ఇన్‌సైడ్ టాక్‌: బాల‌య్య ఆ రీమేక్ చేయ‌ట్లేద‌ట‌

అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్.. – ఈ మ‌ల‌యాళ చిత్రం త‌ర‌చూ వార్త‌ల్లో వినిపిస్తూనే ఉంది. హారిక హాసిని సంస్థ ఈ సినిమా రీమేక్ హ‌క్కుల్ని తీసుకుంది. అది బాల‌కృష్ణ కోస‌మే అనే వార్త బాగా చ‌క్క‌ర్లు కొట్టింది. రెండో క‌థానాయ‌కుడిగా రానాని ఎంచుకున్నార‌ని చెప్పుకున్నారు. రెండో క‌థానాయ‌కుడిగా రానా ఉన్నా లేకున్నా, ఈ సినిమా మాత్రం బాల‌కృష్ణ చేయ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. నిజానికి బాల‌య్య‌తోనే ఈ సినిమా చేయాల‌ని హారిక హాసిని సంస్థ భావించింది. కాక‌పోతే ఈ క‌థ బాల‌య్య‌కు సెట్ అవ్వ‌ద‌న్న అభిప్రాయానికి వ‌చ్చిందిప్పుడు. బాల‌కృష్ణ కూడా ఈ సినిమా రీమేక్‌పై పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేద‌ని, దాంతో… మ‌రో అగ్ర క‌థానాయ‌కుడితో ఈ సినిమా చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. ఆ క‌థానాయ‌కుడ్ని వెదికే బాధ్య‌త ఇప్పుడు సురేష్ బాబు తీసుకున్నార‌ట‌. ఎప్పుడైతే ఈ ప్రాజెక్టులోకి రానా ఎంట్రీ ఇచ్చాడో, అప్పుడే సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ కూడా హారిక‌తో చేతులు క‌లిపింది. ఇప్పుడు సురేష్ బాబునే ఈ ప్రాజెక్టు డీల్ చేస్తున్నారు. వెంక‌టేష్ కి ఈ క‌థ సెట్ట‌వుతుంద‌ని సురేష్ బాబుకి కొంత‌మంది స‌ల‌హాలు ఇస్తున్న‌ట్టు టాక్‌. ఎప్ప‌టి నుంచో వెంకీ – రానా కాంబోలో ఓ సినిమా తీయాల‌ని సురేష్‌బాబు కూడా భావిస్తున్నారు. కాక‌పోతే.. ఈ సినిమాని వెంకీతో చేయ‌డం ప‌ట్ల సురేష్ బాబు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేద‌ట‌. వెంకీ, రానా కోసం మ‌రో శ‌క్తిమంత‌మైన క‌థ రెడీ అవుతోంద‌ని, అందుకే అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్ కోసం మ‌రో హీరోని అన్వేషిస్తున్నార‌ని టాక్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close