అశోక‌వనంలో అర్జున క‌ల్యాణం: గోదావ‌రి అల్లుడి క‌ష్టాలు

ఫ‌ల‌క్‌నామా దాస్‌, హిట్‌, పాగ‌ల్‌.. ఇలా ప్ర‌తీ సినిమాకీ ఓ కొత్త త‌ర‌హా పాత్ర‌లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు విశ్వ‌క్ సేన్‌. తెలంగాణ కుర్రాడు కాబ‌ట్టి.. ఆ యాస అద‌ర‌గొట్టేస్తాడు. తొలిసారి గోదావ‌రి అల్లుడిగా క‌నిపించ‌బోతున్నాడు. త‌ను క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం `అశోక‌వ‌నంలో అర్జున క‌ల్యాణం`. విద్యాసాగ‌ర్ చింతా ద‌ర్శ‌కుడు. రుక్సార్ దిల్లాన్ క‌థానాయిక‌. టీజ‌ర్‌ని కొద్దిసేప‌టి క్రితం విడుద‌ల చేశారు.

వ‌య‌సు మీద ప‌డుతున్నా – పెళ్లికాని ప్ర‌సాదు లాంటి అబ్బాయి. పెళ్లి చూపుల‌కు కుటుంబ స‌మేతంగా.. ఓ ఊరెళ్తే.. అక్క‌డ ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఎలా ఇరుక్కుపోయాడ‌న్న‌ది క‌థ‌. విశ్వ‌క్ సేన్ గెట‌ప్‌, హావ‌భావాలు.. అన్నీ స‌రికొత్త‌గా అనిపిస్తున్నాయి. ఈ పాత్ర‌లో విశ్వ‌క్ పూర్తిగా కొత్త‌గా క‌నిపిస్తున్నాడు. చుట్టూ ర‌క‌ర‌కాల క్యారెక్ట‌ర్లూ, క్యారెక్ట‌రైజేష‌న్లు.. గోదావ‌రి ఎట‌కారం.. వాళ్ల ప‌ద్ధ‌తులు, మ‌ర్యాద‌లూ, మ‌ధ్య‌లో ప్రేమ‌క‌థ‌లూ.. ఇవ‌న్నీ ఈ టీజ‌ర్‌లో నింపేశారు. సినిమా ఫ‌న్ రైడ్ గా సాగిపోతుంద‌న్న భ‌రోసా ఈ టీజ‌ర్ తో క‌లిగింది. ఇదే టెంపో.. వెండి తెర‌పైనా క‌నిపిస్తే… విశ్వ‌క్ సేన్ మ‌రో హిట్టు కొట్టిన‌ట్టే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.