చూపులకే బక్కబలి…చేతల్లో మహాబలి

అతను భారతీయుడు. అతను దక్షిణాఫ్రికా నేలమీద తిరగాడిన రోజులవి. చాలా బక్కపలచగా ఉన్నాడు. అయితేనేం, ఎవరేం చెప్పినా వినడానికి చెవులు మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. కళ్లతోనే ఎదుటి మనిషి భావాలను స్కాన్ చేయగలడు. ఈ బక్కబలి తన జీవితకాలంలో ఎప్పటికీ బాహుబలి (కండలు తిరిగిన వీరుడు) కాలేదు. కానీ మహాబలి..మహా మనోబలి అయ్యాడు. తన బుద్ధిబలమే అతని ఆయుధం. అతను మరెవరో కాదు, మన జాతిపిత. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. మహాత్మాగాంధీ పోరాట జీవితానికి ఆయన దక్షిణాప్రికా పర్యటన – `బాపు ద బెగినింగ్’ అయితే, స్వదేశంలో ఆయన చేసిన అహింసాపోరాటం `బాపు- ద కన్ క్లూజన్’. గాంధీజీ జయంతి సందర్భంగా బాపు ద బెగినింగ్ లోని కొన్ని విషయాలు ప్రస్తావించుకుందాం.

తొలి అడుగు

శ్వేతజాతీయుల అహంకారానికి తొలిసారి చవిచేసేనాటికి అతని వయసు మూడుపదులుదాటలేదు. శారీరక దృఢత్వం లేకపోయినా మానసిదృఢత్వం హిమాలయశిఖరమంత మహోన్నతంగా ఎదిగింది. `ఈ బక్కమనిషి మనల్నిఏంచేస్తాడులే..’ అంటూ జాత్యాహంకారంతో పెట్రేగిపోయిన తెల్లవారిని తన మనోబలంతో బిత్తరపోయేలా చేశాడు. మనదేశంలో జాతీయోధ్యమానికి ఊతం ఇవ్వడానికి ముందే ఆఫ్రికాలో తెల్లవారిని గడగడలాడించాడు. 1869 అక్టోబర్ 2న జన్మించిన గాంధీ 24ఏళ్లకు అంటే 1893లో దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టాడు. అక్కడి జాతివివక్షను అర్థంచేసుకోవడానికి ఎక్కవకాలం పట్టలేదతనికి. జాత్యాంహకార దక్షిణాఫ్రికా ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పింది.

1914లో ఆయన స్వదేశానికి తిరిగివచ్చాక ఒక సభలో మాట్లాడుతూ, తాను పుట్టింది భారతదేశంలోనేఅయినా నన్ను తయారుచేసింది దక్షిణాఫ్రికానే. నిజమే గాంధీని ఒక భవిష్య ఉద్యమ సారథిగా సిద్ధం చేసింది దక్షిణాఫ్రికానే.

రైల్లోనుంచి తోసేశారు

అతనేమీ టికెట్ లేని ప్రయాణీకుడుకాడు. కానీ రైల్లోనుంచి నెట్టివేయబడ్డాడు. ప్రెటోరియా వెళుతుంటే తన వద్ద ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ, ఒక తెల్లజాతీయుడు తన పక్కన నల్లజాతీయుడు(గాంధీ) కూర్చోవడం ఇష్టంలేక ఫిర్యాదుచేశాడు. సరిగా అప్పుడే గాంధీకి వర్ణవివక్ష ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. ఆ వెంటనే 1894 (అంటే దక్షిణాప్రికాకు వెళ్ళిన ఏడాదికే) గాంధీ నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ ను ఏర్పాటుచేశారు. దక్షిణాఫ్రికా స్వజాతీయులకు, అలాగే భారతీయులకు జరుగుతున్న వివక్షధోరణికి వ్యతిరేకంగా అహింసాయుత మార్గంలో ఈ సంస్థ ఉద్యమం ప్రారంభించింది. మరో రెండేళ్ల తర్వాత (1896)లో గాంధీ స్వదేశానికి వచ్చి కొద్దికాలం ఉన్నారు. ఆ కొద్దిసమయంలోనే ఆయన తనతో కలిసి పనిచేసే దళాన్ని రూపొందించుకున్నారు. ఈ దళంలో 800మంది భారతీయులున్నారు. వారంతా కలిసి దక్షిణాప్రికాలో జాతివివక్షకు వ్యతిరేకంగా పోరాడటానికి వెళ్ళారు. బక్కపలచగా ఉన్నాడు, వీడేం చేస్తాడులే అనుకుని రైళ్లోనుంచి త్రోసివేస్తే గాంధీ తన బుద్ధిబలంతో మహాదళాన్నే సిద్దంచేసుకుని వెళ్లడాన్ని శ్వేతజాతీయులు సహించలేకపోయారు. దక్షిణాఫ్రికా చేరగానే శ్వేతజాతీయుల నుంచి దాడిని ఎదుర్కోవాల్సివచ్చింది.

అంబులెన్స్ సేన

గాంధీ శత్రువులో కూడా మానవత్వం దాగి ఉంటుందని భావించే మనిషి. వారికి కష్టం వచ్చినప్పుడు సేవచేయాలన్నదే ఆయన ఆశయం. అందుకే 1899లో బోయర్ యుద్ధం సంభవించినప్పుడు 1,100మందితో భారతీయ అంబులెన్స్ సేనను ఏర్పాటుచేశారు. ఈ సేన గాయపడిన బ్రిటీష్ సైనికులకు ప్రాధమిక చికిత్స అందించేది. అయితే బ్రిటీషర్లు ఈ సాయాన్ని తీసుకుంటూనే జాతివివక్ష చూపిస్తూ హింసిస్తుండేవారు. ఆ సమయంలోనే గాంధీ అహింసాసిద్ధాంతపరంగా సత్యాగ్రహం పద్ధతిని తీసుకువచ్చారు. క్రమంగా సత్యాగ్రహం ఒక ఆయుధంగా మారింది. ఈ ఆయుధమే తర్వాతి కాలంలో మనదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చింది. 1906లో గాంధీ తొలి సత్యాగ్రహోద్యమం ప్రారంభించారు. స్థానిక భారతీయులకు వ్యతిరేకంగా అక్కడి ప్రభుత్వం తీసుకువచ్చిన ట్రాన్స్వాల్ ఆసియాటిక్ ఆర్డినెన్స్ ను గాంధీ పూర్తిగా నిరసించారు. ఆతర్వాత నల్లజాతీయులకోసం తీసుకువచ్చిన బ్లాక్ యాక్ట్ కు వ్యతిరేకంగా కూడా గాంధీ మరోసారి 1907 జూన్ లో సత్యాగ్రహం చేశారు.

Indians

అహింసామార్గాన్ని తట్టుకోలేక…

అహింసామార్గంలో సాగుతున్న ఉద్యమాన్ని కూడా సహించలేకపోయింది ఆనాటి దక్షిణాఫ్రికా ప్రభుత్వం. అందుకే 1908లో గాంధీని జైలుకు పంపించింది. జైలునుంచి బయటకువచ్చినా మళ్లీ ఇదేతరహా ఆరోపణలతో గాంధీ జైలుపాలుకావాల్సివచ్చింది. 1909లో జైలుకువెళ్ళివచ్చిన తర్వాత గాంధీ తనకు మద్దతు కూడగట్టుకునే విషయంలో ఇంగ్లండ్ వెళ్ళారు. క్రైస్తవేతర వివాహపద్దతులను నిరసించడాన్ని గాంధీ తప్పుబట్టారు. ఎవరి స్వేచ్ఛ వారికుండాలని ఉద్యమించారు.

మహాత్ముడు

గాంధీలోని ఉద్యస్ఫూర్తిగా దక్షణాఫిక్రా వేదికైంది. స్వదేశంలో సాగుతున్న స్వాతంత్ర్యఉద్యమానికి బాసటగా నిల్వడానికి గాంధీ 1914లో ఇండియాకు తిరిగివచ్చారు. గాంధీ స్వదేశానికి వచ్చిన తర్వాతనే మనదేశంలో అహింసామార్గంలో అనేకానేక ఉద్యమాలు చోటుచేసుకున్నాయి. చివరకు బ్రిటీషర్లు తోకముడిచారు. బక్కపలచగా ఉన్న ఒకే ఒక వ్యక్తిలోని కొండంత మనోబలం చూసిన బ్రిటీష్ పాలకులు నెవ్వరపోయారు. అదీ గాంధీ గొప్ప. అందుకే ఆయన మనకు జాతిపిత అయ్యారు. ఏజాతి వర్ణవివక్షకు గురైందో, ఏజాతి అవమానాలను సహించిందో ఆ జాతి…భారతజాతిని సరైన మార్గంలో నడిపించడం వల్లనే గాంధీ మహాత్ముడయ్యాడు.

-కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close