ఆత్మహత్యకు బిజెపి సిద్ధం!

బిజెపి నాయకుల్లో కొందరు రాజకీయ విజ్ఞతను మాత్రమే కాదు ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోతున్నారు! దీని ప్రభావం మొత్తం పార్టీమీదే పడుతోంది.

వెనుకబడిన కులాల రిజర్వేషన్ల గురించి పునరాలోచించవలసిన సమయం ఆసన్నమైందని బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందుఆర్.ఎస్.ఎస్ సర్‌సంఘచాలక్ మోహన్ భాగవత్ ప్రకటించారు. బీహార్‌లోని వెనుకబడిన వర్గాల ప్రజలందరు జె.డి.యు, ఆర్.జె.డి మహా కూటమికి ఓటు వేసి బిజెపిని ఓడించారు. బీసీ రిజర్వేషన్లపై తాను చేసిన వ్యాఖ్యలకు మోహన్ భాగవత్ ఆ తరువాత ఎన్ని వివరణలు ఇచ్చినా జరిగిన నష్టాన్ని పూడ్చలేకపోయారు. బి.సి రిజర్వేషన్ల గురించి చేసిన వ్యాఖ్యల మూలంగా బలహీన వర్గాలు దూరమైపోయి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవి చూడవలసి వచ్చింది. వెనుకబడిన కులాల ప్రజలు ఇప్పటికీ బిజెపిని అనుమానంగానే చూస్తున్నారు.

అయితే బిజెపి నాయకులు బీహార్ అనుభవం నుండి ఎలాంటి గుణ పాఠం నేర్చుకోలేదు.

8 నెలల్లో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు జరగబోతూండగా ఆ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ – బి.ఎస్.పి అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా పార్టీ విజయావకాశాలను నీరు కార్చారు. మాయవతి కోటి రూపాయలు తీసుకుని అసెంబ్లీ టికెట్ ఇస్తోంది, రెండు కోట్లు ఇస్తానని ఎవరైనా ముందుకు వస్తే ముందు చేసిన కేటాయింపును వెంటనే రద్దు చేస్తోంది, మాయావతి వేశ్య మాదిరిగా వ్యవహరిస్తోంది, వేశ్యలు కూడా మాయావతిలా వ్యవహరించరంటూ దయాశంకర్ సింగ్ వ్యాఖ్యానించడం రాజకీయంగా మాత్రమే కాదు మానవీయ, సామాజిక కోణాల నుంచి కూడా అతి తీవ్రమైనతప్పు.

తమది భిన్నమైన పార్టీ అని గొప్పగా చెప్పుకునే భాజపా నాయకుడు ఒక మహిళను అందునా దళిత మహిళలను వేశ్యతో పోల్చటం సిగ్గుచేటు. భారత దేశం సభ్యత, సంస్కృతిని తామే కాపాడుతామని ప్రచారం చేసుకునే భాజపా నాయకులు ఒక మహిళ పట్ల ఇలా వ్యవహరించటం ఆశ్చర్యం కలిగిస్తోంది.
మనువాదానికి బిజెపి ప్రతీక అనే ఆరోపణలను దయాశంకర్ సింగ్ లాంటి నాయకులు నిజం చేస్తున్నారు.

రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో పార్టీ నిధులకోసం కొన్ని సీట్లను డబ్బు తీసుకుని కేటాయిస్తాయనేది బహిరంగ రహస్యం. భాజపాతోపాటు ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దురాచారానికి మినహాయింపు కాదు. బి.ఎస్.పి అధ్యక్షురాలు మాయావతి సైతం ఇలాంటి దురాచారాన్ని పాటిస్తూండవచ్చు. తప్పు చేయని వారు ఇతరుల తప్పును ఎత్తి చూపించాలి తప్ప తాము తప్పు చేస్తే రాజకీయం, ఇతరులు తప్పు చేస్తే రాజకీయ వేశ్యా వృత్తి ఎలా అవుతుంది? మాయావతిని వేశ్యతో పొల్చటం వెనక రాజకీయ దురహంకారంతోపాటు సామాజిక దురహంకారం కూడా ఇమిడి ఉన్నది.

మాయావతిని వేశ్యతో పోల్చటం ద్వారా దయాశంకర్ సింగ్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బి.జె.పి విజయావకాశాలను బాగా దెబ్బ తీశారు. దేశంలోని మైనారిటీలు బిజెపి దరిదాపుల్లోకి రారు. దయాశంకర్ సింగ్ ఆరోపణల మూలంగా దళితులు కూడా భాజపాకు శాశ్వతంగా దూరమయ్యే పరిస్ధితి వచ్చింది. ఉత్తర ప్రదేశ్‌లోని దళితులెవ్వరు కూడా వచ్చే అసెంబ్లీలో భాజపాకు ఓటు వేయని పరిస్థితులు నెలకొంటున్నాయి.

భాజపాకి ఇప్పటికే బ్రాహ్మణ, వైశ్య వ్యాపారస్తుల పార్టీ అనే ముద్ర ఉన్నది. ఈ ముద్రను తొలగించేందుకు భాజపా అధినాయకత్వం నానా తంటాలు పడుతోంది. ఈ నేపథ్యంలో దయాశంకర్ సింగ్ బీఎస్‌పీ అధ్యక్షురాలిని వేశ్యతో పోల్చటం ద్వారా భాజపాకు దళిత వ్యతిరేక పార్టీ అనే శాశ్వత ముద్రను వేశారు. బీహార్ లో బిసిలను యుపిలో దళితుల్ని దూరం చేసుకున్న, కుంటున్న బిజెపి దేశంలో అన్ని వర్గాలు, కులాల ఆశలకు, ఆకాంక్షలకు ఎప్పటికైనా సమగ్రమైన ప్రాతినిధ్యం వహించగలుగుతుందా?

అధికారంలోకి వచ్చే తహతహలవల్ల కాంగ్రెస్ ఏకపక్షంగా చీల్చేసిన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా ఇస్తానని మాయమాటలు చెప్పి విభజనకు సహకరించిన కాంగ్రెస్ బిజెపి మాటమార్చి, వేస్తున్న పిల్లిమొగ్గల వల్ల రాష్ట్రప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే దారుణంగా ఓడిపోతుంది.

రాజకీయాల్లో హత్యలు వుండవు…ఆత్మహత్యలు మాత్రమే వుంటాయి. బిజెపిని రాజకీయ, సామాజిక దురహంకారాలే ఆత్మహత్యవైపు వేగంగా తీసుకుపోతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close