ఆ వారెంట్ వెన‌క భాజ‌పా ఉంద‌ంటే ఎలా..?

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుకి ధ‌ర్మాబాద్ హైకోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌య‌మై భాజ‌పా నాయ‌కురాలు పురందేశ్వ‌రి స్పందించారు. చంద్ర‌బాబుపై కేంద్రం ప్ర‌భుత్వం గుర్రుగా ఉంది కాబ‌ట్టి, భాజ‌పా పాలిత రాష్ట్రం నుంచే తాజా స‌మ‌న్లు రావ‌డంతో అంద‌రూ ఆ పార్టీ వైపే వేలెత్తి చూపించే ప‌రిస్థితి ఉంది క‌దా అనే ప్ర‌శ్న‌కు ఆమె స‌మాధానం చెప్తూ… దీనికీ భాజ‌పాకీ ఎలాంటి సంబంధం లేదని ఆమె కొట్టి పారేశారు. ఎందుకు ఇలా వారెంట్ ఇష్యూ అయింద‌నే విష‌యాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, లేదా సంబంధిత మేజిస్ట్రేట్ ని అడిగి తెలుసుకోవాల‌ని ఆమె సూచించారు.

ఏం జ‌రిగినా కేంద్రం కుట్ర అన‌డం స‌రికాద‌న్నారు. ఇది కేంద్రానికి సంబంధం లేని అంశ‌మ‌నీ, మ‌హారాష్ట్ర కోర్టులో ఉన్న అంశ‌మ‌ని పురందేశ్వ‌రి అన్నారు. మహారాష్ట్రలో భాజ‌పా అధికారంలో ఉంది కాబ‌ట్టే, ఈ నోటీసులు వ‌చ్చాయ‌న‌డం స‌రికాద‌న్నారు! చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుంటూ పోతుంద‌నీ, వారి చర్యల్ని రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆపాదిస్తే ఎలా అని మీడియాని ప్ర‌శ్నించారు? ఆప‌రేష‌న్ గ‌రుడ అంటే ఏంటో త‌మ‌కు తెలీద‌నీ, అలాంటి ఏదైనా ఉంటే గ‌నుక దానికి భాజాపాతో ఎలాంటి సంబంధం లేద‌నీ, త‌మ పార్టీ నుంచి అలాంటి ఆప‌రేష‌న్లు ఏవీ జ‌ర‌గ‌డం లేద‌ని పురందేశ్వ‌ని కొట్టి పారేశారు. త‌మ‌పై అన‌వ‌స‌రంగా అభాండాలు వేస్తున్నార‌నీ, ఆరోప‌ణ‌లు చేస్తున్న‌వారు ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాల‌ని వ్యాఖ్యానించారు.

పొత్తు నుంచి టీడీపీ బ‌య‌ట‌కి వ‌చ్చిన త‌రువాత భాజ‌పా స‌హ‌క‌రించ‌డం లేద‌న్న‌ది ఏమాత్రం స‌రైంది కాద‌ని పురందేశ్వ‌రి అన్నారు! ఏయే అంశాల‌పై తాము స‌హ‌క‌రించ‌డం లేదో స్ప‌ష్ట‌త ఇవ్వాల‌న్నారు. అంశాలవారీగా స‌హ‌కారం గురించి మాట్లాడితే… దానిపై వివ‌రించే అవ‌కాశం త‌మ‌కూ ఉంటుంద‌న్నారు. పోల‌వ‌రం జాతీయ ప్రాజెక్టు అనీ, దాని నిర్మాణానికి తామే అడ్డుప‌డుతూ ఉంటే అంతిమంగా త‌మ‌కే ఇబ్బంది అవుతుంది కదా అన్నారు! ప్ర‌తీ విష‌యంలోనూ క‌క్ష అనేది ఆపాదించ‌డం ఆమోద‌యోగ్యం కాని అంశ‌మ‌ని పురందేశ్వ‌రి అన్నారు. త‌మ‌పై విమ‌ర్శ‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో తామూ వ్యూహాత్మ‌కంగానే ప్ర‌జ‌ల్లోకి వెళ్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close