బిచ్చ‌గాడి తో చేతులు క‌లిపిన వెంకీ

న‌కిలీ, డా.స‌లీమ్‌, బిచ్చ‌గాడు… ఇలా వెరైటీ క‌థ‌లు ఎంచుకొని షాక్ ఇస్తున్నాడు విజ‌య్ అంథోనీ. స్వ‌త‌హాగా సంగీత దర్శ‌కుడైనా న‌టుడిగా ఈ సినిమాలు త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక క్రేజ్ తీసుకొచ్చాయి. బిచ్చ‌గాడు వ‌సూళ్లు చూసి… టాలీవుడ్ అవాక్క‌య్యింది. విజ‌య్ చేస్తున్న తమిళ సినిమాల‌కు ఇప్పుడు తెలుగు రైట్స్ కోసం క్యూ మొద‌లైంది. అయితే విజ‌య్ మాత్రం త్వ‌ర‌లోనే తెలుగులో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. హీరోగా కాదు.. ద‌ర్శ‌కుడిగా. ఆమ‌ధ్య వెంక‌టేష్‌ని క‌ల‌సి ఓ క‌థ వినిపించాడు విజ‌య్‌. క‌థ‌లో ఫ్రెష్ నెస్‌, సింపుల్‌సిటీ న‌చ్చి వెంకీ కూడా ఓకే చెప్పేశాడు. కానీ.. ఆ సినిమా ప‌ట్టాలెక్కేదెప్పుడో వెంకీ చెప్ప‌లేదు. బాబు బంగారం త‌ర‌వాత రెండు మూడు స్క్రిప్టులు సిద్ధం చేయించాడు వెంకీ. ఆ జోరులో విజ‌య్ క‌థ సంగ‌తి దాదాపుగా మ‌ర్చిపోయాడ‌ని టాక్‌.

అయితే బిచ్చ‌గాడు వ‌సూళ్ల గురించి తెలుసుకొన్న వెంకీ.. ఇప్పుడు విజ‌య్‌ని లైన్లోకి ర‌ప్పించాడ‌ట‌. ”క‌థ సిద్దం చేసేయ్‌… మ‌న సినిమా త్వ‌ర‌గా మొద‌లెట్టేద్దాం” అని విజ‌య్‌ని తొంద‌ర‌పెడుతున్నాడ‌. బాబు బంగారం త‌ర‌వాత విజ‌య్ అంథోని సినిమానే ఉండొచ్చ‌న్న టాక్ వినిపిస్తోంది. విజ‌య్ సినిమాలు సీరియ‌స్ గాసాగుతాయి. అయితే.. వెంకీ సినిమాలో కామెడీ కూడా ఆశిస్తారు. అందుకే ‘కామెడీ ట‌చ్ ఉండేలా చూడు’ అంటూ ఒకే ఒక్క ష‌ర‌తు విధించాడ‌ట వెంకీ. మ‌రి దానికి విజ‌య్ ఏమంటాడో? ఈ విష‌యంలో ఇద్ద‌రూ ఓ అండ‌ర్‌స్టాండింగ్‌కి వ‌స్తే. ఈ సినిమా అతి తొంద‌ర్లోనే ప‌ట్టాలెక్కేయ‌డం ఖాయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆర్జీవీకి కూడా ప్రజాధనంతో బిల్లు సెటిల్ చేసిన జగన్ !

రామ్ గోపాల్ వర్మ ఏపీ ప్రజాధనాన్ని దండుకున్నారు. బయటకు తెలిసిన వివరాల ప్రకారం రెండు చెక్కుల ద్వారా రూ. కోటి 14 లక్షలు ఆయన ఖాతాలో చేరాయి. ఆయనకు చెందిన ఆర్జీవీ...

కూతుర్ని ప్రాపర్టీతో పోల్చిన ముద్రగడ !

ముద్రగడ పద్మనాభం అంటే మంచీ చెడూ రాజకీయ నేత అనుకుంటారు. కానీ ఆయన కుమార్తెను ప్రాపర్టీగా చూస్తారు. అలా అని ఎవరో చెప్పడం కాదు. ఆయనే చెప్పుకున్నారు. ఉదయం తన తండ్రి రాజకీయ...

వైసీపీ మేనిఫెస్టోలో ట్విస్ట్ – ఈ మోసాన్ని ఎవరూ ఊహించలేరు !

వైసీపీ మేనిఫెస్టోలో అతిపెద్ద మోసం .. రాజకీయవర్గాల్లో సంచలనం రేపుతోంది. చాలా పథకాలకు రెట్టింపు ఇస్తామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. అసలు ట్విస్ట్ ఇప్పుడు లబ్దిదారుల్లోనూ సంచలనంగా...

కేసీఆర్ రూ. కోటి ఇచ్చినా … మొగులయ్య కూలీగా ఎందుకు మారారు?

కిన్నెర కళాకారులు, పద్మశ్రీ దర్శనం మొగులయ్య రోజు కూలీగా మారారంటూ ఓ చిన్న వీడియో, ఫోటోలతో కొంత మంది చేసిన పోస్టులతో రాజకీయం రాజుకుంది. తనకు రావాల్సిన పెన్షన్ రావడం లేదని.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close