానే ఉంటారు. అయినా సరే, అనుష్క తొంద‌ర‌ప‌డ‌డం లేదంటే… పారితోషికంతో పాటు మ‌రో మేట‌రేదో ఉండే ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close