తెలంగాణలో హైలెట్ అవుతున్న ఏపీ మంత్రి “కొండ పోచమ్మ” కథలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కొండ పోచమ్మ సాగర్‌లో పనులు చేసిన ఏపీ మంత్రి నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రాజెక్ట్ నుంచి సంగారెడ్డిని నీటిని విడుదల చేసేందుకు గేట్లు నిర్మించారు. ఆ గేట్ల వద్దకు వెళ్లేందుకు ఓ వంతెన నిర్మించారు. ఆ ప్రాజెక్టులోకి కాస్త నీరు చేరగానే.. ఆ వంతెన కూలిపోయింది. దాంతో.. అధికారులు ఉలిక్కి పడ్డారు. కేసీఆర్ ఆ ప్రాజెక్టును చాలా ఆర్భాటంగా ప్రారంభించారు. దానికి కారణం ఆ ప్రాంతాన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. దానికి తగ్గట్లుగానే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. వంతెన కూలిన విషయం తెలిసిన వెంటనే.. అధికారులు పర్యాటకుల్ని నిలిపివేశారు. అటు వైపు ఎవరూ వెళ్లకుండాపెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరింప చేశారు.

ఆ ప్రాజెక్ట్‌ను కాంట్రాక్ట్ తీసుకుని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పిలిపించి.. యుద్ధ ప్రాతిపదికన మళ్లీ ఆ వంతెన కట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం కాంట్రాక్టర్ కూలిపోయిన వంతెనను మళ్లీ కట్టే పనులు ప్రారంభించారు. ఇంతకీ ఆ కాంట్రాక్టర్ ఎవరు అంటే.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి అని.. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ వంతెన కట్టింది ఒక ఏపి మంత్రికి చెందిన కంపెనీ అని, ఆ ఏపీ మంత్రి నిర్వాకం బయట పడకుండా, కేసీఆర్ పోలీసులని పెట్టి, దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ, కొన్ని ఫోటోలు, వీడియోలు తన ట్విట్టర్ లో వదిలారు. తెలంగాణలో., ముఖ్యంగా ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వైసీపీ నేతలు … కాంట్రాక్టులు చేస్తున్నారు.

కొండ పోచమ్మ సాగర్ నిర్మాణ నాణ్యతపై కొద్ది రోజులుగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ నెలలోనే కాస్త ఎక్కువ వరద రావడంతో రిజర్వాయర్ కాలువకు గండి పడి ఉళ్లు మునిగిపోయాయి. దాదాపు రూ.1,600 కోట్ల వ్యయంతో కొండ పోచమ్మ ప్రాజెక్టు చేపట్టారు. నాలుగేళ్లలోనే 15 టీఎంసీల సామర్థ్యంతో కొండ పోచమ్మ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిర్మించారు. కాంట్రాక్టర్ పనులను నాసిరకంగా చేయడంతో ప్రభుత్వం అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా జగన్ రెడ్డి..!?

తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన పొరపాటే వైసీపీ కూడా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను బీఆర్ఎస్ విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్తే..ఏపీలో టీడీపీ సూపర్ సిక్స్ గ్యారంటీలను జగన్ రెడ్డి ప్రజల్లోకి...

జాతీయ స్థాయిలోనూ కాంగ్రెస్ ను రేసులో నిలబెడుతోన్న రేవంత్..!!

రేవంత్ రెడ్డి...ఈ పేరు జాతీయ స్థాయిలో చర్చనీయాంశం అవుతోంది. వ్యుహమో మరేమో కానీ, రిజర్వేషన్లపై కుట్ర జరుగుతుందంటూ బీజేపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. రిజర్వేషన్లపై రేవంత్ వ్యాఖ్యల పుణ్యమా అని బీజేపీ జాతీయ...

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close