ఏపీలో బీజేపీ త్రిపుర ప్లాన్..! అక్కడి మాస్టర్ మైండే ఇక్కడ ఇన్చార్జ్ ..!!

“త్రిపురలో ఐదేళ్ల క్రితం.. మాకు ఒక్క సీటు లేదు.. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే జరుగుతుంది..” తెలుగుదేశం పార్టీ.. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ అన్న మాటలు ఇవి. ఈ మాటలు చెప్పిన చాలా కాలానికి కార్యాచరణ ప్రారంభించారు. త్రిపుర విజయంలో కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం పొందిన సునీల్ ధియోదర్ అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్‌కి కో ఇన్చార్జ్‌గా నియమించారు. అసలు ఇన్చార్జ్‌గా మురళీధరన్ అనే నేత వ్యవహరిస్తారు. సునీల్ ధియేదర్ ను కో ఇన్చార్జ్‌గా నియమించడంతో.. ఆటోమేటిక్‌గా ప్రచారం జరుగుతుంది. ఏపీని త్రిపురను చేస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తారు. ఇక అంతా రోటీన్‌గా సాగిపోతుంది.

సునీల్ దియోదర్ నరేంద్రమోడీకి సన్నిహితుడు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీకి వారణాసిలో ఎన్నికల మేనేజర్‌గా పని చేశారు. ఆ తర్వాత త్రిపురకు మకాం మార్చారు. అక్కడ పార్టీ కోసం పని చేశారు. ఈ ఆరెస్సెస్ నేత.. తెర వెనుక వ్యూహాలు రచించడంతో దిట్టగా పేర్కొంటారు. త్రిపురలో బూత్‌ల వారీగా ఆయన వేసిన ప్రణాళికలే.. స్వల్ప తేడాతో అయినా కొన్ని స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందంటారు. ఆరెస్సెస్‌లో ఉన్నప్పుడే మోడీకి బాగా పరిచయం. అందుకే.. ఆయనను గుజరాత్‌లోనూ ఉపయోగించుకున్నారు మోడీ. కాంగ్రెస్ కు పట్టు ఉన్న జిల్లాల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించేవారు. 2013లో దక్షిణ డిల్లీకి ఇంచార్జ్‌గా ఉన్నారు. 2014లో మహారాష్ట్రలో పని చేశారు.

అయితే ధియోదర్ ఎక్కడ పని చేసినా.. బీజేపీకి సంస్థాగతంగా బాగా కలసి వచ్చిన అంశాలు ప్లస్‌గా మారాయి. దక్షిణాదిలో ఆ పరిస్థితి లేదు. అందుకే రామ్ మాధవ్ మాటలను ఎవరూ పరిగణనలోకి తీసుకోలేదు. సునీల్‌కు క్రెడిట్ కట్టబెట్టేసిన త్రిపురలో ఉండేది పాతిక లక్షల మంది ఓటర్లు. అక్కడ యాభై వేల మందికిపై ఫుల్ టైమర్లను దింపి.. ఆరు నెలల ముందు నుంచి కార్యాచరణ రెడీ చేసుకున్నారు. కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారన్న ప్రచారం కూడా ఉంది. కానీ ఏపీలో ఐదు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆరెస్సెస్ లేదు. బీజేపీ క్యాడర్ లేదు. అందుకే బీజేపీ అతిశయోక్తులు చెబుతోందనుకున్నారు. కానీ బీజేపీ సునీల్ ధియోదర్ నియామకంతో బీజేపీ కాస్త సీరియస్‌గానే ఉందనే ఏభావన తెప్పించే ప్రయత్నం చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close