భద్రాద్రి రివ్యూ : రామయ్య కరుణ ఎవరికి..?

దక్షిణ అయోధ్యగా పేరొంది, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఉన్న భద్రాచలం విలక్షణ ప్రజాతీర్పుల కేంద్రంగాను గుర్తింపునొందింది. చుట్టూ అడవి నడుమ ఆదివాసీలు ఉన్న నియోజకవర్గం ఇది. ప్రధాన కేంద్రమైన భద్రాచలంలోనే సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ఉంది. ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌అధికారుల పాలన సాగుతోంది. నియోజకవర్గంలో ప్రస్తుతం ఐదు మండలాలు మాత్రమే ఉన్నాయి. గతంలో ఎనిమిది మండలాలు ఉండగా రాష్ట్ర విభజన నేపథ్యంలో చింతూరు, వీఆర్‌.పురం, కూనవరం మండలాలను నియోజకవర్గం నుంచి వేరుచేసి..ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో కలిపారు.

వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకి వెళ్లాయి. గతంతో పోలిస్తే ..ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఈ నియోజకవర్గం మూడు రాష్ట్రాలకు…తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛతీస్‌గఢ్‌లకు సరిహద్ధుగా ఉంది. భద్రాచలంనకు ఆనుకునే ఏపీ సరిహద్దు ఉండగా , పట్టణంలో ఉన్న శివారు కాలనీలు కూడా ఏపీలోనే కలిశాయి. అదే విధంగా దుమ్ముగూడెంకు కూతవేటు దూరంలోనే ఛతీస్‌గఢ్‌రాష్ట్ర సరిహద్దు ఉంది. ఈ కారణంగానే ఇక్కడ మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువ.

ఉమ్మడి రాష్ట్రంలో వైశాల్యం పరంగా అతిపెద్ద నియోజకవర్గమైన భధ్రాచలం ప్రస్తుత ఎన్నికలనాటికి మూడు ముక్కలైంది. 1952లో ఏర్పడి.. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉండేది. తొలినాళ్లలో జనరల్‌స్థానంగా ఉన్న నియోజకవర్గం 1967 ఎన్నికల నాటికి ఎస్టీ రిజర్వ్‌గా మారింది. 1955లో తొలిసారిగా ఎన్నికలు జరగ్గా..సీపీఐకి చెందిన శ్యామల సీతారామయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పటివరకు 14సార్లు ఎన్నికలు నిర్వహించగా ..సీపీఐ రెండు సార్లు ,4సార్లు కాంగ్రెస్‌, 8సార్లు సీపీఎంకు చెందిన అభ్యర్థులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. రాష్ట్ర విభజనకు ముందు 8మండలాలు, 2,11,437 మంది ఓటర్లు, 261 పోలింగ్‌బూతులు ఉన్న భద్రాచలం నియోజకవర్గం ప్రస్తుత ఎన్నికల నాటికి మూడు ముక్కలైంది . భద్రాచలం రూరల్‌, కూనవరం ,వీఆర్‌పురం, చింతూరు మండలాలు నియోజకవర్గం నుంచి వేరై ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ఱంలోని రంపచోడవరం నియోజకవర్గంలో విలీనమయ్యాయి. భద్రాచలం టౌన్‌ , దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు ఉన్నప్పటికీ, జిల్లాల విభజనతో వెంకటాపురం, వాజేడు మండలాలు భూపాలపల్లి జిల్లాలోకలిపారు.

భద్రాచలం నియోజకవర్గాన్ని సీపీఎంకు కంచుకోటగా అభివర్ణిస్తారు. ఇక్కడ ఆ పార్టీ 8సార్లు గెలుపొందింది. ముర్ల ఎర్రయ్యరెడ్డి రెండుసార్లు, కుంజాబొజ్జి మూడుసార్లు వరుసగా విజయం సాధించారు. అతిసాధారణ జీవితంతో బొజ్జి నేటి తరానికి ఆదర్శమూర్తిగా నిలిచారు. వరుసగా మూడుసార్లు గెలిచి..ఆదివాసీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించిన ఆయన ..ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారంచుట్టిన నేతగా గర్తింపుపొందారు. నేటికీ.. సొంతిల్లు కూడా లేక..సాధారణ జీవితాన్ని గడుపుతూ… నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ ..మన్ననలు అందుకుంటున్నారు. ఇక తాజా మాజీ ఎమ్యెల్యే సున్నం రాజయ్య కూడా మూడుసార్లు గెలిచారు. అయితే 2009లో ఆయన కాంగ్రెస్‌ అభ్యర్థి కుంజా సత్యవతి చేతిలో ఓడిపోయారు. మళ్లీ కంచుకోటలో పాగా వేసేందుకు సీపీఎం అభ్యర్థి సున్నం రాజయ్య గెలిచారు. ఈసారి రాజయ్య తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నుంచి పోటీ చేయనున్నారు. ఆయన సొంత మండలం …వీఆర్‌పురం ఏపీలో కలవడంతో అటు వెళుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close