సూపర్ రిచ్ బీజేపీ.. ఆస్తులు రూ. ఐదు వేల కోట్లు !

దేశంలో అన్ని రాజకీయ పార్టీలకు కలిపి స్థిరాస్తులు దాదాపుగా రూ. ఏడు వేల కోట్లు ఉంటాయని ఏడీఆర్ అనే సంస్థ అధికారిక డాక్యుమెంట్లు.. ఆయా పార్టీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా లెక్కించింది. ఈ ఏడు వేల కోట్లలో ఒక్క బీజేపీకే రూ. ఐదు వేల కోట్ల వరకూ ఉన్నాయి. మిగిలిన రెండు వేల కోట్లు అన్ని రాజకీయ పార్టీల ఆస్తులు. దేశాన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి సుదీర్ఘంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఆ పార్టీ పెద్దగా ఆస్తులు పోగేసుకోలేదు. బీఎస్పీ కన్నా తక్కువ ఆస్తులే ఆ పార్టీకి ఉన్నాయి.

బీజేపీకి స్థిరాస్తులు రూ. 4847 కోట్లుఉన్నాయి. దేశంలో మరే జాతీయ ప్రాంతీయ రాజకీయ పార్టీకి కనీసం రూ. వెయ్యి కోట్ల స్థిరాస్తులు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్థిరాస్తులు కేవలం రూ. 588 కోట్లు మాత్రమే. కాంగ్రెస్‌ కన్నా బీఎస్పీకి ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. రూ.698 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీల్లో సమాజ్ వాదీ పార్టీకి రూ . 563 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉండగా.. రెండో స్థానంలో ఉన్న టీఆర్ఎస్‌కు రూ. 301 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో అన్నాడీఎంకే, టీడీపీ ఉన్నాయి.

దేశంలో విరాళాల్లో అయినా ఆస్తుల్లో అయినా బీజేపికి సరితూగే పార్టీ లేదు. ఆస్తులు మాత్రమే కాదు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ప్రతి ఏడాది వందల కోట్లలో విరాళాలు వస్తూ ఉంటాయి. కొసమెరుపేమిటంటే ఇప్పుడు కూడా ఆ పార్టీ కార్యకర్తల నుంచి విరాళాల సేకరణ చేస్తోంది. పార్టీ బలోపేతం కోసం ఎంతో కొంత విరాళం ఇవ్వాలని ప్రజల్ని కోరుతూ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఎంత ఆస్తి.. ఆదాయం ఉన్నా.. బీజేపీకి సరిపోవడం లేదేమో ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close