‘మెర్సల్‌’కు మతం రంగు… గమనిస్తున్నారా మోడీ?

తమిళనాడు కేంద్రంగా దేశవ్యాప్త రాజకీయ దుమారం రేపింది హీరో విజయ్‌ నటించిన మెర్సల్‌ చిత్రం. కేంద్ర ప్రభుత్వ జిఎస్టీ తదితర పన్ను విధానాలపై తనకు తోచిన, తెలిసిన రీతిలో విమర్శలు చేయడంతో… దీనిపై రాజకీయ రగడ రాజుకున్న సంగతి తెలిసిందే. ఎక్కడ రాజకీయం ప్రవేశించునో అక్కడ అన్ని విలువలూ నిశించును… అన్నట్టుగానే… ఈ మంట నుంచి చలికాచుకోవాలి అనుకుంటున్న రాజకీయ పక్షాలు తోచిన రీతితో వ్యాఖ్యానాలు చేస్తూ మంటను రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

దీనిపై స్పందించిన రాహుల్‌గాంధీ చేసిన ట్వీట్‌లో ఈ సినిమాకీ తమిళ సంస్కృతికీ ముడిపెట్టేశారు. ఆ మేరకు తమిళుల్లో ఆత్మగౌరవానికి సంబంధించిన ఆగ్రహాన్ని రగిలించేందుకు ప్రయత్నించారు. సినిమా అనేది భాషా సంస్కృతులకు సంబంధించి తమిళుల లోతైన భావ వ్యక్తీకరణ అని ఆయన వ్యాఖ్యానించడం ఆశ్చర్యకరం. తమిళ గౌరవాన్ని డీమానిటైజ్‌ చేయద్దంటూ ఆయన మోడీని వేడుకోవడం ద్వారా దీని ద్వారా తాను పొందాలనుకున్న రాజకీయ లబ్ధి ఎలాంటిదో చెప్పకనే చెప్పేశారు. సరే… ప్రధాన విపక్షం, మోడీ హవాను అడ్డుకోవడానికి నానా పాట్లు పడుతోన్న వ్యక్తి కాబట్టి ఆయన ఏం ట్వీటు తున్నాడో ఆయనకే తెలియనంత గందరగోళంలో ఉండొచ్చు. కాని అధికారంలో ఉన్న భాజాపా సైతం అదే ఇంకా చెప్పాలంటే అంతకు మించిన రీతిలో దిగజారి ఈ వివాదానికి మతం రంగును పులిమే ప్రయత్నం చేయడం విషాదం. దీనికి తమిళనాడు రాష్ట్ర భాజాపా నేత రాజా విమర్శ ఒక ఉదాహరణ…ప్రభుత్వాన్ని విమర్శించడానికి ప్రతి ఒక్కరికీ అర్హత ఉంది. అయితే అది వాస్తవాల ఆధారంగా మాత్రమే జరగాలి అంటున్న రాజా… ఆ సినిమా హీరో విజయ్‌ మతం గుర్తొచ్చే రీతిలో ‘విజయ్‌ జోసెఫ్‌’ అంటూ సంబోధించారు. అంతేకాదు… మెర్సల్‌ సినిమా నిర్మాత కూడా క్రిస్టియన్‌ కావచ్చునని, ఆ విషయం తానింకా నిర్ధారించుకోవల్సి ఉందంటున్నాడాయన.
సన్నివేశాలివి…

భాజాపా బదులిదీ…

మెర్సల్‌ సినిమాలో ఓ సన్నివేశంలో వడివేలు అనే తమిళ నటుడు సింగపూర్‌లో తన ఖాళీ వాలెట్‌ని ఓ దొంగకి చూపిస్తాడు. ధ్యాంక్స్‌ టూ డిజిటల్‌ ఇండియా అంటాడు. (దీనిలో అంతగా డీమానిటైజేషన్‌ని విమర్శించిందేమిటో మరి) ఇక మరో సన్నివేశంలో ప‌త్రికా సమావేశంలో మాట్లాడే హీరో… కేవలం 7శాతం జిఎస్టీ వసూలు చేస్తున్న సింగపూర్‌ ఉచితంగా వైద్యం అందిస్తోంది 28శాతం వసూలు చేస్తున్న మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అని నిలదీస్తాడు. అంతే కాకుండా మన దేశంలో కట్టాల్సింది గుడులు కాదని, ఆసుపత్రుల్ని అని బుద్ధి చెబుతాడు. ఇప్పటికీ ప్రభుత్వాసుపత్రుల్లో సరైన వైద్యం అందక, ఆక్సిజన్‌ సిలిండర్లు లేక పిల్లలు చనిపోయే పరిస్థితులున్నాయని గుర్తు చేస్తాడు. (తాజాగా గత ఆగస్టు నెలలో భాజాపా ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్‌లోని గోరక్‌పూర్‌లో 70 మంది పిల్లలు చనిపోయిన ఉదంతం దీని ద్వారా గుర్తొస్తే తప్పేముంది?)

నిజానికి దేశ,ప్రజా సమస్యలపై సినిమాల్లో కొద్దో గొప్పో చర్చకు రావడం హర్షణీయ పరిణామం. ఇలాంటి వాటిని చక్కని స్ఫూర్తితో స్వీకరించాల్సింది పోయి దీనిపై భాజాపా నేతలు ప్రతి విమర్శలకు దిగారు. సినిమాలో విమర్శలు అబద్ధాలన్నారు. సింగపూర్‌లో ప్రత్యేకంగా మెడికల్‌ ప్రీమియం వసూలు చేస్తున్నారని కాబట్టి అది ఉచిత వైద్యం అనలేం అన్నారు. అయినప్పటికీ అక్కడ వైద్యం దొరకడం ప్రజలకు కష్టంగానే ఉందన్నారు. సరే… ఇవన్నీ ఆ సినిమాలో లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు అనొచ్చు. కాని… హీరో మతానికి దీదనికి ముడిపెట్టడం ఏమిటి? అని అడిగిన ప్రశ్నకు భాజాపా నేత రాజా సమాధానం ఏమిటి అంటే… ‘‘ఈ సినిమాలో విజయ్‌ గుడికి బదులు ఆసుపత్రులు కట్టాలంటున్నాడు. అదే మాట చర్చిల విషయంలో అనగలడా? గత 20 ఏళ్లలో దాదాపు 17,500 చర్చిలు, 9,700 మసీదులు తమిళనాడులోనే కట్టారు. అదే సమయంలో కేవలం 370 గుడులు మాత్రమే కట్టారు’’

అయ్యా… ఇక్కడ మీకు ఉండాల్సిన కనీస అవగాహన ఏమిటంటే… సంభాషణలు రాసేది విజయ్‌ కాదు. పలికించెడి వాడు వేరే. ఒకవేళ ఆయన కూడా క్రిస్టియనో, ముస్లిమో అంటారా? మీ ఇష్టం…. ఇక చర్చిలు, మసీదులు ఎన్నయినా కడుతుండవచ్చు గాక… కాని అవి ఇంకా కావాలని ఎక్కడైనా ఆందోళనలు గాని నిరసనలు గానీ జరిగితే దాన్ని కూడా ఇలాగే విమర్శించవచ్చునేమో… మన దగ్గర చాలినన్ని దేవాలయాలు ఉన్నాయి కదా… ఇంకా ఎందుకు అనే ఆ డైలాగ్‌ వెనుక పరమార్ధం కావచ్చు కదా. అయినా సినిమాలో లేవనెత్తిన మిగిలిన అంశాలన్నింటికీ బదులు చెప్పిన మీరు… ఆసుపత్రుల్లో సరైన వసతులు లేవు అనే లోపాన్ని గురించి బదులు చెప్పకుండా దీనికి వివాదాస్పద రంగు పులమడం ఏమిటి? అంటే దీనికి మీ దగ్గర సమాధానం లేదనా? అయినా ఒక సినిమాలోని ఒక డైలాగ్‌ను పట్టుకుని మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడడం అనేది సబబేనా? మోడీగారు మీ నేతల తీరు గమనిస్తున్నారా?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

ఆ విషయంలో కేసీఆర్‌కే క్లారిటీ ఉంటే ఇన్ని కష్టాలు వచ్చేవి కావేమో ?

కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ ప్రజల నమ్మకాన్ని మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బస్సు యాత్ర చేస్తున్నారు. అందులో ఆయన ఒకటే ప్రధానంగా చెబుతున్నారు. అదేమిటంటే దేవుడు తనను తెలంగాణ కోసమే పుట్టించారని...

అవన్నీ వైసీపీ దింపుడు కళ్లెం ప్రయత్నాలే !

ఓటమి తప్పదని తెలిశాకా గెలవడానికి సిల్లీ ఆలోచనలు చేస్తూంటారు రాజకీయ నేతలు. వైసీపీ నేతలకు ఇలాంటివి కొన్ని ఎక్కువే వస్తూంటాయి. వాటిని అమలు చేసేందుకు చేసిన ప్రయత్నాలు కూడా అంతే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close