బిగ్ జోక్‌: ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్‌

ఎక్క‌డ‌, ఎందుకు, ఎలా పుట్టిందో తెలీదు గానీ.. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్నాడ‌న్న వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. బ‌హుశా… `అర‌వింద స‌మేత‌` స‌క్సెస్ మీట్‌కి బాల‌కృష్ణ రావ‌డం చూసి – బాల‌య్య‌, ఎన్టీఆర్‌లు క‌లిసిపోయారోచ్ అనుకుని, ఇలా క‌లిసిపోయారు కాబ‌ట్టి – త్వ‌ర‌లో క‌ల‌సి న‌టించేస్తారు అని కూడా అనేసుకుని.. దానికి `ఎన్టీఆర్` బ‌యోపిక్‌కీ లింకులు ఎట్టేశార‌న్న‌మాట‌.

`ఎన్టీఆర్` బ‌యోపిక్‌లో ఎవ‌రెవ‌రు, ఏయే పాత్ర‌లు చేస్తున్నార‌న్న విష‌యంలో ఎప్పుడో క్లారిటీ వ‌చ్చేసింది. ఇందులో కొత్త పాత్ర‌లేం లేవు. ఎన్టీఆర్ చేయ‌ద‌గిన పాత్ర అస్స‌లు లేదు. అలాంట‌ప్పుడు ఈ వార్త ఎందుకు పుట్టిందో. ఎన్టీఆర్ గ‌నుక అడుగుపెడితే ఈ సినిమాకి ఇంకాస్త ఎక్కువ రేట్ల‌కు అమ్ముకోవ‌చ్చ‌న్న పాయింట్ కూడా క‌రెక్ట్ కాదు.ఎందుకంటే.. `ఎన్టీఆర్‌` బ‌యోపిక్ కి ఈ సినిమా స్థాయికి మించిన రేట్లు వ‌స్తున్నాయి. రెండు భాగాలుగా తీస్తున్నారు కాబ‌ట్టి.. రెండింత‌ల రాబ‌డి. ఇవ‌న్నీ ఉండ‌గా జూనియ‌ర్‌ని కూడా క్యాష్ చేసుకుందామ‌న్న ఆలోచ‌న‌లో బాల‌య్య ఉంటాడా..?

పైగా… `అర‌వింద స‌మేత‌` స‌క్సెస్ మీట్‌లో బాల‌కృష్ణ స్పీచు, ఎన్టీఆర్ మాట‌లు, వాళ్లిద్ద‌రి `అవినాభావ సంబంధం` చూసిన‌వాళ్ల‌కెవ‌రికైనా `ఎన్టీఆర్‌లో ఎన్టీఆర్ న‌టిస్తాడ‌`న్న‌ది పెద్ద జోక్‌గా క‌నిపిస్తుంది. ఒక వేదిక‌పై నంద‌మూరి హీరోల్ని చూస్తే చూడొచ్చు గాక‌.. ఒక‌రి మ‌న‌సులో మ‌రొక‌రికి ఎంత చోటున్న‌ది అనేది వాళ్ల మాట‌ల్ని బ‌ట్టి తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నాడ‌న్న వార్త‌… కేవ‌లం గాలివాటంగా వ‌చ్చిందే అనిపిస్తోంది. ఆ మాట కొస్తే ఎన్టీఆర్ బ‌యోపిక్‌కి ప‌నిచేస్తున్న కొంత‌మంది కీల‌క‌మైన సాంకేతిక నిపుణులు కూడా ఈ మాటే అంటున్నారు. ఇదో గాలి వార్త అని కొట్టిప‌రేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

ఆఖరి రాగం పాడేసిన వల్లభనేని వంశీ !

వల్లభనేని వంశీ ఆఖరి రాగం పాడేశారు. ఇవే తనకు చివరి ఎన్నికలని అనేశారు. అయితే అది గన్నవరంలో . మరో చోట పోటీ చేస్తారా లేదా అన్నది చెప్పలేదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close