ఇద్దరు “ఆర్టీసీ రెడ్డి” గార్లకు కేబినెట్ హోదా !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి “సామాజిక న్యాయం” చేసింది. ఆర్టీసీ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఇద్దరి పేర్లు ఎ.మల్లికార్జున రెడ్డికి , మెట్టపల్లి చిన్నప్పరెడ్డి విజయానంద రెడ్డి. సాధారణ పరిపాలన శాఖ గత మే 17 న జారీ చేసిన జి.ఓ.ఎంఎస్.నెం.36 లో పేర్కొన్న విధంగా “ఎస్” కేటగిరీ క్రింద ఈ క్యాబినెట్ హోదాను ఖరారు చేయడం జరిగిందని ఉత్తర్వులలో పేర్కొన్నారు. నిజానికి జీవోలేమీ బయటకు రావడం లేదు కనుక.. గత మే పదిహేడో తేదీన ఏ జీవోజారీ చేశారో.. అందులో ఏముందో.. తర్వాతెప్పుడో బయటకు వస్తుంది.

సాధారణంగా కేబినెట్ హోదా ఉండే ఆర్టీసీ చైర్మన్‌కు మాత్రమే . వైస్ చైర్మన్‌లకు డైరక్టర్లకు కూడా కేబినెట్ హోదా ఇవ్వడం కాస్త విచిత్రమే. అయితే .. ప్రభుత్వ పెద్దలకు బాగా కావాల్సిన వాళ్లు కావడంతో.. మంత్రి హోదా ఇచ్చేందుకు ఏ మాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం.. వైసీపీ అధినాయకత్వం తీరుపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. పదే పదే ఒకే సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ వైసీపీ పెద్దలు వెనక్కి తగ్గడం లేదు.

ఇప్పటికి కేబినెట్‌లో ఉన్న మంత్రులు కాకుండా బయటకేబినెట్ హోదా ఇచ్చిన వారి సంఖ్యకు లెక్కే లేదు. సలహాదారుల్లో చాలా మందికి కేబినెట్ హోదా ఉంది. వారందరికీ ప్రజాధనం.. ఇతర అలవెన్స్ లు సిబ్బంది కేటాయించడం వల్ల కనీసం నెలకు ఆరేడు లక్షలు ఖర్చు వస్తుందన్న అంచనా ఉంది. వారంతా ఏం చేస్తారో తెలియదు కానీ.. కేబినెట్ హోదాను మాత్రం అనుభవిస్తున్నారు. ప్రోటోకాల్ పొందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close