“ఆ” ఉద్యోగాల కల్పనలో ఏపీ నెంబర్ వన్..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండ్ గురించి …రచ్చ జరుగుతోంది. నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో ముఖ్యంగా బీపీఓ ఉద్యోగాల కల్పనలో ఏపీ ప్రభుత్వం దేశంలో అందరి కన్నా ముందు ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ” ద ఇండియా బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ ప్రమోషన్‌ స్కీమ్‌” అనే కొత్త విధానాన్ని తీసుకు వచ్చింది. ఈ కేటగిరీలో బీపీఓ ఉద్యోగాలను సృష్టించడాన్ని ప్రోత్సహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ఈ స్కీమ్‌లో మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఈ పథకం కింద దేశంలోని రెండో, మూడో శ్రేణి పట్టణాల్లో పలు ఐటీ, బీపీవో కంపెనీలను విస్తరించి..12,234 ఆంధ్రప్రదేశ్ సృష్టించింది. సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా దీన్ని ధృవీకరించింది. రెండో స్థానం తమిలనాడుకు దక్కింది. ఏపీతో పోలిస్తే.. ఎక్కడో దూరంగా…9401 ఉద్యోగాలతో రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఉద్యోగులు పొందుతున్న వారిలో అత్యధికులు మహిళలే ఉంటున్నారు. ఏపీ సర్కార్ బీపీఓ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.

బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు… ప్రైవేటు రంగంలో కల్పిస్తారు. అందుకే.. వీటిని ఇటీవల ప్రభుత్వ ప్రకటించిన ఉద్యోగాల విప్లవం ప్రకటనల్లో పొందు పర్చలేదు. అందులో చెప్పిన ఆరున్నర లక్షల ఉద్యోగాలు… పక్కాగా ప్రభుత్వ ఉద్యోగాలు. బీపీఓ ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు. అంటే… ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగాలే కాకుండా… ప్రైవేటు రంగంలోనూ ఏపీలో ఉద్యోగాల విప్లవం వచ్చిందన్నమాట. దానికి ఏపీకి దక్కిన మొదటి ర్యాంకే నిదర్శనం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close