సీబీఐకి రివైజ్డ్ షెడ్యూల్ పంపిన కల్వకుంట్ల కవిత !

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరో తేదీన తన నివాసంలో సీబీఐ అధికారులు తన వద్ద వివరణ తీసుకోవచ్చని ఇంతకు ముందు ప్రకటించిన కల్వకుంట్ల కవిత హఠాత్తుగా షెడ్యూల్ మార్చేసుకున్నారు. ఆరో తేదీన ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని..ఆ రోజు తాను తీరికగాలేనని ఆమె సీబీఐకి మెయిల్ కి చేశారు. ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో మీకు అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్ లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని పేర్కొన్నారు.

తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత పునరుద్ఘాటించారు. దర్యాప్తునకు సహకరించడానికి గానూ పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు సమావేశం అవుతానని లేఖలో తెలిపారు.సీబీఐ నుంచి నోటీస్ వచ్చిన తర్వాత వరసుగా రెండు రోజుల పాటు సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్ నుంచే న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపారు. మొదట ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కావాలని సీబీఐకి లేఖ రాశారు. ఆ రెండూ.. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉన్నాయని పై నుంచి సమాచారం వచ్చింది.

దీంతో వెబ్ సైట్లో ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్‌ను పరిశీలించిన కవిత.. వాటిలో తన పేరు లేదని నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. “సిబిఐ తన వెబ్ సైట్ లో పొందుపరిచిన ఎఫ్ఐఆర్ ని క్షుణ్ణంగా పరిశీలించాను మరియు అందులో పేర్కొని ఉన్న నిందితుల జాబితాను కూడా చూశాను. దానిలో నా పేరు ఎక్కడా లేదన్నారు. అయితే.. కవిత న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close