రామేశ్వరరావు కోసం రంగంలోకి “నెట్‌వర్క్”..!?

ఐటీ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న మైహోమ్ గ్రూపు సంస్థల యజమాని, తెలుగు మీడియాలో.. కొనుగోళ్లతో కలకలం సృష్టిస్తున్న మైహోమ్ రామేశ్వరరావును కాపాడేందుకు ఆయనకు చెందిన ” నెట్ వర్క్” .. విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా… తెలుస్తోంది. ఆ ” నెట్ వర్క్” ఆయన అమితంగా అభిమానించే ఓ స్వామిజీ కేంద్రంగా సాగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరుకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో చేస్తున్న జాయింట్ వెంచర్ కారణంగానే.. ఐటీ దాడులు జరిగినట్లు మైహోమ్ అధికారిక ప్రకటన చేసినా.. అసలు విషయం మాత్రం చాలా లోతుగా ఉందని.. ఇప్పటికే తేలిపోయింది. విషయం సీరియస్‌గా ఉండటంతో.. ఆయనను కాపాడేందుకు … చాలా పెద్ద ” నెట్ వర్క్” ప్రయత్నాలు చేస్తున్నట్లు.. కార్పొరేట్ లాబీలో గుప్పుమంటోంది.

36 గంటల సోదాల్లో దొరికిన అక్రమాలెన్ని..?

మైహోమ్ గ్రూప్ యజమానుల ఇళ్లు, కార్యాలయాల్లో.. 36 గంటల పాటు.. బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం సోదాలు చేసింది. పెద్ద ఎత్తున పత్రాలు, హార్డ్ డిస్క్‌లను తీసుకెళ్లారు. ఈ నెల పది, పదకొండో తేదీల్లో.. తమ ఎదుట హాజరు కావాలని.. జూపల్లి రామేశ్వరరావుతో పాటు.. ఆ సంస్థ బాధ్యతల్లో ఉన్న పలువురు బంధువులు, ఇతరులకు ఐటీ నోటీసులిచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో.. ఆ లావాదేవీల గుట్టుముట్లన్నీ బయటకు తీస్తే రాజకీయ కలకలం ప్రారంభమయ్యే సూచనలు ఉండటంతో.. విషయాన్ని సీరియస్‌గా తీసుకోకుండా.. సింపుల్‌గా.. వెళ్లిపోయేలా చేసేందుకు ప్రస్తుతం.. ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

రేంజ్లోనెట్ వర్క్ప్రయత్నాలు ..!

జూపల్లి రామేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన స్వామిజీ .. తనకు భక్తుడైన… మాజీ సీవీసీతో… రామేశ్వరరావుపై ఐటీ దాడుల విషయంలో చూసీచూడనట్లు పోవాలన్న లాబీయింగ్ నిర్వహిస్తున్నారంటున్నారు. ఆ మాజీ సీవీసీ… ఈ రామేశ్వరరావుకు వ్యక్తిగతంగా కూడా మిత్రుడే. సీవీసీగా పని చేసిన సమయంలో.. తనకు ఉన్న పరిచయాలతో.. ఆయన… ఐటీ శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారంటున్నారు. అదే సమయంలో.. స్వామిజీకి.. భక్తురాలిగా పేరున్న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ పేరు కూడా.. వారు వాడేసుకుంటున్నారని.. రామేశ్వరరావుపై ఐటీ దాడులు చేయడంపై.. ఆమె అసంతృప్తితో ఉన్నారని.. ఇలాగే కొనసాగిస్తే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని.. హెచ్చరికలు కూడా సంబంధిత అధికారులకు వెళ్తున్నాయని చెబుతున్నారు.

నాన్ సీరియస్ ఇష్యూగా మార్చేయగలుగుతారా..?

రియల్ ఎస్టేట్ కంపెనీని అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్న జూపల్లి రామేశ్వరరావు.. లావాదేవీలన్నీ వెలికి తీస్తే… రాజకీయంగా కూడా.. చాలా విషయాలు బయటకు వస్తాయన్న ప్రచారం ఉంది. గత లోక్ సభ ఎన్నికల్లో.. ఫండింగ్ నుంచి.. అనేక అంశాలు.. ఇందులో నుంచి వస్తాయంటున్నారు. అలాగే మీడియా సంస్థల కొనుగోళ్ల వ్యవహారంలోనూ.. బ్లాక్ మనీ లావాదేవీల చర్చ వచ్చింది. వీటన్నింటినీ నేపధ్యంలో ఆ పవర్ ఫుల్ స్వామిని ఉపయోగించుకుని రామేశ్వరరావు బయటపడే ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ఈ ప్రయత్నాల్లో నిర్మలా సీతారామన్ పేరును కూడా అసువుగా వాడేసుకుంటూండటమే… రాజకీయవర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close