మెడికల్ కాలేజీలు.. ఓ ఉద్దానం ఆస్పత్రి..! అదీ కథ..!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆయన తన ఇంట్లో ఏర్పాటు చేసిన సింహాసనం లాంటి కుర్చీలో కూర్చుని ఎప్పుడు మీట నొక్కాలనుకున్న ఫుల్ పేజీ ప్రకటనలు రెడీ అయిపోతూ ఉంటాయి. ఈ సారి ఆయన పధ్నాలుగు మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయబోతున్నట్లుగా.. కొన్ని కోట్లు వెచ్చించి ప్రకటనలు జారీ చేసేశారు. పార్లమెంట్ నియోజకవర్గానికో మెడికల్ కాలేజీ అన్న హామీ మేరకు ఈ శంకుస్థాపన చేస్తున్నారు. నిజానికి ఆయా మెడికల్ కాలేజీలకు పూర్తి స్థాయిలో భూములు కూడా సేకరించలేకపోయారు. కొన్ని చోట్ల సేకరించినా వివాదాల్లో పడ్డాయి. వాటికి అన్ని అనుమతులు వచ్చాయా.. అంటూ… ఒకరి మొహాలు ఒకరు చూసుకోవాల్సిన పరిస్థితి.

20నెలల్లో పునాదులు కూడా పడని ఉద్దానం ఆస్పత్రి..!

నిజానికి ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాల్లో ఎంత చురుకుగా వ్యవహరిస్తుందో తెలుసుకోవాలంటే… జగన్ సీఎం అవగానే శంకుస్థాపన చేసిన ఉద్దానం ఆస్పత్రి కథ తెలుసుకోవాలి. సీఎం అయ్యాక…2019 సెప్టెంబరు 3న జిఓ నెంబరు 102ను జగన్ జారీ చేశారు. 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, డయాలసిస్‌ కేంద్రం, రీసెర్చ్‌ కేంద్రం నిర్మాణానికై 50 కోట్ల రూపాయలు, సిబ్బంది వేతన భత్యాలకు అయ్యే ఖర్చులకు సాలుకు 8.3 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఆ జిఓలో ఉత్తర్వులు జారీ చేశారు. అదే నెల 6న స్వయంగా ముఖ్యమంత్రి చేతుల మీద గానే పలాసలో ఆ ఆసుపత్రికి శంకుస్థాపన కూడా జరిగింది. పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలను పరిష్కరించేశామన్నారు. కానీ ఇప్పటికి ఏడాదిన్నర దాటింది. అక్కడపునాదులు కూడా పడలేదు.

రెండేళ్ల నుంచి మెడికల్ కాలేజీల కబుర్లు..!

రాష్ట్ర ప్రభుత్వం 2019 -20, 20-21 ఆర్థిక సంవత్సరాల బడ్జెట్లలో 50కోట్ల రూపాయలు చొప్పున కేటాయించింది. కానీ విడుదల మాత్రం చేయలేదు. పునాదుల్లో తుప్పు పట్టిన ఇనుప రాడ్లు మాత్రమే దర్శనమిస్తున్నాయి. సిబ్బంది నియామకం కూడా జరగలేదు. ఇక ఉద్దానం రోగులకు ప్రతి ఐదు వందల మంది రోగులకు ఒక హెల్త్‌ వర్కర్‌, కిడ్నీ పేషంట్లకూ వారి సహాయలకూ ఉచిత బస్‌ పాస్‌ వంటి అనేక ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. మాటలు కోటలు దాటుతాయ్.. కనీస చేతలు మాత్రం గడపదాటవన్నట్లుగా.. అన్ని వ్యవహారాల్లోనూ అంతే ఉంది. గతంలోనే మెడికల్ కాలేజీలకు నిధుల విడుదల అంటూ హంగామా చేశారు. కానీ ఆ నిధులన్నీ ఏమయ్యాయో… కూడా ఎవరికీ తెలియదు.

అప్పుల కోసమే శంకుస్థాపనలు..!?

అయితే ఇప్పుడు సీఎం జగన్ మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయడానికి కారణం అప్పులన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎందుకంటే.. కొద్ది రోజుల కిందట..ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్పొరేషన్ ఉద్దేశం అప్పులుచేయడం. ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పోరేషన్ ద్వారా దాదాపుగా రూ. పదహారు వేల కోట్ల అప్పులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ డబ్బులతో మెడికల్ కాలేజీలు పెడతామని అంటోంది. ఆ అప్పులు సేకరించాలంటే.. అర్జంట్‌గా మెడికల్ కాలేజీలకు శంకుస్థాపన చేయాల్సిన పరిస్థితి. ఒక వేళ నిజంగా అప్పులు వచ్చినా.. అవి సంక్షేమ పథకాలకు పంపిణీ చేస్తారు కానీ.. మెడికల్ కాలేజీలు కట్టరు. అది ఉద్దానం ఆస్పత్రితోనే తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close