సుభాష్ : ఇసుక తుపాన్‌లో కొట్టుకుపోనున్న సర్కార్..!

మంత్రులు ఎక్కడికి వెళ్లినా ఇసుక నిరసనల స్వాగతం ఎదురొస్తోంది. అడ్డాకూలీల సెంటర్‌కు వెళ్తే.. ప్రభుత్వంపై శాపనార్ధాలే హై పిచ్‌లో వినిపిస్తూ ఉంటాయి. జీవితాంతం సంపాదించిన సొమ్ముతో సొంత ఇల్లు కట్టుకుందామనుకుంటున్న వారికి..ఆశ ..నిరాశయ్యే పరిస్థితి ఉంది. వాళ్లు పళ్లు పటపటా నూరుతున్నారు. నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి ఒక్కరు.. ఐదు నెలలుగా ఆదాయం కోల్పోవడంతో.. రగిలిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి ఇదే.

ఉచితంగా వచ్చే దాన్ని అదృశ్యం చేసి.. అమ్మేసుకుంటున్నారు..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు, మూడు రోజుల్లోనే ఇసుకను నిలిపేసింది. అప్పట్నుంచే… కష్టాలు ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వంపై ఇసుక మాఫియా ఆరోపణలు చేసి.. ఇప్పుడు అంత కంటే.. ఎక్కువగా చుక్కలు చూపిస్తున్నారు పాలకులు. 2014లో వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఈ ప్రయోగం విఫలం కావడంతో చంద్రబాబు 2017లో ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించారు. కొత్త ప్రభుత్వం ధర పెట్టి అమ్మాలనుకుంది. ధర పెట్టింది కానీ.. ఇసుకను అమ్మలేకపోతోంది. అందుబాటులోకి తీసుకురాలేకపోతోంది. అసలు ఏపీలో ఇసుకే లేదా… అంటే.. ఉంది. అది ఆన్ లైన్ లో దొరకదు. కానీ ఆఫ్ లైన్ లో దొరుకుతుంది. మే నెలకు ముందు ట్రాక్టర్ రెండు వేలకు వస్తే.. ఇప్పుడు అది ఎనిమిది వేలు అయింది. అంత పెద్ద మొత్తంతో కొని ఇళ్లు కట్టలేక చాలా మంది సైలెంటయిపోయారు.

రోజుల్లోనే కోట్లకు పడగలెత్తిన వైసీపీ నేతలు..!

ఇసుక కొరతతో ఏపీలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది నిజం. అడ్డా కూలీల దగ్గర్నుంచి సిమెంట్ కంపెనీల వరకూ.. అందరూ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మిగతా వారి సంగతేమో కానీ.. పనులు దొరికితేనే కడుపు నింపుకునేవారి పరిస్థితి మాత్రం దుర్భరం. ప్రభుత్వ నిర్ణయాల వల్లే.. ఈ పరిస్థితి వచ్చిందని పెద్దలకూ తెలుసు. ఇలాంటప్పుడు.. పేదలకు సాయం చేసే విషయం ఆలోచించడం.. మానవత్వం ఉన్న నేతల లక్షణం. కానీ ఏపీ సర్కార్ పెద్దలు మాత్రం.. అసలు సమస్యను గుర్తించడానికే సిద్ధపడటం లేదు. ఏపీలో కూడా బ్లాక్‌లో దొరుకుతోంది. కొత్త విధానం వచ్చిన కొద్ది రోజులకే.. పలువురు వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారు. సాక్షాత్తూ వైసీపీ నేతల మధ్యే.. దీనిపై పంచాయతీలు నడిచాయి. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఇసుక.. పొరుగు రాష్ట్రాలకు తరలిపోతోది.

రోడ్డెక్కనున్న పవన్..! ఉద్యమ బాటలో జనం..!

ఆంధ్రప్రదేశ్‌కు ఇసుక లేకపోవడం సమస్య కాదు. ఏపీలో ఉన్న నదుల్లో దండిగా ఇసుక దొరుకుతుంది. వరదలు.. అన్ని నదుల్లోనూ వస్తున్నాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రాల్లోనూ భారీ వరదలు వస్తున్నాయి. కానీ ఏ రాష్ట్రంలోనూ ఇసుక కొరత లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో తప్ప. ఇసుక కొరత వల్ల ఐదు నెలల్లో ఏపీలో ప్రజలు, కార్మికులు చివరకు ప్రభుత్వం కూడా నష్టపోయింది. కార్మికులు మరో రెండేళ్ల పాటు పని చేసినా.. ఈ ఐదు నెలల్లో చేసిన అప్పులను తీర్చుకోవడం కష్టమే. అధికారం అందిన ఉత్సాహంలో ప్రభుత్వం … ఓ సమస్యను సృష్టిచింది. ఇప్పుడు పరిష్కరించలేక తంటాలు పడుతోంది. ఈ పరిస్థితి కొనసాగితే.. రాజకీయ పార్టీలు హెచ్చరిస్తున్నట్లుగా ప్రజల్లో ఇసుక తుఫాన్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. పవన్ రోడ్డెక్కుతున్నారు. ఇప్పటికే టీడీపీ ఆందోళనలు ప్రారంభించింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close