చంద్రబాబు అరెస్ట్ అవినాష్ రెడ్డికి కలిసి వచ్చింది !

సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుపై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు తర్వాత హౌస్ అరెస్ట్, బెయిల్ పిటిషన్ల పని మీద ఉన్న లాయర్ సిద్ధార్ధ లూథ్రా అందుబాటులో లేకపోవడంతో విచారణ వాయిదా వేయాలని సుప్రీంను వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి కోరారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను సుప్రీంకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది.

వివేకా హత్య కేసు లో A8 అవినాష్‌కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సునీతా రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ముందు కేసు విచారణ జరిగింది. అవినాష్ బెయిల్ రద్దుకు మద్దతుగా ఇటీవల సీబీఐ కౌంటర్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వివేకా హత్య కేసులో A 8గా ఉన్న అవినాష్‌కి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

తన తండ్రి హత్యకు ప్రధాన సూత్రధారి అవినాష్ రెడ్డి అని కేసు దర్యాప్తుకి సహకరించకుండా తప్పించుకుంటున్నారని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు వ్యవహారంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. వివేకా హత్యకు భాస్కర్ రెడ్డి , అవినాష్ రెడ్డి కుట్ర చేశారని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది. రాజకీయ వైరంతోనే వివేకా హత్య జరిగిందని సీబీఐ స్పష్టం చేసింది. గుండెపోటు అంటూ కట్టుకథ అల్లారని పేర్కొంది. అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉందని సీబీఐ వెల్లడించింది. వివేకా హత్యకు అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిలే సూత్రదారులు అనడానికి అన్ని ఆధారాలు ఉన్నాయని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొంది.

హైకోర్టు ఇతర నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దవుతుందని అనుకున్నారు. కానీ న్యాయవాది లేకపోవడంతో సునీతారెడ్డినే విచారణ వాయిదా కోరుకోవాల్సి వచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close