నీటిలో కొమ్ములు చూపి… బీజేపీ బేరం

రాష్ట్ర‌ప‌తి ఎన్నిక వ్య‌వ‌హారాన్ని చాలా తెలివిగా న‌డిపిస్తున్నాన‌నుకుంటోంది భార‌తీయ జ‌న‌తా పార్టీ. ఇందుకోసం ఏర్పాటైన ముగ్గురు స‌భ్యుల క‌మిటీ సోనియా గాంధీ, సీతారం ఏచూరిల‌తో స‌మావేశ‌మైన తీరే దీనికి నిద‌ర్శ‌నం. దేశ ప్ర‌థ‌మ పౌరుని ఎన్నిక ఏకాభిప్రాయంతో పూర్త‌వ్వాల‌నుకోవ‌డం అభిల‌ష‌ణీయం అందులో ఎంత‌మాత్ర‌మూ త‌ప్పు లేదు. పోటీ ఏర్ప‌డుతుంది కాబ‌ట్టే.. రెండోసారి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ఉండ‌డానికి దివంగ‌త అబ్దుల్ క‌లాం అంగీక‌రించ‌లేదు. అదే క్ష‌ణం ఎవ‌రికీ చెప్పాపెట్ట‌కుండా రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ను వీడారు. ప్ర‌స్తుత రాష్ట్ర‌ప‌తి అంశంలో అలాంటి వివాద‌మేదీ లేదు. ప్ర‌ణ‌బ్‌కు రెండోసారి చాన్సివ్వ‌బోమ‌ని బీజేపీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. కానీ, ఏకాభిప్రాయంతోనే ఎన్నిక పూర్తికావాల‌ని కోరుకుంటోంది. నిజంగా అలాంటి అభిలాషుంటే ఏం చేయాలి? త‌మ అభ్య‌ర్థి ఫ‌లానా అని ముందు నిర్ణ‌యించుకోవాలి. ఆపై ప్ర‌తిప‌క్షాల గ‌డ‌ప తొక్కాలి. అదేమీ లేకుండా వెళ్ళి ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించాలంటే ఒక్క ఎంపీయే ఉన్న పార్టీ కూడా అంగీక‌రించ‌దు. 125ఏళ్ళు నిండిన కాంగ్రెస్ ఒప్పుకుంటుందా… నిలువెల్లా స‌మాన భావాన్ని నింపుకున్న సీపీఎం ఓకే అంటుందా. రెండు పార్టీలు కూడా అదే చెప్పాయి. అభ్య‌ర్థి ఎవ‌రో చెప్ప‌కుండా చ‌ర్చ‌లేమిటి అని ప్ర‌శ్నించాయి. వాటి భ‌యం వాటికుండ‌దా. తీరా ఓకే అన్న త‌ర‌వాత క‌ర‌డుగ‌ట్టిన ఆర్ఎస్ఎస్ వాదిని ప్ర‌థ‌మ పౌరునిగా ప్ర‌క‌టిస్తే….అదీ వాటి భ‌యం. అందుకు స‌మాధానంగా పోనీ మీ అభ్య‌ర్థి పేరు చెప్పండి… అంగీకార‌మైతే మ‌ద్ద‌తిస్తామ‌ని బీజేపీ బృందం వారి ముందు స‌న్నాయి నొక్కులు నొక్కింది. ఈ అంశంలో ఉద్ద‌వ్ ఠాక్రే ఒక మంచి పేరును తెర‌పైకి తెచ్చారు.. ఆయ‌నే వ్య‌వ‌సాయ శాస్త్రవేత్త స్వామినాథ‌న్‌. విజ్ఞులు.. రైతు స‌మ‌స్య‌ల ప‌ట్ల అవ‌గాహ‌న ఉన్న వారు ఆ స్థానాన్ని అలంక‌రిస్తే.. అన్న‌దాత‌కు క‌చ్చితంగా అగ్ర‌తాంబూల‌మందుతుంది. ఠాక్రే కూడా తొలుత మోహ‌న్ భ‌గ‌వ‌త్ పేరును సూచించారు.

ఏదేమైన‌ప్ప‌టికీ, అత్యున్న‌త‌మైన ప‌ద‌వికి అభ్య‌ర్థిని ఎంపిక చేసేట‌ప్పుడు అన్ని పార్టీలూ రాజ‌కీయాల‌ను ప‌క్క‌కు పెట్టి వ్య‌వ‌హ‌రించాలి. జైల్ సింగ్‌ను రాష్ట్ర‌ప‌తి చేసిన‌ప్పుడూ కాంగ్రెస్ మొండిగా వ్య‌వ‌హ‌రించింది. ఆన‌క ఆయ‌న రాజీవ్ గాంధీకి చుక్క‌లు చూపించారు. పంజాబ్ ప‌రిణామాలు దీనికి కార‌ణ‌మ‌ని వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

బీజేపీ ఇప్ప‌టికే సుష్మా స్వ‌రాజ్‌, అద్వానీ, ద్రౌప‌ది ముర్ము, వంటి పేర్ల‌ను తెర‌పైకి తెచ్చింది. అంద‌ర్నీ క‌న్ఫ్యూజ్ చేసేసి, ఏర్ప‌డిన వాతావ‌ర‌ణాన్ని సొమ్ము చేసుకుందామ‌నుకున్న‌ట్లుగా బీజేపీ వైఖరి ఉంది. అందుకే చెరువులో గేదెను ఉంచి, దాని కొమ్ములు చూపించి బేర‌మాడిన‌ట్లు వ్య‌వ‌హ‌రించింది. అందుకే కాంగ్రెస్‌, సీపీఎంలు చ‌క్క‌ని జ‌వాబిచ్చి పంపాయి. రేప‌టి స‌మావేశాలు ఇందుకు భిన్నంగా ఉండ‌క‌పోవ‌చ్చు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close