బిగ్ బాస్: అభిజిత్ విన్నర్, సోహైల్ హైలెట్, అఖిల్ బకరా

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఫోర్ ముగిసింది. రకరకాల ఒడిదుడుకుల మధ్య కొనసాగిన ఈ సీజన్ ఫైనల్ షో వచ్చేసరికి చాలా గ్రాండ్ గా చేయడంతో సీజన్ గ్రాండ్ గా ముగిసిన ఫీలింగ్ వచ్చింది. చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ ఫంక్షన్ లో, అభిజిత్ టైటిల్ విన్నర్ గా నిలిస్తే, ఫైనల్ ఎపిసోడ్ లో సోహెల్ హైలెట్ అయ్యాడు . అయితే ఈ రెండు పరిణామాల మధ్య రన్నరప్ గా నిలిచిన అఖిల్ బకరాగా మిగిలినట్లు ప్రేక్షకులకు అనిపించింది. వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో మొదటి నుండి హాట్ ఫేవరెట్ గా ఉన్న కంటెస్టెంట్ అభిజిత్. పెద్దగా ఆడలేదు అని ఎప్పుడూ చిల్ అవుతూ ఉంటాడని తన పైన ఉన్న పెద్ద విమర్శ. అయితే టాస్క్ లో ఆడడం అన్నది బిగ్ బాస్ విజేతకు కావలసిన ఒక్క అంశమే కానీ అదే ప్రధాన అంశం కాదు. సీజన్ వన్ లో శివబాలాజీ సీజన్ టు కౌశల్ సీజన్ త్రీ లో రాహుల్ – వీళ్ళందరూ టాస్క్ ల విషయంలో బద్ధకస్తులే. అయితే అభిజిత్ కు యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కారణంగా మొదటి వారం నుండి కూడా మిగతా కంటెస్టెంట్ కి పడే ఓట్లకు , అభిజిత్ కి పడే ఓట్ల కి భారీ తేడా ఉంది. మొత్తం పోలయ్యే ఓట్లలో 40 శాతం అభిజిత్ కి పడితే మిగిలిన 60 శాతం మిగిలిన అందరు కంటెస్టెంట్స్ కు కలిసి పడేది. ఇదే తనను చివరికి విజేతగా నిలిపింది.

అయితే నిన్నటి ఎపిసోడ్ లో బాగా హైలెట్ అయిన భాగం సోహైల్ చిరంజీవి ల మధ్య జరిగిన సంభాషణ. తను స్వయంగా ఇంటి నుండి సోహైల్ కోసం మటన్ బిర్యానీ తీసుకువచ్చానని చిరంజీవి చెప్పడం , సోహైల్ దానికి ఆనందంతో గంతులు వేయడం జరిగింది. అక్కడితో ఆగకుండా సోహెల్ తీసే సినిమాలో తను చిన్న అతిథి పాత్ర వేస్తానని కూడా చిరంజీవి చెప్పడం దానికి సోహెల్ కన్నీటి పర్యంతం కావడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సోహెల్ మహబూబ్ కి ఇస్తానన్న ఐదు లక్షలు ఇవ్వనవసరం లేదని, మొత్తం డబ్బులు తానే ఇంటికి తీసుకెళ్లవచ్చు అని, మహబూబ్ కి తాను 10 లక్షలు వ్యక్తిగతంగా ఇస్తున్నానని చిరంజీవి చెప్పడం ఈ ఎపిసోడ్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది.

అయితే మూడోస్థానంలో బయటికి వచ్చిన సోహైల్, విన్నర్ గా మొదటి స్థానంలో నిలిచిన అభిజిత్ మధ్యలో రన్నర్ గా మిగిలిన అఖిల్ పరిస్థితి మాత్రం బకరా లా తయారయింది. ప్రైస్ మనీ లో సగభాగం డబ్బులు, చిరంజీవి తో సంభాషణ కారణంగా వచ్చిన క్రేజ్ ఇటు సోహెల్ పట్టుకుపోతే , సీజన్ విన్నర్ అన్న టైటిల్ ను మిగిలిన సగభాగం డబ్బులను, అభిజిత్ పట్టుకుపోయాడు. దాంతో అటు డబ్బులు, ఇటు టైటిల్ రెండు మిస్ అయిపోయి అఖిల్ బకరాగా నిలిచినట్లు ప్రేక్షకులకు అనిపించింది. పైగా చిరంజీవి కూడా అఖిల్ గురించి పెద్దగా మాట్లాడక పోవడం గమనార్హం. అదీ గాక, బకరా అన్న పదం కూడా అఖిల్ స్వయంగా తనకు తాను పెట్టుకున్న పదమే. సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి వచ్చిన తర్వాత, తాను మేక లా వెళ్లి పులి లా బయటి కి వచ్చాను అని చెప్పుకున్నాడు. అయితే దానికి అభిజిత్ – మేక ఎప్పుడూ పులి అవ్వదు బ్రదర్, బలి అవుతుంది అని ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పాపులర్ అయ్యింది.

ఏది ఏమైనా, డబ్బులు రాక, ఫైనల్ లో హైలైట్ అవక బకరా అయ్యాడనే విమర్శలు ఉన్నప్పటికీ, బిగ్ బాస్ షోలో పాల్గొనక ముందు ఎవ్వరికీ తెలియని అఖిల్ ఫైనల్ దాకా రావడం, తద్వారా వచ్చిన క్రేజ్ కెరీర్ కు ఉపయోగపడే అవకాశం ఉండటం చూస్తూ ఉంటే, షో ని తన కెరీర్ కి ఉపయోగ పడేలా చేసుకోవడం లో అఖిల్ నూటికి నూరు శాతం సఫలీకృతుడు అయ్యాడు అని చెప్పవచ్చు.

-Zuran

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close