జైసింహా… పోటీ అయినా ఇస్తుందా??

ఈ సంక్రాంతికి అంద‌రి క‌ళ్లూ… ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘అజ్ఞాత‌వాసి’పైనే. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబో అంటే ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు సంక్రాంతికి వ‌స్తున్నాం అంటూ ముందే చెప్పేశారు. జ‌న‌వ‌రి 10 డేట్‌… ఎప్పుడో ఫిక్స‌యిపోయింది. కాట‌మ‌రాయుడు ఫ్లాప్ త‌ర‌వాత‌.. ఆక‌లిగొన్న సింహంలా ఉన్నాడు ప‌వ‌న్‌. అ.ఆ హిట్టుతో త్రివిక్ర‌మ్ కూడా జోరుమీదే ఉన్నాడు. నాన్ బాహుబ‌లి రికార్డులంటూ బ‌ద్దలు కొడితే… అది ఈ సినిమాకే సాధ్యం అని సినీ జ‌నాలు కూడా న‌మ్ముతున్నారు. కేవ‌లం ప‌వ‌న్ సినిమా కోస‌మే.. రంగ‌స్థ‌లం వాయిదా ప‌డింది. ఆ స్థానంలో… ‘జై సింహా’ విడుద‌ల అవుతోంది. ఇదీ పండ‌గ సినిమానే అయినా… ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయ‌డం మిన‌హా… ప్ర‌మోష‌న‌ల్ ఈవెంట్స్ ఏమీ మొద‌లెట్ట‌లేదు. లెజెండ్ త‌ర‌వాత స‌రైన క‌మర్షియ‌ల్ హిట్ లేని బాల‌య్య‌.. గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణితో కాస్త ఉప‌శ‌మ‌నం పొందాడు. అయితే ఆ ఆనందాన్ని పైసా వ‌సూల్ ఆవిరి చేసింది. ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్‌పై కూడా ఎవ్వ‌రికీ ఎలాంటి న‌మ్మ‌కాలు లేవు. దాంతో ‘జై సింహా’కి ఉండాల్సిన బ‌జ్ కూడా లేకుండా పోయింది. ఇదేదో సెంటిమెంట్ సినిమా అంటూ.. ప్ర‌చారం చేయ‌డం మొద‌లెట్టి… అది కాస్త ఉసూరుమ‌నిపిస్తున్నారు. దాంతో ‘అజ్ఞాత‌వాసి’కి జై సింహా క‌నీస పోటీ ఇస్తుందా అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. బాల‌య్య సినిమా అటూ ఇటూ అయితే… ప‌వ‌న్ సోలో బ్యాటింగ్ మొద‌లైపోతుంది. కేవ‌లం ‘జై సింహా’పై న‌మ్మ‌కంతోనే ర‌వితేజ ‘ట‌చ్ చేసి చూడు’ ఈ సంక్రాంతి బ‌రిలో దిగ‌బోతోంద‌ని స‌మాచారం. ‘జై సింహా’ నుంచి ఓ టీజ‌రో, ట్రైల‌రో వ‌చ్చి… అది న భూతో అన్న‌ట్టు ఉంటే త‌ప్ప – ‘జై సింహా’ కోసం మాట్లాడుకోవ‌డం మొద‌లెట్ట‌రు సినీ జ‌నాలు. మ‌రి అలాంటి హంగామా ఏమైనా టీజ‌ర్లో ఉంటుందేమో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close